- చప్పట్లతో మార్మోగిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రాంగంణం
తిరుపతి (చైతన్య రథం): భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. పురాణాలు.. పురాణ పురుషుల గొప్పదనం గురించి చక్కగా వివరించారు. భారతదేశం గొప్పదనాన్ని నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పిన చంద్రబాబు ప్రసంగానికి సభికుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా… మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా పరిఢవిల్లింప చేసేలా కృషి చేస్తున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ 7వ సదస్సు తిరుపతిలో ప్రారంభమైంది. ఇలాంటి సదస్సులో సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం అందరిలోనూ ఆలోచనను రేకెత్తించింది.
సంస్కృతిని చాటిచెప్పేవి పురాణాలే
భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ సదస్సు ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటివి కాకుండా… మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలి. హలీవుడ్ సూపర్ హీరోలకంటే మన పురాణ పురుషులు గొప్ప వారు. వారి చరిత్రను వివరించాలి. సూపర్మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడు… ఆ విషయాన్ని యువతకు, చిన్నారులకు చెప్పాలి. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడు. మన కృష్ణుని మహిమలు, శివుడి మహత్యం గురించి యువతకు బోధించాలి. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూలేరు. రామ రాజ్యం గురించి వివరించాలి. అవతార్ సినిమాకంటే మన భారత, రామాయణాలు గొప్పవి. భగవంతుని అవతారాల గురించి పిల్లలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించీ చెప్పాలి. ఎవరు మంచి వాళ్లో… ఎవరు చెడ్డవాళ్లో చెప్పగలిగితే మంచికి, చెడుకి వ్యత్యాసాలు పిల్లలకు తెలుస్తాయి. ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాధలతో కూడిన సినిమాలు చేశారు. విలువలను చెబుతూ సినిమాల ద్వారా చైతన్యం తెచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్. పురాణాలకు, మన సంస్కృతికి అంతటి గొప్పదనం ఉంది. వీటిని పిల్లలకు వివరించి చెప్పినప్పుడే యువత, చిన్నారుల్లో మనోవికాసం కలుగుతుంది. మన దేశ ఔన్నత్యం గురించి తెలుస్తుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని సీఎం చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేయడం.. సభికులను














