- దళిత మహిళ ఇంటిపై దాడిచేసి
- వస్త్రాలు చించి వేసి అనుచరులతో దాష్టీకం
- 15 మంది అరెస్ట్..14 రోజుల రిమాండ్
కర్నూలు (చైతన్యరథం): ఆలూరు నియోజకవర్గం సంగాల, నేమకల్లులో ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇంటిపై దాడి చేసి ఆయన భార్యపై దౌర్జన్యం చేసి.. వస్త్రాలు చించిన కేసులో ఎమ్మెల్యే విరూపాక్షి సహా మొత్తం 15 మంది అరెస్టు అయ్యారు. వారిని ఆలూరు జూనియర్ సివిల్డ్జి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఒక పార్టీ నాయకుడు గిరి… మరొక పార్టీ నాయకులైన గురునాథ్, శివ, నాగరాజు (ఎస్సీ మాదిగ)లను అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడావని నాగరాజు ప్రశ్నించినందుకు గిరి ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేయగా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి సుమారు 10 కార్లలో అక్కడకు చేరుకున్నారు. నాగరాజు ఇంటిలోకి దౌర్జన్యంగా చొరబ డి ఎమ్మెల్యే సమక్షంలోనే ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాగరాజు భార్య సుచిత్రపై చేయిచేసుకుని ఒంటిపై వస్త్రాన్ని చింపేశారు. అలాగే వారిని వారించబోయిన రాజశేఖర్, నాగరాజు అన్నపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకుని
పరామర్శించడానికి వచ్చిన స్థానిక నాయకుడు కొండ పురుషోత్తం కారును ధ్వంసం చేశారు.
ఈ ఘటనలో గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీ సులు నిందితులను అరెస్టు చేశారు. ఎంతటి రాజకీయ నాయ కుడైనా చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశాన్ని కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఇస్తోంది. ఇందుకు నిదర్శనమే ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై నమోదైన కేసులో 15 మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం. దళిత మహి ళపై దాడి, కులదూషణ, బెదిరింపుల వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. బాధితురాలు న్యాయం కోసం ముందుకురావడం, పోలీసులు కేసు నమోదు చేయడం, కోర్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఎలా పనిచేయాలో చూపిస్తోంది. మహిళలపై దాడులు, దళితులపై దౌర్జన్యాలు, రౌడీయిజానికి ఎలాంటి రక్షణ ఉండదు. అదే కూటమి ప్రభుత్వ పాలనకు నిదర్శనం.















