అమరావతి(చైతన్యరథం): ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాద పూర్వ కంగా కలిశారు. సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థు లను తీర్చిదిద్దడానికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతటి కీలకమైనదో వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లలలో మానవీ య విలువలు, క్రమశిక్షణ, నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు దిశా నిర్దేశంలో రూపకల్పన చేసిన నైతిక విలువల పాఠ్యాంశాలను నో బ్యాగ్ డే రోజు బోధిస్తున్నారు. నైతిక విలువల విద్యతోనే సమగ్ర విద్యా వికాసం సాధ్యమని నమ్మిన ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగం కావడంపై చాగంటి సంతోషం వ్యక్తం చేశారు. భేటీ అనంతరం లోకేష్ ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటిని వినయ పూర్వకంగా సాగనంపారు.

















