హనుమంతరాయ చౌదరి మరణం టీడీపీకి లోటని వ్యాఖ్య
తిరుపతి (చైతన్య రథం): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నేత అయిన హనుమంతరాయ చౌదరి మరణం జిల్లాలో పార్టీకి లోటని వ్యాఖ్యానించారు. ఆయన మృతి కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. వార్డు సభ్యుడిగా ప్రజాసేవను ప్రారంభించి, సర్పంచ్‌గా, మార్క్ ఫెడ్ చైర్మన్‌గా, పదేళ్లపాటు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపారని కొనియాడారు. పార్టీ బలోపేతానికి హనుమంతరాయ చౌదరి ఎనలేని సేవలు అందించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఐటీడీపీ యువనేత మృతిపై చంద్రబాబు విచారం
చిత్తూరు జిల్లా ఐటీడీపీ అధికార ప్రతినిధి బి రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందిన రవి రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. రవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. రవి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి… కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.