- సామాన్యులకూ పొలిట్‌బ్యూరోలో చోటు
- మరోసారి అధ్యక్ష పదవి అప్పగించినందుకు
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు
- లోకేష్ ఎంపిక టీడీపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం
- వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైనందుకు శుభాకాంక్షలు
- జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు అభినందనలు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి(చైతన్యరథం): నాపై నమ్మకముంచి రెండోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. అట్టడుగు వర్గాలకు, బీసీలకు రాజకీయం గా అండగా నిలబడటం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఒక బీసీ బిడ్డగా నాకు ఈ స్థాయి గుర్తింపు లభించిందంటే అది చంద్రబాబు దూరదృష్టి, బీసీలపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శ నం. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే యువతను ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీని భవిష్య త్ తరాలకు ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
టీడీపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం
తెలుగుదేశం నవశకానికి వారథిóగా, కోట్లాది మంది కార్యకర్తల ఆశల ఆశాకిరణంగా ఎదిగిన యువనేత నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం హర్షణీయం. అసాధారణ పనితీరుతో చెక్కుచెదరని సంకల్పంతో అటు పార్టీ క్షేత్ర స్థాయి యంత్రాంగాన్ని, ఇటు యువతరాన్ని ఏకతాటిపైకి తెచ్చిన లోకేష్ నియామకం.. టీడీపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యం. నాయకత్వం అంటే కేవలం పదవి కాదు..అంకితభావంతో కూడిన బాధ్యత అని నిరూపించిన ఆయన రాబోయే రోజుల్లో పార్టీని మరిన్ని విజయతీరాలకు చేర్చడం ఖాయమని స్పష్టం చేశారు.
కార్యకర్తలకు అందలం
టీడీపీలో కార్యకర్తే అధినేత. సామాన్య కార్యకర్తకు కూడా జాతీయ, రాష్ట్రస్థాయి బాధ్యతలు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని మరోసారి రుజువైంది. సామాన్య మండల అధ్యక్షురాలిని, క్లస్టర్ ఇంఛార్జీలను పార్టీలో అత్యున్నత కమిటీ అయిన పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం హర్షణీయం. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో నూత నంగా నియమితులైన నాయకులకు అభినందనలు తెలిపారు. మీ ఎంపిక మీ శ్రమ, నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలపై మీకున్న అను రాగానికి గుర్తింపు. మీ నాయకత్వం ద్వారా ప్రభుత్వ కార్యక్రమా లను ప్రజల్లోకి తీసుకెళుతూ పార్టీని అన్ని స్థాయిల్లో మరింత బలోపేతం చేస్తూ ప్రజాసేవలో స్ఫూర్తిని కల్గిస్తుందని ఆకాంక్షించా రు. మీరు చేపట్టబోయే ఈ కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు.














