గత పాలకులు విధ్వంస విలయతాండవంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. దెబ్బతిన్న వ్యవస్థలను మళ్లీ గాడిన పెట్టి.. రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మెరుగైన పాలనా విధానాలు, పాలసీలతో కూటమి ప్రభుత్వం పడిన కష్టానికి ఫలితమే.. 2025-26 ఆర్ధిక సంవత్సం రెండో త్రైమాసికంలో వృద్ధి రేటులో సాధించిన అద్భుత ఫలితాలు. ప్రతీ త్రైమాసికం, ఆర్థిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నా. ఛిన్నాభిన్నమైన వ్యవస్థను సరి చేయడం చేతకాదని పారిపోవటం లేదు. రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తాను. కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీస్థాయిలో ప్రజలు మద్దతు పలికారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని -ప్రస్తుత ఆర్థిక గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలో వృద్ధి పరుగందుకుంది. సెకెండ్ క్వార్టర్ జీఎస్టీపీ వృద్ధి 11.28 శాతంగా నమోదైంది. సెకెండ్ క్వార్టర్లో లో జీవీఏ 11.3 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం చివరినాటికి 17.11 శాతం జీఎస్టీపీ వృద్ధి సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
– సీఎం చంద్రబాబు నాయుడు
- రెండో త్రైమాసికంలో అద్భుత ఫలితాలు, వేగవంతం
- ఆర్థిక సంవత్సరం చివరినాటికి 17.11 శాతం జీఎస్టీపీ వృద్ధి లక్ష్యం – 2025-26 తొలి ఆర్ధిక
- గణాంకాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి
- స్థూల ఉత్పత్తిలో పరిశ్రమలు, వ్యవసాయం, సేవారంగాల పురోగతి -పరకామణి చోరీ చిన్న విషయమని సమర్ధింపు ఏమిటి..?
- తప్పుచేసిన ఈవోను సస్పెండ్ చేసి… అరెస్ట్ చేయించాం
- మీడియా సమావేశంలో జగన్ వైఖరిని నిలదీసిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): గత పాలకులు విధ్వంసం సృష్టించిన వ్యవస్థలను గాడిలో పెట్టి… రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గతంతో పోలిస్తే మెరుగైన వృద్ధి రేటు నమోదవ్వడానికి కారణం ఇదేనన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన గణాంకాలను మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుత ధరలవద్ద నమోదైన ఆర్థిక వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వ్యవసాయం, ఉత్పత్తి, సేవారంగాలు నమోదు. చేసిన వృద్ధి గణాంకాలను ముఖ్యమంత్రి వెల్లడించారు. “విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. ప్రతీ త్రైమాసికం, ఆర్థిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఛిన్నాభిన్నమైన వ్యవస్థను సరి చేయడం చేతకాదని పారిపోవటం లేదు. రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తాం. కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీస్థాయిలో ప్రజలు మద్దతు పలికారు. ప్రజలు సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశారు. ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి గతంలో అప్పులు తెచ్చారు. మూలధన వ్యయం చేయకపోవటంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు.
కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని ముందుకు తీసుకెళ్లగలిగాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూల ధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టాం. సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లాం. వాట్సాప్ గవర్నెన్సు ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లాం. డీఫంక్ట్ అయిన వివిధ కేంద్ర పథకాలను మళ్లీ పునరుద్ధరించాం. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను మళ్లీ రివైవ్ చేయగలిగాం. గత పాలకులు పీక్ లోడ్ సమయంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ను యూనిట్కు రూ.15 చొప్పున కొనుగోలు చేసిన పరిస్థితి. పీపీఏల రద్దుతో విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనానికి నష్టం కలిగించారు. ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎలాంటి. నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వ్యవస్థలను నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. సమర్ధవంతమైన సాగునీటి వ్యవస్థను కూడా చేపట్టాం. తద్వారా 950 టీఎంసీ నీరు రిజర్వాయర్లలో నిల్వ ఉంది. ఏపీ బ్రాండ్ను పునరుద్ధరించాం. క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
వారసత్వంగా అప్పులే కాదు …చెత్త కూడా ఇచ్చారు
“రూ.13లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నాం. ఎస్ఐపీబీల ద్వారా రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఆమోదం తెలియ చేశాం. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకువచ్చాం. గత పాలకులు విద్యాశాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోంది. జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకూ అవగాహన రావాల్సిన అవసరం ఉంది. జీవన ప్రమాణాలు పెరగాలంటే… జీఎస్టీపీ పెరగాలనే అంశం ప్రజలకు తెలియాల్సి ఉంది.
