చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చేసి..ప్రజల రుణం తీర్చుకుంటా..!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన

by చైతన్యరధం
Jul 12, 2024 at 6:22am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అభివృద్ధి చేసి..ప్రజల రుణం తీర్చుకుంటా..!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ప్రతి ఎకరాకు సాగునీరు
  • పోలవరం ఎడమ కాల్వ పనులకు త్వరలోనే టెండర్లు
  • రూ.800 కోట్లతో మొదటి దశ పనులు..2.20 లక్షల ఎకరాలకు సాగునీరు
  • కృష్ణా-గోదావరి-పెన్నా-వంశధార నదుల అనుసంధానంతో కరవు దూరం
  • గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర్రం అన్ని విధాలా దివాళా
  • అధికారులు కార్పెట్‌ కల్చర్‌ మానుకోవాలి
  • అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాల్వను పరిశీలించిన సీఎం

పాయకరావుపేట/దార్లపూడి(చైతన్యరథం): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుజల స్రవంతిని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు. సుజల స్రవంతి పనుల్లో టీడీపీ హయాంలో చేసిన పనులు తప్ప గత ప్రభుత్వంలో కొంచెం కూడా పురోగతి లేదన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, ఒక్క అంగుళం కూడా పని ముందుకు కదల్లేదన్నారు. ఐదేళ్లలో ఎక్కడైనా తట్ట మట్టి వేశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో గురువారం చంద్రబాబు నాయుడు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. అంతకుముందు కాల్వ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనకు వచ్చిన సీఎంకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

ప్రజల రుణం తీర్చుకునే బాధ్యత నాపై ఉంది
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఎక్కువ ఆదరించిన ప్రాంతం ఉత్తరాంధ్ర. కూటమి అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చా. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా వచ్చాయి. అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారు. రాజకీయాల్లో విర్రవీగితే సరిచేసే శక్తి ప్రజలకే ఉంది. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ఇప్పుడు ప్రజలు గెలిచారు..రాష్ట్రాన్ని నిలబెట్టడానికి మేము కష్టపడతాం. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశాం. పోలవరంను 72 శాతం నేను పూర్తి చేశాను. ఒక దుర్మార్గుడు వచ్చి డయాఫ్రం వాల్‌ను గోదావరిలో కలిపేశారు. కాఫర్‌ డ్యామ్‌లు డ్యామేజ్‌ అయ్యాయి. 2021 జూన్‌ కు నీళ్లు రావాల్సి ఉండగా నిర్వీర్యం చేశారు. పోలవరం రాష్ట్రానికి వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి పోలవరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొస్తే ప్రతి ఎకరాకు నీరు అందించొచ్చు.. కరువు అనే సమస్య ఉండదు. గత ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం పూర్తవ్వడానికి ఆలస్యం అవుతోంది. అందువల్ల పురుషోత్త పట్నం, పుష్కర లిఫ్ట్‌ల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావొచ్చు. అండర్‌ పాస్‌ లకు కూడా టెండర్లు పిలిచి త్వరితగతిన పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.

సంబంధితవార్తలు

No Content Available

నదుల అనుసంధానంతో కరవు నివారణ
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ఎడమ కాలువ 214 కి.మీ పూర్తి కావాల్సి ఉంది. మొదటి విడతగా కాలువను 93 కి.మీ పూర్తి చేయడానికి రూ.800 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో అనకాపల్లి పరిధిలో లక్ష ఎకరాలకు నీరందించవచ్చు. ఇప్పుడే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేశాక మరింత వేగవంతంగా పనులు పూర్తి చేస్తాం. ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పోలవరం ఎడమ కాల్వ ద్వారా సాగునీరు అందించవచ్చు. 23 టీఎంసీల నీళ్లతో అనకాపల్లి జిల్లాలో ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరందించవచ్చు. రూ.800 కోట్లు ఖర్చు చేసి 93వ కి.మీ వరకు 2.20 లక్షల ఎకరాలకు నీరందించేందుకు మొదటి విడతలో పనులు పూర్తి చేస్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార నది దాకా వెళ్తుంది. వంశధార-గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని సీఎం స్పష్టం చేశారు

