- నగరపాలక డివిజన్ల పునర్విభజనకు ఆమోదం
- స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా కసరత్తు
తిరుపతి(చైతన్యరథం): తిరుపతి నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66కు పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగరపాలక సంస్థపరిధిలో రాజకీయ కసరత్తు మరింత వేగం పుంజుకోనుంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ అధికారులు ఏప్రిల్ చివరి వారంలో 50 డివిజన్లను 66గా పునర్విభజించే ప్రక్రియను చేప ట్టారు. డివిజన్ల సరిహద్దులు, జనాభా తదితర అంశాలను పరిగణ నలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. గడువులో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను అధికారులు స్వీకరించి పరిశీలించారు. అవస రమైన చోట స్వల్ప మార్పులు, చేర్పులు చేసి తుది ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అనంతరం 66 డివిజన్లతో కూడిన తుది జాబితాను ప్రభుత్వానికి పంపించారు. తాజాగా ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపడంతో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. 66 డివిజన్లకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తిరుపతి నగర రాజకీ యాల్లో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. పెరిగిన డివిజన్లలో రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, ఆయా పార్టీల బలా బలాలపై రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది.













