- నేడు పార్లమెంటరీ నేతలతో వర్క్షాప్
- పాల్గొననున్న సీఎం చంద్రబాబు, లోకేష్
అమరావతి(చైతన్యరథం): అధికార తెలుగుదేశం పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లా కమిటీలు పూర్తి కావడంతో రాష్ట్ర కమిటీ ఎంపి కపై దృష్టిపెట్టింది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ భారీ వర్క్షాప్ నిర్వహించనున్నారు. నాయ కత్వ పటిష్టత, పార్టీ బలోపేతమే ఈ సమావేశం ప్రధాన అజెండా గా తెలుస్తోంది. ఈ కార్యక్రమం టీడీపీ భవిష్యత్ వ్యూహాలకు దిశా నిర్దేశం చేయనుంది. 2024 ఎన్నికల విజయం తర్వాత ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా కమిటీల ప్రక్రియ ముగియ డంతో ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర కమిటీ వైపు మళ్లింది. రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. టీడీపీ చరిత్రలో జిల్లా కార్యవర్గాలకు నిర్వహించే ఈ వర్క్షాప్ అత్యంత కీలకంగా మారింది. ఈ వర్క్షాప్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కీలక నేతలకు ఇప్పటికే అధికా రిక ఆహ్వానాలు అందాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నారా లోకేష్ టీడీపీ కార్యాలయంలోనే శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. ఆయా జిల్లాల నేతలతో యువనేత వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంది.














