అమరావతి(చైతన్యరథం): అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి తీసుకు రావడానికి సహాయక సిబ్బంది అలుపెరగక శ్రమిస్తున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం రాత్రింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తుఫాన్ ధాటికి ధ్వంసమైన మౌలిక వసతులను వేగంగా పునరుద్ధరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలి పారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పంచు కున్న ఒక వీడియో ఆకట్టుకుంటోంది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన సమయంలో కూడా వర్షంలో తడుస్తూ కూలిపోయిన భారీ వృక్షాలను, విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్న పారిశుధ్య, విద్యుత్ సిబ్బంది దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. తుఫాన్ ధాటికి రాకపోకలకు ఆటంకం కలగకుండా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రోడ్లను పునరుద్ధరించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై లోకేష్ స్పందిస్తూ అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టించి వెళ్లింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు తుఫాను తీరం దాటే సమయంలో అస్తవ్యస్తమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రభుత్వ సిబ్బంది, టీడీపీ నేతలు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణ పరిస్థితి తీసుకొ చ్చేందుకు నిద్రాహారాలు మాని పనిచేశారు. ప్రకృతి విపత్తు వేళ అంతా కలిసి జన జీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేయడం.. సమష్టి తత్వానికి, సేవాస్ఫూర్తికి నిదర్శనంగా నిలు స్తోందని తెలిపారు. మన నగరాలు, పట్టణాలు, గ్రామాలను అర్నాబ్ తుఫాన్ ప్రభావం నుంచి వేగంగా కోలుకునేలా చేయడం కోసం రాత్రింబవళ్లు అలుపెరగకుండా శ్రమిస్తున్న వేలాది మంది ప్రభుత్వ సిబ్బందికి ధన్యవాదాలు అంటూ #Together Again st Cyclone Arnab హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశంసించారు.

