- ఏపీతో పాటు మా కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుపై మంత్రి లోకేష్ హర్షం
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబుకు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించటం పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రంతో పాటు మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకం. దేశంలో సంస్కరణల ప్రస్థానాన్ని స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్లిన అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరని జ్యూరీ ప్రశంసించింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసం అనే మూడు అంశాలపై ఆయన చూపిన నిబద్ధతకి ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, సంస్కరణాత్మక పాలనకు చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. సంస్కరణలే మార్గం ` పాలనలో విశ్వాసమే మా లక్ష్యం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.










