ఢిల్లీ (చైతన్య రథం): భారతదేశం యొక్క తదుపరి అద్భుత సృష్టిగా నిలవనున్న ప్రపంచస్థాయి రాష్ట్ర రాజధాని అమరావతి మహా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునే గొప్ప అవకాశాన్ని జాతీయ, అంతర్జాతీయ రియల్టర్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. న్యూఢల్లీిలో శుక్రవారం నిర్వహించిన క్రెడాయ్ జాతీయ కాన్‌క్లేవ్‌వ్‌కు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సంభాషించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘‘భారత తదుపరి ప్రపంచస్థాయి రాష్ట్ర రాజధాని నిర్మించడానికి అమరావతి ఒక తరంలో ఒకసారి లభించే అవకాశాన్ని సూచిస్తుంది. దూరదృష్టిగల డెవలపర్లు నమ్మకంగా పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. మైలురాయి ప్రాజెక్టులను సృష్టించడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఐకానిక్ నగరాన్ని రూపొందించడంలో భాగస్వామిగా ఉండటానికి ఇంతకుమించిన సమయం దొరుకుతుందని నేననుకోను. అదే విషయాన్ని న్యూఢల్లీిలో జరిగిన క్రెడాయ్ నేషనల్ కాన్‌క్లేవ్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లతో సాగిన సంభాషణలలో చెప్పాను. అమరావతి యొక్క ప్రత్యేక ప్రయోజనాలు, దీర్ఘకాలిక సామర్థ్యాన్నీ వివరించాను’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.












