రికార్డుస్థాయి వేగంతో అనుమతులు తెచ్చాం
ఒక్క జూమ్ కాల్.. ఏపీ భవిష్యత్తునే మార్చేసింది
20నెలల్లో ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా ఏపీని మార్చాం
ఏఎంఎనఎస్ శంకుస్థాపన సభలో మంత్రి నారా లోకేష్
అనకాపల్లి (చైతన్య రథం): “ఈరోజు ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ చేస్తున్నది కేవలం భూమిపూజ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక విశ్వాసం, నమ్మకంతో కూడిన ప్రకటన. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా ప్రభుత్వం చెప్పింది చేయగలదని ప్రపంచానికి చాటిచెప్పే ప్రకటన” అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఏఎంఎనఎస్ సంస్థ నిర్మించనున్న దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఇది స్టీల్ ప్రాజెక్టు గురించి మాత్రమే కాదు, మన బలం, ధైర్యం, నమ్మకం గురించి. ఒకసారి మిమ్మల్ని 2019 జనవరినాటి దావోస్‌కి తీసుకెళ్తాను. అప్పట్లో నేను అదిత్య మిట్టల్‌ని కలవాలని ప్రయత్నించాను. కానీ సమయం ఇవ్వలేదు. టాటా గ్రూప్ నైట్ క్యాంప్‌లో ఆయనను కలిసి ఒక సింపుల్ అభ్యర్థన చేశాను. “ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయరు?” అని అడిగాను. ఆయన మర్యాదపూర్వకంగానే “మేము ఇప్పటికే మరో రాష్ట్రాన్ని చూస్తున్నాం” అన్నారు. “మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. అది జరగకపోతే, ఆంధ్రప్రదేశ్ మీకోసం సిద్ధంగా ఉంది” అని చెప్పాను. సంవత్సరాలు గడిచాయి. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో మరో అవకాశమిచ్చారు. మేం మళ్లీ అధికారం చేపట్టిన వెంటనే, ఒక్క రోజు కూడా వృథా చేయకుండా వేగంగా ముందుకు సాగాం. 2024 సెప్టెంబర్ 22 ఆదివారం రాత్రి 8:30 గంటలకు ఆదిత్యతో మాట్లాడిన 30 నిమిషాల జూమ్ కాల్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేసింది. ఆ కాల్‌తో భారతదేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్‌మెంట్ పొందగలిగాం. ఇది ఆధునిక ఆంధ్రపదేశ్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శనం” అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
ఆ తల్లిమాటలే 20లక్షల ఉద్యోగాల ప్రకటనకు ప్రేరణ
ఆంధ్రప్రదేశ్‌లో నేను 2023లో యువగళం పేరిట 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఆ పాదయాత్రలో లక్షలాది ప్రజలను కలిశాను. ప్రతి సంభాషణ నా మనసులో చెరగని ముద్ర వేసింది. జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నపుడు.. రోడ్డుపక్కన బజ్జీలు అమ్ముతున్న మోహన అనే మహిళను కలిశాను. ఆమె భర్త మద్యానికి బానిసై చనిపోయాడు. అప్పటినుంచి గత 30 ఏళ్లుగా నిర్విరామంగా పనిచేసి, తన ఇద్దరు కొడుకులకు మంచి చదువు చెప్పించింది. ఆమెతో మాట్లాడినప్పుడు, డబ్బు లేదా ఇతర సహాయం అడగలేదు. “ప్రభుత్వంనుంచి ఏమీ అవసరం లేదు… నా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి” అని చెప్పింది. ఆమె మాటలు నాపై బలమైన ముద్ర వేశాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నేను చేసిన ప్రకటనకు ఆమె మాటలే ప్రేరణ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు పూర్తయిన సమయంలో, ఈ భూమిపూజ నా జీవితంలో భావోద్వేగ ఘట్టం. ఆంధ్రప్రదేశ్ యువతకు నేను ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతున్నందుకు గర్వంగా ఉంది. ఈ భూమిపూజ అవిశ్రాంత కృషి, ధైర్యం, నమ్మకాలకి దక్కిన ఫలితం. మేము ఇప్పుడు దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాము, భారతదేశంలో నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా ఏపీని మార్చాం” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
మా సామర్థ్యానికి మచ్చుతునక
ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించి, రికార్డు సమయంలో ప్రాజెక్టులు మొదలుపెట్టే మా సామర్థ్యానికి ఇది మచ్చుతునక. ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్ మా రాష్ట్రానికి వస్తున్న ముఖ్య ప్రాజెక్టుల్లో ఒకటి. లేటెస్ట్ టెక్నాలజీ, హై-గ్రేడ్ స్టీల్‌పై స్పెషలైజేషన్‌తో ఈ ప్రాజెక్ట్ అనకాపల్లిని ప్రపంచ మ్యాప్‌లో పెడుతుంది. ఏఏంఎనఎస్ గ్రీన్ స్టీల్ ప్లాంట్‌ను గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ టెక్నాలజీలతో అభివృద్ధి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో మేంసాధించిన కొన్ని టైమ్‌లైన్‌లు చెప్పాలి. సెప్టెంబర్ 2024లో అదిత్యతో మొదటి జూమ్ కాల్. 2 నెలల్లో ప్రాజెక్టు, ఇన్సెంటివ్స్ అప్రూవ్. 3 నెలల్లో భూమి ఇచ్చాం. ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్ 11 నెలల్లో వచ్చాయి. ఇవి ప్రపంచస్థాయి టైమ్‌లైన్‌లు -ఇది రికార్డు స్థాయి బిజినెస్ వేగం. భారతదేశంలో ఇంతటి భారీ స్కేల్ ప్రాజెక్టును అత్యంత వేగంగా సాధించినందుకు గర్వంగా ఉంది. ఇది 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, రూ.1.35 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్. లక్ష ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, ప్లస్ క్యాప్టివ్ పోర్ట్‌తో అదనంగా రూ.11వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్. ఇదీ దీని స్వరూపం” అని లోకేష్ బావోద్వేగంతో ప్రకటించారు.
బ్రాండ్ సీబీఎన్‌పై నమ్మకంతోనే రాక
ఈరోజు, ఈ ప్రాజెక్టు ఇక్కడికి రావడానికి కారణం ఇన్సెంటివ్స్, భూమి, పాలసీలు కాదు… బ్రాండ్ సీబీఎన్. దశాబ్దాలపాటు ఆయన నిర్మించిన నమ్మకం. 2025 దావోస్‌లో అదిత్య మిట్టల్ చెప్పాడు. “ఇది గణాంకాల గురించి కాదు. సీబీఎన్‌పైన, ఆయన నాయకత్వంపైన, స్థిరమైన అభివృద్ధి సాధనమైన నమ్మకం. అది సీబీఎన్ బ్రాండ్. దశాబ్దాలుగా క్రెడిబిలిటీ నిర్మించిన నాయకుడు. ప్రపంచ ఇన్వెస్టర్లు నమ్మే నేత. ఇది కేవలం హామీలవల్ల కాదు, సామర్థ్యంవల్లే సాధ్యం. నమ్మకంతోపాటు, అలైన్‌మెంట్, పార్ట్‌నర్‌షిప్ కూడా అవసరం” అని లోకేష్ పేర్కొన్నారు.
డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వేగానికి సూచిక
ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, సమర్ధ నాయకత్వంలో భారతదేశం ట్రాన్స్‌ఫర్మేషనల్ గ్రోత్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కి బలమైన పాలసీ మద్దతునిస్తోంది. నాకు అసాధారణ సపోర్టు అందించిన స్టీల్ మంత్రి హెచ్‌డి కుమారస్వామికి కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టుకు పలు సవాళ్లు ఎదురైనప్పుడు -ఎనఎండీసీ కోఆర్డినేషన్, స్లర్రీ పైప్‌లైన్, క్లియరెన్స్‌లువంటి వాటిని ముఖ్యమంత్రి పర్సనల్‌గా శ్రద్ధ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, పీఎంవోతో సమన్వయం చేసి సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీజీ, కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. స్టీల్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి ఇది ప్రారంభం మాత్రమే. ఇది కేవలం సహకారం మాత్రమే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వేగాన్ని సూచిస్తోంది. ఏపీ ప్రజలవల్లే ఇది సాధ్యమైంది. 25మంది ఎంపీల్లో 21మంది ఎంపీలను గెలిపించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే మరపురాని ఘట్టం. ఫార్మా, ఐటి కంపెనీలు, డేటా సెంటర్లకు ఉత్తరాంధ్ర నిలయంగా మారుతోంది. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఆవిష్కృతమైంది” అన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి మా ధ్యేయం
“ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి మా ధ్యేయం. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్‌కు ధన్యవాదాలు. హైస్కేల్ ఇన్వెస్ట్‌మెంట్లు కేవలం ఆర్థికపరమైన నిర్ణయాలు కావు, విశ్వసనీయత, నమ్మకంతో కూడుకున్నవి. మాకు మద్దతిచ్చిన ఏఎంఎనఎస్ ఇండియా సీఈవో దిలీప్ ఒమన్‌కు, హోంమంత్రి అనితకు ధన్యవాదాలు చెబుతున్నా. గట్టిగా నిలబడ్డారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించి అండగా నిలబడతాను, మా ప్రాంతానికి ఒక్క స్టీల్ ప్లాంట్ తీసుకురావాలని నా వెనుక ఉండి నడిపించారు. ఈ భూమిపూజ స్థలంలో నిలబడి మేము ఒకటి నిరూపిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎంవోయూలపై సంతకాలు చేయడమే కాదు, వాటిని విజయవంతంగా గ్రౌండ్ చేస్తాం. ప్రాజెక్టులు ప్రకటించడం మాత్రమే కాదు, నిర్మిస్తాం. పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, ఫలితాలు సాధిస్తాం” అన్నారు.
యువతకు ఉద్యోగాల కల్పనే అజెండా
“మా ప్రభుత్వానిది స్పష్టమైన అజెండా. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన. మేము తెచ్చే ప్రతి పాలసీ, ప్రతి ఇన్వెస్ట్‌మెంట్, ప్రతి రిఫార్మ్ ఉద్యోగాల సాధనకే. యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగానే మా నిర్ణయాలు ఉంటాయి. మా పాలసీలు యువత కలలను సాకారం చేస్తాయి. మేము రాష్ట్రంలో సెక్టార్-బేస్డ్ క్లస్టర్ మోడల్‌తో అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. ప్రతి రీజియన్ స్థిరమైన అభివృద్ధి సాధిస్తూ స్కేలబుల్ ఉద్యోగాలు సృష్టిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ఐటీ హబ్‌లు, ఫార్మా జోన్‌లు, గ్రీన్ ఎనర్జీ కారిడార్లు… ఇలా 22 క్లస్టర్లు జాబ్ ఇంజిన్‌గా పనిచేస్తాయి. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించే డీసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్, ఇన్‌క్లూసివ్ గ్రోత్ విధానం” అని మంత్రి లోకేష్ వివరించారు.
“మేము కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, యువతకు మంచి కెరీర్, జీవనోపాధి, భవిష్యత్తును ఇస్తున్నాం. ఇది భారతదేశ అభివృద్ధి మంత్రం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్‌మెంట్లు వేగవంతం చేసి, మిలియన్ల యువతకు ఉపాధి కల్పిస్తాం. ఇలాంటి సక్సెస్ స్టోరీలు భారతదేశాన్ని ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్‌గా మారుస్తాయి. వేగం ఎంచుకునే కంపెనీలు, ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంటాయి. అదిత్య మిట్టల్, ఏఎంఎనఎస్ ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆదిత్య మిట్టల్‌ను ఒకటే కోరుతున్నా. వచ్చే మూడేళ్లలో ఏపీలో లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ యువతీ, యువకులకు కల్పించాలి. ప్రత్యేకంగా ఇక్కడున్న రైతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చేసిన త్యాగంవల్లే ఇక్కడ ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది. గతంలో విశాఖ ఉక్కు కోసం చాలామంది పోరాడారు. కానీ మీ మనోభావాల ప్రకారం సీఎం చంద్రబాబునాయుడు మన ప్రాంతానికి ఒక అద్భుతమైన ఉక్కు పరిశ్రమను తీసుకువచ్చారు” అని మంత్రి లోకేష్ భావోద్వేగంతో ప్రకటించారు.