- ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పాటించాలి
- నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణ మెరుగు
- కార్యక్రమాల అమలు తీరునూ పర్యవేక్షించాలి
- జోనల్ కో`ఆర్డినేటర్లకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం
మంగళగిరి (చైతన్య రథం): అందరికీ పార్టీనే సుప్రీం అని, పార్టీ ఆదేశాలను ప్రతిఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్లను ఆదేశించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్లతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణ మెరుగుపడిరది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేలా జోనల్ కో ఆర్డినేటర్లు చొరవ చూపాలన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల అమలుతీరును క్షేత్రస్థాయిలో జోనల్ కోఆర్డినేటర్లు పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. ఏమైనా లోటుపాట్లుంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండిరగ్‌లోవున్న అనుబంధ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తిచేయాలి. మిగిలిన సంస్థాగత కమిటీల నియామకం కూడా పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో జోనల్ కో ఆర్డినేటర్‌లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్‌రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.