విభజనవల్ల రాష్ట్రానికి వ్యవస్థీకృతమైన నష్టం జరిగింది. 2019–24లో జరిగిన పాలనవల్ల వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. గత పాలకుల విధ్వంస పాలనవల్ల గ్రోత్ రేట్ తగ్గి రూ.7 లక్షల కోట్ల జీఎస్టీపీ కోల్పోయాం. గ్రోత్ రేట్ లేకపోవటం వల్ల రూ.76, 195 కోట్ల ఆదాయం కోల్పోయాం. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలిగింది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రానికి బ్రాండ్ తగ్గితే బ్యాంకులు ఎక్కువ వడ్డీలు చెల్లించాలని డిమాండ్ పెడతాయి. దీని ద్వారా రెవెన్యూ జీఎస్టీపీలో రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్నదే ఎప్పుడూ నా ఆలోచన” అని సీఎం వివరించారు.
అభివృద్ధికి బాటలు వేస్తున్నాం
“25 ఏళ్ల క్రితం రూపొందించిన పాలసీల కారణంగా తెలంగాణ ఇప్పుడు ఆదాయం సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ అభివృద్ధి సాధించాలని ట్వీట్ చేశాను. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సహా వివిధ మౌలిక సదుపాయాలు కల్పించటం వల్ల -పరిశ్రమల రంగంలో వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో నీటి భద్రత, అగ్రిటెక్, లాజిస్టిక్స్ వ్యయం తగ్గింపు, ప్రాడెక్టు పర్ఫెక్షన్, డీప్ టెక్ లాంటి 10 సూత్రాలను సమర్థంగా అమలు చేస్తున్నాం. వెంటిలేటర్లో ఉన్న రాష్ట్రానికి తిరిగి ఊపిరి పోయగలిగాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ఏడాది కొనుగోలు చేస్తున్నాం. ప్రజలు తినే ఆహారానికి అనుగుణంగా పంటలను పండించటం
ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. దీనిపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఉద్యాన, ఆక్వా కల్చర్ రంగాలను కూడా మరింతగా ప్రోత్సహిస్తున్నాం. సమీకృత వ్యవసాయం ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో అగ్రిటెక్ అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో రైతు సేవా కేంద్రం వారీగా వ్యవసాయ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ప్రకాశం సహా 9 రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన క్లస్టర్గా తయారు చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
వైసీపీ తలా తోక లేని పార్టీ
“తప్పులు చేస్తారు. తప్పులు చేసిన వారిని సమర్థిస్తారు. ఇలాంటివారు సమర్థిస్తున్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారు. పరకా మణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరమని కామెంట్ చేయడాన్ని ఏమనాలి…? ఓ దేవాలయంలో ఈవో చోరీ చేస్తే తక్షణం సస్పెండ్ చేశాం, అరెస్ట్ చేయించాం. దేవాలయంలో దేవుడి దగ్గర సొమ్మును చోరీ చేస్తే దానిని సమర్థిస్తారా..? కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారు..?
గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇస్తే దానినీ సమర్ధించారు. కల్తీ నెయ్యి స్వామివారి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘటనను వెనకేసుకు వస్తారా..? ఇలాంటి వారితో రాజకీయం చేయడానికి నాకు సిగ్గు అనిపిస్తోంది. సింగయ్య అనే వ్యక్తిని కారు కింద తొక్కించేసి ఆయన భార్యతోనే మాపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం పెట్టించారు. హైదరాబాద్ నుంచి మద్యం సేవిస్తూ వచ్చి ప్రమాదంలో ఓ పాస్టర్ మరణిస్తే.. ఆ ఘటనను కూడా హత్యకింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రతీ అంశంలోనూ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయ ముసుగులో నేరాలు చేసిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం” అని సీఎం చంద్రబాబు
హెచ్చరించారు.
2025-26 రెండో త్రైమాసికంలో
11.28 శాతం జీఎస్టీపీ వృద్ధిరేటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసికానికి సంబంధించిన రాష్ట్రస్థూల ఉత్పత్తి,గ్రాస్ వాల్యూ అడిషన్ సహా వివిధ గణాంకాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. వాటి వివరాలు
రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్టీపీ మొత్తంగా 11,28 శాతం వృద్ధి నమోదు.
* రూ.4,00,377 కోట్ల విలువైన జీఎస్టీపీ నమోదు. ఇదే సమయానికి భారతదేశ జీడీపీ 8.7 శాతంగా ఉంది.
