చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు పరిష్కరించండి

చైతన్యరధం by చైతన్యరధం
August 23, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు పరిష్కరించండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: ప్రతిపక్షనేతగా ఉన్నపుడు జగన్‌ ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులని రెగ్యులర్‌ చేయాలని, థర్డ్‌ పార్టీ వ్యవస్థ రద్దు చేసి యాజమాన్యమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విజ్జప్తిచేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి లోకేష్‌ సోమవారం ఒక లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది. ప్రతిపక్షనేతగా వున్నప్పుడు మీరు ప్రజాసంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలు గుర్తు చేద్దామని ఈ లేఖ రాస్తున్నాను. ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల కోసం ఆనాడు కార్చింది మొసలి కన్నీరు అని నేటి మీ నిర్లక్ష్య వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. పాదయాత్రలో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల దీక్ష శిబిరాల వద్దకి వెళ్లారు. ప్రతీ జిల్లాలోనూ కాంట్రాక్టు కార్మికులూ తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలు మీకు ఇచ్చినప్పుడు ఏ హామీలిచ్చారో మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్హత, అనుభవం, సర్వీసుని పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్‌ చేస్తామని, యాజమాన్యానికి-కార్మికులకు మధ్య ఉన్న దళారీ వ్యవస్థని రద్దు చేసి విద్యుత్‌ సంస్థ నుంచే జీతాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నేను హామీ ఇవ్వలేదనడానికి కూడా వీలు కాదు. అన్నీ రికార్డెడ్‌గా వున్నాయి. మోసపూరిత హామీలిచ్చిన మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకి ఇచ్చిన హామీని ఇప్పటికైనా గుర్తుకుతెచ్చుకుని నెరవేర్చేందుకు కృషి చేస్తారని కోరుతున్నాను. దశాబ్దాలకాలంగా ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌ కో, డిస్కంలలో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగభద్రత లేకుండా పనిచేస్తున్నారు. చాలీచాలని వేతనాలు థర్డ్‌ పార్టీ దళారీలు మింగేయగా మిగిలింది మీరు విపరీతంగా పెంచేసిన ధరలకి ఆహారం అవుతోంది.  పాదయాత్రలో 13 జిల్లాల్లోనూ కాంట్రాక్టు కార్మికులు మిమ్మల్ని కలిసినప్పుడు ఇవే హామీలు అన్నిజిల్లాల్లోనూ ఇచ్చారు.  ప్రతిపక్షనేతగా వున్నప్పుడు మీ అడుగులో అడుగు వేసి మీ వెంట నడిచిన కాంట్రాక్టు కార్మికులని సీఎం అయ్యాక విస్మరించడం దగా చేయడమే. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులని విద్యుత్‌ సంస్థలో విలీనం చేసుకుని ప్రొబేషనరీ కాలం ముగిశాక 24 వేలమందికి పైగా రెగ్యులర్‌ చేశారు. విద్యుత్‌ జేఏసీ ఆందోళనలకి పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యుత్‌శాఖా మంత్రి, ఇంధనశాఖ కార్యదర్శి, విద్యుత్‌ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు-అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు యాజమాన్యం నుంచే వేతనాలు అందించేందుకు, ఆరోగ్యబీమా, ప్రమాదబీమా, పదవీ విరమణ ప్రయోజనాలు, కారుణ్య నియామకాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఎలా అమలుచేస్తున్నారో అధ్యయనం చేసి సిఫారసు చేయాలని 60 రోజులు గడువు విధించారు. ఈ మినిట్స్‌ ఆఫ్‌ మీటింగ్‌ 17.11.2020న అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఏడాది 16.2.2022న నిర్‌లహించిన మీటింగ్‌లోనూ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ప్రయోజనాల కల్పన ప్రణాళిక ఉంటుందని తేల్చేశారు. 60 రోజులు కాస్తా 660 రోజులు దాటిపోయింది. విద్యుత్‌శాఖా మంత్రి కూడా మారిపోయారు. సీఎం ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. కాంట్రాక్టు/అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకి వేతనాలు ఇచ్చే థర్డ్‌ పార్టీ సంస్థ కమీషన్లు, జీఎస్టీ రూపంలో ఏడాదికి 149 కోట్లు కార్మికుల కష్టాన్ని మింగేస్తోంది. దళారీ సంస్థ దోపిడీ వల్ల కాంట్రాక్టు కార్మికునికి 26 వేలు వేతనం రావాల్సి వుంటే..కటింగులన్నీ పోను చేతికి 18,500 వస్తోంది. సెలవుల్లేకుండా, రాత్రీ పగలనే తేడా లేకుండా ప్రమాదకరమైన పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు అరకొర జీతాలతో జీవితాలు అగమ్యగోచరం అయ్యాయి. ప్రమాదమో, ఆరోగ్య సమస్య తలెత్తితే చందాలు ఎత్తితే తప్పించి కష్టం ఒడ్డెక్కే పరిస్థితి లేదు. మీరు సీఎం అయ్యి మూడేళ్లు అవుతోంది..ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన మేరకు హామీ నెరవేర్చాలని కోరుతున్నాను. చాలామందికి వయస్సు దాటిపోతుంది. మరికొందరు ప్రమాదాలు, అనారోగ్యాలతో రెగ్యులర్‌ ఆశని చంపేసుకుంటున్నారు. మానవత్వంతో ఆలోచించి, రెగ్యులర్‌ చేస్తామనే ఆశతో వారి ఓట్లును దండుకున్నామనే విషయాన్ని మరొక్కసారి గుర్తుకు తెచ్చుకుని మీ మాట తప్పుడు ఆనవాయితీని బ్రేక్‌ చేయాలని ఆశిస్తున్నాను. థర్డ్‌ పార్టీ వ్యవస్థని రద్దు చేసి, విద్యుత్‌ యాజమాన్యమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యార్హత, వయస్సు, అనుభవం పరిగణనలోకి తీసుకుని తక్షణమే రెగ్యులర్‌ చేయాలని లోకేష్‌ ముఖ్యమంత్రికి విజ్జప్తి చేశారు.

Tags: అవుట్‌ సోర్సింగ్‌అసెంబ్లీఆరోగ్యబీమాకర్ణాటకకాంట్రాక్టుకార్మికులుగుజరాత్‌జగన్‌జెన్‌ కోట్రాన్స్‌కోడిస్కంతమిళనాడుతెలంగాణథర్డ్‌ పార్టీ వ్యవస్థదీక్ష శిబిరాలునారా లోకేష్నిర్లక్ష్య వైఖరిపదవీ విరమణపాదయాత్రప్రజాసంకల్ప యాత్రప్రతిపక్షనేతప్రమాదబీమాప్రొబేషనరీబాలినేని శ్రీనివాసరెడ్డిమహారాష్ట్రమొసలి కన్నీరురెగ్యులర్‌విజ్జప్తివిద్యుత్‌సమాన వేతనంహామీ
Previous Post

గౌరవం కోసం రోడ్డెక్కె పరిస్థితి వచ్చింది

Next Post

మూడేళ్లల్లో మూడు పరిశ్రమలైనా తెచ్చారా?

Next Post
మూడేళ్లల్లో మూడు పరిశ్రమలైనా తెచ్చారా?

మూడేళ్లల్లో మూడు పరిశ్రమలైనా తెచ్చారా?

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.