విశాఖపట్నం (చైతన్య రథం): ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి రాష్ట్ర ప్రజలకు అందుబాటు లోకి రానుంది. ఈ మేరకు విశాఖ అనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణా నికి సంస్థ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డితో కలిసి విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ భూమిపూజ, శంకు స్థాపన చేశారు. ముందుగా ఎండాడ వద్ద వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్కు ఏబజీ హాస్పిటల్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రికి సంబంధించి రూపొందించిన ఏవీని వీక్షించారు.
రూ.2వేల కోట్ల పెట్టుబడి. 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు
విశాఖలో నెలకొల్పనున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ దశలవారీగా ఐదేళ్లలో 2వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 9వేల మందికి ఉద్యోగాలు రాను న్నాయి. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. విశాఖలో 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరా ల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనుంది. ఒకే క్యాంపస్లో వైద్యసేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపా యాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ను నెలకొల్పనుంది. మొదటి దశ నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు.
రెండో దశ నిర్మాణాలను 350 పడకల సామర్థ్యంతో రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్లో అందించే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.. అందించే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్ వైస్ చైర్మన్ పీవీఎస్ రాజు, డైరెక్టర్ జీవీ రావు, సీఈవో సామ్ రిజ్వీ, విశాఖ ఏఐజీ హాస్పిటల్స్ విశాఖ డైరెక్టర్ కే.రాకేష్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, విశాఖ పోలీసు కమిషనర్ డా. శంఖభ్రత బాగ్బీ, ఏఐజీ హాస్పిటల్స్ సీవోవో కాప్రీ జలోట తదితరులు పాల్గొన్నారు.