* గత ఏడాది 2వ త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్టీపీ 10.17 . 2 2 .3,59,778. అంటే ఈ త్రైమాసికంలో జీఎస్టీపీ గత ఏడాదితో పోల్చుకుంటే 1.11 శాతం పెరిగింది.
2వ క్వార్టర్ కి రాష్ట్ర జీవీఏ 11.30 శాతం ఉండగా, జాతీయ జీవీఏ 8.7 శాతంగా నమోదైంది.
* రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏ. 10.70 శాతం, పరిశ్రమల రంగం 12.20 శాతం, సేవల రంగం 11.30 శాతం వృద్ధి నమోదైంది.
* జాతీయస్థాయిలో జీవీఏ వృద్ధి చూస్తే వ్యవసాయ రంగం 1.8 శాతం, పరిశ్రమల రంగం 8.5 శాతం, సేవల రంగం 10.6 శాతంగా ఉంది.
వ్యవసాయం-అనుబంధ రంగాలు:
* ఈ త్రైమాసికంలో వ్యవసాయం- అనుబంధ రంగాల్లో జీవీఏ విలువ రూ.1,25,571 కోట్లు, పరిశ్రమల రంగం విలువ రూ.86,456 కోట్లు, సేవల రంగం విలువ రూ.1,60,075 కోట్లు.
పరిశ్రమల రంగంలో అనూహ్య ప్రగతి వచ్చింది. 2.78 శాతం నుంచి 12.20 శాతానికి వృద్ధి పెరిగి… జాతీయ సగటును దాటింది.
వ్యవసాయ రంగంలో 11.43 శాతం, హర్టీకల్చర్ 4.35 శాతం, ఫిషింగ్, ఆక్వాకల్చర్ రంగాల్లో 26.27 శాతం, లైవ్ స్టాక్ 4.18 శాతం వృద్ధిరేటు సాధించాం.
వరి 3.64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా… గతంతో పోలిస్తే 23.95 శాతంమేర వృద్ధి వచ్చింది.
అరటిలో అనూహ్యంగా 37.31 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గతంతో పోలిస్తే ఇది 151.2 శాతం అధికం. మత్స్య దిగుబడి 17.30. శాతం, రొయ్యలు 27.09 శాతం మేర పెరిగింది.
໖ 6.68 , 7.95 పెరగ్గా…. పాల దిగుబడి 3.62 శాతం తగ్గింది.
పరిశ్రమల రంగం:
పరిశ్రమల రంగానికి వచ్చే సరికి మొత్తంగా 12.20 శాతం వృద్ధి నమోదుకాగా… ఇందులో మైనింగ్- క్వారీయింగ్లో 18.43 శాతం పెరిగింది.
తయారీ రంగంలో రూ.41,201 కోట్ల విలువైన జీవీఏ నమోదు కాగా 11.66 శాతం పెరుగుదలు ఉంది. నిర్మాణం రంగంలో కూడా పురోగతి కనిపిస్తోంది. 11.81 శాతం పెరుగుదలతో జీవీఏ రూ.28,625 కోట్లకు చేరింది.
విద్యుదుత్పత్తిలో 19.12 శాతం వృద్ధి నమోదైంది. ఉత్పత్తి 26,837 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. అలాగే విద్యుత్ వినియోగం కూడా 4.17 శాతం పెరిగింది.
సేవల రంగం:
ఆతిధ్య రంగంలో రూ.25,292 కోట్ల విలువైన జీవీఏతో 8.5 శాతం వృద్ధి నమోదైంది. ఈ రంగంలో ట్రేడ్, మాల్స్, రెస్టారెంట్లలో 6.95 కోట్ల ఫుట్ ఫాల్ కనిపిస్తోంది..
* రవాణా, గిడ్డంగులు తదితర విభాగాల్లో 5.24,927 5 జీవీఏతో 5.99 శాతం వృద్ధి. 21.55 లక్షల వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
జల రవాణా ద్వారా 52.5 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. అలాగే ఈత్రైమాసికంలోనే 14.98 లక్షలమంది విమానాల్లో ప్రయాణించారు.
* రియల్ ఎస్టేట్ రంగంలో రూ.32,951 కోట్లతో 14.31 శాతం పెరుగుదల నమోదైంది.
2014-19, 2019-24 మధ్య వృద్ధిలో వ్యత్యాసం
2014-19 మధ్య జీఎస్టీపీ వృద్ధి 13.49 శాతంగా నమోదు కాగా… 2019-24 మధ్య జీఎస్టీపీ 10.32 శాతానికి పడిపోయింది.
మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది 2024-25లో రూ.15.93 లక్షల కోట్లతో 12.02 శాతానికి జీఎస్టీపీ పెరిగింది. అదే సమయానికి జాతీయ జీడీపీ వృద్ధి 9.8 శాతంగా ఉంది.
2019-24 మధ్య వృద్ధి రేటు పడిపోవడంతో రూ.7 లక్షల కోట్ల జీఎస్టీపీ రాష్ట్రం నష్టపోయింది. 2014-19 వృద్ధి రేటు తర్వాత కాలంలోనూ కొనసాగివుంటే అదనంగా రూ.76,195 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది.
తలసరి ఆదాయంలో కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. 2014-2019 మధ్య 13.21 … 2019-24 శాతం పెరగ్గా 9.8 శాతం మాత్రమే పెరిగింది.
2024-25 ఆర్ధిక సంవత్సరంలో11.89 శాతంమేర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైంది.
రాష్ట్రంలో తలసరి ఆదాయం 2018-19లో . 1,54,031 ఉండగా, 2023-24 .2,37,9513 కి మాత్రమే పెరిగింది.
. 2024-25కల్లా ఇది రూ.2,66,240కి తీసుకువచ్చాం. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం . 2,05,324 గా ఉంది.
2014-19 మధ్య నమోదైన 13.49 శాతంవృద్ధి రేటు కొనసాగితే… సర్ణాంధ్ర-2047 లక్ష్యంనాటికి రూ.292 లక్షల కోట్ల జీఎస్టీపీ, రూ.49 లక్షల తలసరి ఆదాయం నమోదయ్యే అవకాశాలున్నాయి.
అదే 15 శాతం వృద్ధి నమోదైతే 25 రెట్లకు జీఎస్టీపీ పెరిగి రూ.396 లక్షల కోట్ల విలువకు చేరుకుంటుంది. తలసరి ఆదాయం కూడా రూ.66 లక్షలు అవుతుందని అంచనా.
2025-26 తొలి అర్థ సంవత్సరం ఫలితాలు:
ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం రాష్ట్ర జీఎస్టీపీ రూ.7,58,270 కోట్లు కాగా… జీవీఏ విలువ . 7,03,767 5 ໖.
వ్యవసాయ రంగంలో 10.26 శాతం వృద్ధితో రూ.2,07,073 కోట్లుగా నమోదైన జీవీఏ.
పరిశ్రమల రంగంలో 12.05 శాతం వృద్ధితో రూ.1,79,299 కోట్లుగా నమోదైన జీవీఏ.
సేవల రంగంలో 11 శాతం వృద్ధితో రూ.3,17,396 కోట్లుగా నమోదు.
గత ఏడాది ఇదే కాలానికి జీఎస్టీపీ 9.89 ఉండగా, అది ఇప్పుడు 10.91 శాతానికి పెరిగింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలలు జాతీయ జీడీపీ 8.8 శాతంగాఉంది.
ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో తొలి రెండు త్రైమాసికాలు కలిపి 41 శాతం జీఎస్టీపీ లక్ష్యాన్ని చేరుకున్నాం.
2025-26 ఆర్ధిక సంవత్సరం లక్ష్యం:
రానున్న రెండు త్రైమాసికాలు కలిపి జీవీఏ రూ.10,09,033 …జీఎస్టీపీ రూ.11,07,434 కోట్లు సాధనే లక్ష్యం.
2025-26 ఆర్థిక సంవత్సరంలో జీవీఏ .రూ. 17,12,800 జీఎస్టీపీరూ.18,65,704 .మొత్తంగా 17.11 శాతం వృద్ధి సాధించాలనేది లక్ష్యం.
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలంలో సాధించిన జీఎస్టీపీ 44.64 శాతం, . రూ.7,58,270
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలంలో సాధించిన జీవీఏ 41.09 శాతం, రూ.7,03,767
వ్యవసాయ రంగంలో 16.47 శాతం వృద్ధితోరూ.6,02,728 కోట్ల జీవీఏలక్ష్యం. … సాధించింది 34.36 శాతం… విలువ రూ.2,07,073 .
పరిశ్రమల రంగంలో 17.32 శాతం వృద్ధితో రూ. 3,99,358 కోట్ల జీవీఏ లక్ష్యం సాధించింది 44.90 శాతం… విలువ . రూ.1,79,299 కోట్లు.
సేవల రంగంలో 16.12 శాతం వృద్ధితో రూ.7,10,714 కోట్ల జీవీఏ లక్ష్యం సాధించింది 44.66 … 2 . రూ.3,17,396 కోట్లు.














