అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఢల్లీి పర్యటన ఖరారైంది. డిసెంబరు 18, 19 తేదీల్లో ఆయన న్యూఢల్లీి లో పర్యటించనున్నారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు వెలగపూడి సచివాలయంలోని హెలిప్యాడ్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి ఢల్లీికి సీఎం చంద్రబాబు బయలు దేరి వెళ్లనున్నారు. ఆ రాత్రి వన్ జనపథ్‌లో ఆయన బస చేయ నున్నారు. 19వ తేదీ సాయంత్రం 6. 40 గంటలకు ఢల్లీి నుంచి తిరిగి విజయవాడకు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. అయితే 18వ తేదీ రాత్రి.. కేంద్రంలోని పలువురు కీలక నేతలతో పాటు.. ఉన్నత స్థాయి అధికారులను సీఎం చంద్రబాబు సమావే శమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 19వ తేదీ కూడా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఏపీకి సంబంధించిన పలు పెండిరగ్ ప్రాజెక్టులు, రాష్ట్రా నికి అవసరమైన కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబం ధించిన అనుమతులతో పాటు ఆమోదం అంశాలపై వారితో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 19వ తేదీతో ముగియనున్నా యి. ఈ నేపథ్యంలో ఆ ముందు రోజు సీఎం చంద్రబాబు న్యూఢ ల్లీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఢల్లీి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.