గత ప్రభుత్వ అసమర్థత కారణంగా 3 షుగర్‌ ఫ్యాక్టరీలు మూత
ఈ ప్రాంతంలోని షుగర్‌ ఫ్యాకర్టీ రైతులకు కూడా హామీ ఇస్తున్నా.. గత అసమర్థ ప్రభుత్వం కారణంగా 3 షుగర్‌ ఫ్యాక్టరీలు పడకేశాయి. ఇక్కడి రైతులకు కూడా న్యాయం జరగాలి.. వారి భాగస్వామ్యంతోనే ఫ్యాక్టరీలు నడవాలి. రైతులకు న్యాయం చేస్తాం. శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాం. నేను కష్టపడతాను.. సంపద సృష్టించి ఆదాయం పెంచి పేదలకు పంచుతాం. మీకు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉంది. దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు ఎన్డీయేకు ఇచ్చారు. ఇది చారిత్రక విజయం. 95 వేల మెజారిటీతో అభ్యర్థులను గెలిపించారు. మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత. దొంగ మాటలు చెప్పేవాళ్ల మాటలు నమ్మి బజారులో తిరగనిస్తే బతుకులు ఏమవుతాయో ఆలోచించాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు.
ఆడంబరాలు మానుకోవాలి
ప్రజల ఆదాయం పెంచే మార్గం చూస్తాం. నైపుణ్య గణన చేసి యువతలో నైపుణ్యం పెంచేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి అందిస్తున్నాం. నేను, పవన్‌ కళ్యాణ్‌, మోదీ చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారు. నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తయారు చేస్తాం. సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు అందించాం…కానీ నాటి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని చెప్పింది. పెంచిన పింఛన్లు ఇస్తూనే ఉద్యోగులకు సైతం సకాలంలో జీతాలు అందించాం. మాపై అభిమానం అనే పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ప్రజలు కూడా నేతలకు సహకరించాలి. మీ శ్రేయస్సే మా అభిమతం. నవ్వినా కొట్టే వ్యక్తి మొన్నటిదాకా పాలించారు. మీరంతా సంతోషంగా ఉండాలి.. మీ సంతోషం కోసం మేము పని చేస్తాం. గత ముఖ్యమంత్రి ఎక్కడికైనా వస్తే చెట్లు నరికి, పరదాలు కట్టి, షాపులు మూయించేవారు. ఇక్కడ అధికారులు కార్పెట్లు వేశారు.. ఇక్కడికి రాజులు రాలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఈ కార్పెట్‌ కల్చర్‌ అధికారులు వదలాలి. అందరం మట్టిలోనే పుట్టాం.. చనిపోయినా మట్టిలోకే పోతాం. ఆడంబరాలు అవసరం లేదు.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తే చాలు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకుంటాం
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ఏ విధంగా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నాం.. కానీ ఒక పనికి మాలిన పార్టీ ఉంది. ఆ పార్టీ నేతల పొట్ట నిండా అబద్ధాలే.. వారికి కల వచ్చిందంటా…అమ్మడానికి నేను ఒప్పుకున్నానంట..దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని పోరాడి ఫ్యాక్టరీని సాధించుకున్నాం. అబద్ధాలు చెప్పే వారి మాటలు ఖండిస్తూ వాస్తవాలు చెప్పాలి. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచేశారు..వీళ్లను వదలిపెట్టను. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మీద విషం కక్కుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో వాజపేయి ప్రభుత్వంలో నేను స్టీల్‌ ప్లాంట్‌ కాపాడాను. మళ్ళీ నేను స్టీల్‌ ప్లాంట్‌ కాపాడతానని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ నాడు కేంద్ర ఆర్ధిక సాయంతో సంస్థను కాపాడుకున్నామన్నారు. ఇప్పుడు కూడా స్టీల్‌ ప్లాంట్‌ ను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసునని, ఆ బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వైసీపీ చిల్లర ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు.

జగన్‌ అనే భూతాన్ని భూస్థాపితం చేయాల్సింది ప్రజలే
సూపర్‌-6 హామీలు కూడా త్వరలో అమలు చేస్తాం.. ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం. బాధ్యతలు చేపట్టి 30 రోజులు కూడా కాలేదు.. అయినా చెప్పినమాట ప్రకారం పింఛన్‌ ను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచాం. మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేలు ఒకేసారి అందించాం. దేశంలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టం. మొదటి సంతకం డీఎస్సీపైనే పెట్టి 16,347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపాం. మీ భూములు కొట్టేసేందుకు తెచ్చిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను కూడా రద్దు చేశాం. 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి ప్రారంభించబోతున్నాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం గత ప్రభుత్వానిది. పెట్టుబడిదారులతో మాట్లాడుతుంటే, మీ రాష్ట్రంలో భూతం ఉంది…అది లేస్తే ఏమవుతుందోనని అంటున్నారు. ఆ భూతానికి భూత వైద్యం చేసి శాశ్వతంగా భూ స్థాపితం చేసే బాధ్యత ప్రజలకే అప్పజెప్పామని వారితో చెప్పా. ఆ భూతాన్ని కంట్రోల్‌ చేసే వైద్యులు ప్రజలనని చంద్రబాబు అన్నారు.

Tags: విశాఖ స్టీల్‌ప్లాంట్‌
Previous Post

ఎర్రచందనం దొంగలను వదిలేది లేదు

Next Post

రైల్వే సమస్యలు పరిష్కరించండి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్యకర్త
@ May 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist