గ్రామాల్లో పెద్దఎత్తున ఘనస్వాగతం
కుప్పం నియోజకవర్గంలో నాలుగురోజుల పర్యటనలో భాగం గా నారా భువనేశ్వరి తొలిరోజు మంకలదొడ్డి, సింగారపురం, మోట్లచెను, కూసురు, పైపాల్యం గ్రామాల్లో పర్యటించారు. పెద్దఎత్తున గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రాన్ని బాగుచేయడం చంద్రబాబు వల్లే అవుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారు. ప్రజల దీవెనలు మర్చిపోలేను. రాష్ట్రంలో అభివద్ధి కార్యక్రమాలకు కుప్పం ప్రయోగశాల అని అభివర్ణించారు.
















