- రాష్ట్రాన్ని అభివద్ధి బాట పట్టిస్తున్నాం
- శ్రమకోర్చి వ్యవస్థలను గాడిన పెడుతున్నాం
- ఏపీ బ్రాండ్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం
- సంక్షేమం-అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్నాం
- కేంద్రం అండ లేకుంటే కోలుకోవడం కష్టమయ్యేది
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలూ తెలుసుకోవాలి
- ఎన్నడూ లేనంతగా రెండేళ్లలో ఎంతో కష్టపడ్డాను
- ఆదాయం పెంచే కార్యక్రమాలకు సమ ప్రాధాన్యం
- వైసీపీ నేతలు పీపీపీని వ్యతిరేకిస్తారు కానీ..
- భోగాపురం క్రెడిట్ మాత్రం వారిదంటారు
- అంతర్జాతీయ అవకాశాలకు గేట్‌వే ఎయిర్‌పోర్టు
- హామీలు అమలు చేయబట్టే ప్రజల్లో ఆదరణ
- రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల
- విభజన-విధ్వంస నష్టాలు`ప్రభుత్వ చర్యలు
- భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర ప్రజంటేషన్
అమరావతి(చైతన్యరథం): విభజన నాటి కంటే 2019-24 మధ్యన జరిగిన విధ్వంసం వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపో యిం దని, ఈ సమస్యను అధిగమిస్తూ అభివృద్ధి`సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తన జీవితంలో ఎన్నడూ పడనంత కష్టాన్ని గత రెండేళ్లల్లో పడ్డానని తెలిపారు. రాష్ట్రాన్ని మొత్తంగా గాడిలో పెట్టే శామని చెప్పడం లేదన్న ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేలా..పోయిన బ్రాండ్‌ను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టామని వివరించారు. ఆర్థిక వెసులుబాటు లేకున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు.. ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలు ప్రజలకూ తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో రెండేళ్ల ఆర్థిక స్థితిగతులపై ప్రొగ్రెస్ రిపోర్ట్ ప్రజెంట్ చేస్తూ ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు.
2019-24 మధ్య రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యా యి..ప్రజలు, అధికారులు, ఉద్యోగులు భయపడే పరిస్థితి ఏర్పడిం ది..నాటి పాలనపై ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవమే 2024 ఎన్ని కల ఫలితాలని చెప్పారు. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని, బ్రాండ్ ఏపీని తిరిగి తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం..అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం..చెప్పిన విధంగా ఇచ్చిన తేదీల్లో సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ముందుగా అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు. అందుకే పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలికవసతులు, కొత్త రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఆ మేరకు కొత్త పాలసీలు తెస్తుందని వివరించారు.
సమర్థవంతంగా పనిచేస్తే ప్రజలు సహకరిస్తారు
ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే ప్రజలు కూడా అభివృద్ధిలో ఏ స్థాయిలో భాగస్వాములు అవుతారో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చాటిచెప్పింది. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెక్కలు వచ్చిన భావన ప్రజల్లో ఏర్పడింది. ఉత్తరాంధ్రను అంతర్జాతీయ అవకాశా లకు గేట్వేగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. దీన్ని ప్రజలు గ్రహించినందు వల్లే ఎయిర్‌పోర్టు ప్రారం భోత్సవానికి ప్రజల నుంచి చక్కటి మద్దతు లభించిందని తెలిపా రు. పీపీపీ పద్దతిలో ప్రాజెక్టులు చేపడుతుంటే వ్యతిరేకించిన వారు.. అదే పీపీపీ పద్దతిలో చేపట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ క్రెడిట్ మాత్రం తమదని చెప్పుకుంటున్నారని విమ ర్శించారు. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి.. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతాయి..ఆదాయం పెరిగితే మరింత సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
2019-24..గుంతల రోడ్లు..గుదిబండ అప్పులు
2019-24 మధ్య రాష్ట్రాన్ని విష వలయంలోకి నెట్టారు..రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు అభివృద్ధి వేగాన్ని నిలిపి వేశారు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో అప్పులు పెంచుకుంటూ వెళ్లారు..చివరకు రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. 2019లో వైసీపీ పరిపాలన ప్రారంభిం చిన తీరు ప్రజావేదిక కూల్చివేతతోనే స్పష్టమైందని పేర్కొన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ప్రజావేదికను కూల్చారు. దీన్ని గర్వం అనాలా? మదం అనాలా? దీనికి పేరే లేదేమో? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో విధానపరమైన నిర్ణయాల కంటే విధ్వంసకర చర్యలకే గత ప్రభుత్వంలో ప్రాధా న్యం ఇచ్చిందని మండిపడ్డారు. 2019-24 మధ్య రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కి నెట్టారని వ్యాఖ్యానించారు. మౌలికవసతుల ప్రాజెక్టుల్లో పురోగతి ఆగిపోయింది..