- పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సే భూమిక
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సులే కీలక భూమిక వహిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో గురువారం నుంచి రెండు రోజులపాటు జరిగే కలక్టర్ల సమావేశం బుధవారం ప్రారంభమైంది. సమావేశానికి ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్వాగతోపన్యాసం పలుకుతూ.. పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తుందన్నారు. మొంథా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తుకున్నామని సమావేశంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక లక్ష్యాలు, జిల్లాల అభివృద్ధి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ప్రజల్లో సంతృప్తస్థాయివంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే రెండు రోజుల సమావేశంలో చర్చించనున్నట్టు వెల్లడిరచారు.
ఆరు జిల్లాల కలెక్టర్లు తాము అవలంభించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను సదస్సులో ప్రెజెంట్ చేయనున్నట్టు వెల్లడిరచారు. అదేవిధంగా ఈ-ఆఫీస్, ఫైళ్లు క్లియరెన్స్, పీజీఆర్‌ఎస్, కేంద్ర ప్రాయోజిత పధకాలపైన సదస్సులో ప్రథమ భాగంగా చర్చించనున్నట్టు ప్రకటించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు తదితర అంశాలపై సమీక్షించనున్నట్టు సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. రహదారి భద్రతపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూనే.. ఆ ఆంశంపైనా సదస్సులో విస్తృతంగా చర్చించనున్నట్టు వెల్లడిరచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్‌కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, డీజీపీ హరీష్‌కుమార్ గుప్త, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు.














