- చెత్త సేకరణ ఆటోలను ప్రారంభం
- ఆదర్శ మున్సిపాలిటీకి కృషిచేయాలని పిలుపు
రాయచోటి(చైతన్యరథం): అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాయచోటి పురపాలకలో చెత్త సేకరణకు మంజూరైన ఆరు ఆటోలను పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్మూలనకు అధికారులు కృషి చేయాలన్నారు, రాయచోటిని పరిశుభ్ర పట్టణంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని రాయచోటిని ఆదర్శ పురపాలకగా తీర్చి దిద్దేందుకు అధికారులు, నాయకులు అంతా కలిసి కృషి చేయాలని తెలిపారు. ప్రతి వార్డులో ప్రతి గడపకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసి అర్హులందరికీ అందజేయా ల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రానున్న ఎన్నికలలోపు ప్రతి వార్డులో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సమస్యలు 100 శాతం పరిష్కారం చేయాలని ఆదేశించారు.















