బనగానపల్లె(చైతన్యరథం): పట్టణంలోని తన క్యాంపు కార్యాల యంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 91 మందికి దాదాపు రూ.41 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. గత ఏడాదిన్నర కాలంలో బనగానపల్లె నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 484 మంది లబ్ధిదారులకు రూ.3.78 కోట్లు అందజేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ కింద రూ.3.20 కోట్లు, ఎల్వోసీ కింద రూ.58 లక్షలు అందజేసినట్లు తెలిపారు. చెక్కుల పంపిణీ అనంతరం వైద్య సహాయం పొందిన రోగుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూటమి పాలనలో క్షేత్రస్థాయిలో అభివృద్ధి- సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. పేదల పాలిట కల్పతరువు.. సీఎం రిలీఫ్ ఫండ్ అని పేర్కొన్నారు. నిరుపేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా కల్పిస్తుందని తెలిపారు.

















