అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం లో అమలులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీ క్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు, రాబోయే కాలంలో చేపట్టాల్సిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు.

