రోడ్ల నిర్వహణ సరిగా లేక గుంతలమయంగా మారాయని తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గిందన్నారు. పరిశ్రమలు రావాల్సిన చోట ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని, కొత్త పెట్టుబడులు లేకుండా పోయాయని పేర్కొన్నా రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం తీవ్రంగా దిగజార్చిందని మండిపడ్డారు. నాటి ప్రభుత్వ నిర్వాకం వల్ల అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు తీర్చే సామర్థ్యం లేని రాష్ట్రంగా నీతి ఆయోగ్ పేర్కొనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆదాయాలు తగ్గుతున్నా ఖర్చులు మాత్రం పెరిగాయని, ప్రభుత్వ ఆస్తులు, భూములను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని నాటి పాలన తీరును వివరించారు. రాష్ట్రం దివాళా తీసే స్థాయికి చేరడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
కేంద్ర నిధులూ దారి మళ్లించారు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన పథకాల నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. కేంద్ర నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పా రు. కేంద్రం ఇచ్చే నిధులను నిర్దేశిత ప్రయోజనాలకే వినియోగిం చేలా వ్యవస్థను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాటి ప్రభుత్వం చివరకు మద్యం ఆదాయాన్ని ముందుగానే తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీకి పూర్తి భిన్నంగా మద్యం ఆదాయాన్ని ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు ఉపయోగించారని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో కీలకంగా మారిందని పేర్కొంటూ వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుందని వ్యాఖ్యానించారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పారు. కేంద్రం సాయం అందిస్తే దాన్ని అందిపుచ్చు కుని అభివృద్ధిగా మలచుకునేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నా రు. ప్రజలు ఇచ్చిన ఓట్లతోనే ఇదంతా చేయగలుగుతున్నామని వివరించారు.
ఆర్థిక వ్యవస్థను అడవి పందుల్లా ధ్వంసం చేశారు
అడవి పందులు పంటను నాశనం చేసినట్టుగా నాటి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చిన రెవెన్యూ లోటు నిధులను కూడా ముందుగానే ఖర్చు చేశా రన్నారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో ఆగకుండా.. రాష్ట్ర భవిష్యత్తును మార్చే అనేక కీలక ప్రాజెక్టులను కూడా విధ్వంసం చేశారని మండిపడ్డారు. అమరావతి నగర నిర్మాణాన్ని నిలిపివేయ గా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను మళ్లీ గాడిలో పెట్టామని, నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రపంచంలో అమరావతికి గుర్తింపు తీసుకొచ్చే ప్రాజెక్టుల కు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.
2028కి అమరావతి ఫేజ్-1 ప్రారంభం
డిసెంబరులో క్వాంటం వ్యాలీని ప్రారంభిస్తాం..2028లో అమరావతి ఫేజ్-1ను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా మని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని స్పష్టం చేశారు. పోలవరంతోనే ఆగ కుండా రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రూ.37,766 కోట్లతో 36 ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని.. ట్రిపుల్ రీజియన్ ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అమరావతి, తిరుపతి, విశాఖ కేంద్రంగా ఎకనమిక్ రీజి యన్ల వారీగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు.
టెక్నాలజీని అడ్డుకోవద్దు
గతంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ను రాష్ట్రానికి తీసు కొచ్చామని, ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు. ఐఎసఏ ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని వెల్లడించారు. డేటా సెంటర్లు వస్తుంటే ప్రజల ను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డా రు. మాకెందుకు స్టీల్ ప్లాంట్.. మాకెందుకు ఏఐ.. మాకెందుకు డేటా సెంటర్లు అంటూ పేదరికంలోనే బాధపడాలా? అని ప్రశ్నిం చారు. యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఆదాయం, రాష్ట్రానికి సంపద తీసుకొచ్చే పరిశ్రమలు, సాంకేతిక రంగాలను ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మార్చేలా పబ్లిక్ పాలసీలు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమం ఎంత ముఖ్యమో.. అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.
మంచి రోడ్లు వేయాలన్నా.. మౌలికవసతులు కల్పించాలన్నా సంపద సృష్టించాల్సిందేనని తెలిపారు. సంపద సృష్టికి కొత్త మార్గాలను అన్వేషించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పా రు. ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలని ఆకాంక్షించా రు. పరిశ్రమలు వస్తే ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో కియా కార్ల పరిశ్రమను ఉదాహరణగా ప్రస్తావించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వల్లే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతు న్నారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















