- విశాఖ కార్యకలాపాలు శుభారంభం
- మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
విజయవాడ(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం ఐటీ రంగంలో వేగంగా ముందు కెళుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. విశా ఖపట్నాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా మరో కీలక మైలు రాయిగా కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కావడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. రూ.3,740.31 కోట్ల భారీ పెట్టుబడులతో కాగ్నిజెంట్ సంస్థ విశాఖలో కార్యకలాపాలు ప్రారం భించడం ద్వారా సుమారు 41,967 మందికి ప్రత్యక్షంగా ఉద్యో గావకాశాలు కల్పించబడనున్నట్లు మంత్రి వివరించారు. ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో, సులభ వ్యాపార విధా నాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తు న్నాయని పేర్కొన్నారు. విశాఖను అంతర్జాతీయ స్థాయి ఐటీ గమ్య స్థానంగా తీర్చిదిద్దడంలో కాగ్నిజెంట్ వంటి సంస్థల రాక కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ, ఎలక్ట్రా నిక్స్, స్టార్టప్ సంస్థలు రాష్ట్రానికి రావడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి ఆదాయం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముం దుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.















