అమరావతిలో పనులు చకచకా
* ఎస్పీవీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం
* ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం
* అమరావతిలో పూలింగ్ లో ఇవ్వని భూములకు భూసేకరణ విధానం
* క్యారవాన్ పర్యాటకం, హెంప్టేలకు అనుమతి
* జలవనరుల శాఖలో పలు పనులకు ఆమోదం
* కుష్టువ్యాధి పదం తొలగింపు
* క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్యరథం): ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పథకం ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్త్రీక్తి పథకాన్ని ఇప్పటికే 10 కోట్లు మంది మహిళలు వినియోగించుకున్నారు. ఈ కారణంగా ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఈ పథకాన్ని అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశమై 20 అజెండా అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రత్యేక ప్రాజెక్టుల అభివృద్ధి, అమలు, నిర్వహణ కోసం కంపెనీల చట్టం కింద స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోరు.
రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వంటివి దీని పరిధిలోకి తెస్తారు. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కారవాన్ పర్యాటకానికి, అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతికి భూసేకరణ విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. క్యాబినెట్ నిర్ణయాలను పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. కుష్టు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.
అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు..
అలాగే, రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీఏకి ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్ కోసం కొందరు రైతులు భూములు ఇవ్వలేదు. వారి నుంచి భూసేకరణ చట్టం 2013 ద్వారా భూములు తీసుకోవాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రభుత్వ భవన సముదాయాల పక్కన ఉండి.. భూ సమీకరణలో ఇవ్వని భూములను కూడా సేకరణ ద్వారా తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అమరావతి భూముల విషయంలో పూర్తిస్థాయిలో అడ్డంకులు తొలగిపోయాయి.
పలు రిజర్వాయర్లకు మరమ్మతులు
హంద్రీ-నీవా ప్రాజెక్టులో అమిడ్యాల లిఫ్ట్ స్కీమ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రకాశం బ్యారేజ్- దివిసీమ ప్రాంతాల్లో వరదనష్టం నివారణ పనులు చేసేందుకు గత సంవత్సరమే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని.. ఇందుకోసం రూ.107 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద, దివిసీమ వద్ద బలహీనంగా మారిన కట్టలకు రూ.4.49కోట్లతో పనులు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని అన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో మైలవరం రిజర్వాయర్.. 2021లో వచ్చిన భారీ వరదల్లో మరమ్మతులకు గురైనా పట్టించుకోకపోవడంతో రూ.3కోట్లతో రిపేర్లు చేయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హంద్రీనీవా సుజలస్రవంతి వ్యవస్థ లోని ములపల్లి ట్యాంక్ (నారావారిపల్లె సమీపంలో) మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు, కల్యాణి డ్యామ్కు నీటి సరఫరా పనులకు రూ.126.06 కోట్లతో పరిపాలనా ఇచ్చే ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
1.15 లక్షల ఎకరాలకు సాగు నీరు, తిరుపతి, తిరుమలకు తాగునీరు అందించడానికి 2017-18 ప్రాంతంలో టెండర్లు పిలిచినా పనులను ప్రారంభం కాలేదని, గత ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసింది. తిరుపతిలో ప్రతి సంవత్సరం ప్లోటింగ్ పాపులేషన్ పెరుగుతూనే ఉంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన పనులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అదే విధంగా అనంతపురం -ఉరవకొండ – వజ్రకరూరుకి కొత్త లిఫ్ట్ స్కీంకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా 10వేల 500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు వస్తుందని వివరించారు.
అనంతపురం మిడ్ పెన్నార్ ప్రాజెక్ట్కు రబ్బరు సీల్స్ మార్చడం, కొత్త వాక్వే వంతెన నిర్మాణం, రేడియల్ క్రెస్ట్ గేట్లకు ఇసుక బ్లాస్టింగ్, పెయింటింగ్, కొత్త ప్రధాన కంట్రోల్ ప్యానెల్ బోర్డుల సరఫరా, నిర్మాణం, సబ్-డిస్ట్రిబ్యూషన్ ప్యానెల్ బోర్డులు, కంట్రోల్ ప్యానెల్ బోర్డులు, ఆనకట్ట సుందరీకరణ పనులకు రూ.5.20 కోట్లకు పరిపాలనా ఇచ్చే ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
క్యారవాన్ టూరిజం..
ఏపీ టూరిజం పాలసీలో క్యారవాన్ టూరిజం, హెూమ్ స్టే ప్రోత్సాహకాలు చేర్చామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక 2 2024 2029 మేరకు క్యారవాన్ పార్కులు, క్యారవాన్లకి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. క్యారవాన్లు పెట్టేవారికి లైఫ్ ట్యాక్స్ రిబేట్, పార్కులు ఏర్పాటు చేసేవారికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు. హెూంస్టేలకు సంబంధించి టూరిజం పాలసీని మంత్రి మండలి ఆమోదించిందని అన్నారు. 1 నుంచి 6 రూములు హెంప్టేల కిందకు వస్తాయని.. అంతకు మించితే హెూటల్గా పరిగణిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హెూమ్ స్టేలు/బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (బీ అండ్ బీ) అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఫ్రేమ్ వర్క్, కొన్ని ఇన్షియేటివ్స్న టూరిజం పాలసీలో చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రూ. 1000 కోట్ల అదనపు రుణం
నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 1000 కోట్లు అదనపు రుణంగా తీసుకునేందుకు, దాన్ని సివిల్ సప్లయిస్ కార్పొరేషన్కి బదలాయించడానికి నిర్ణయం తీసుకుంది. ఏపీ రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్ని.. నేషనల్ నెట్వర్క్ స్టేషన్తో అనుసంధానించే అవగాహన ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఏపీ ట్రాన్స్ కో డిపార్టుమెంటల్ ఉత్తర్వుల్లోని కొన్ని నిబంధనలు సవరించడానికి ఇంధన శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డెవలప్ చేయాలని నిర్ణయించినందుకు ఇందుకోసం ఒక సలహామండలి ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ అసైన్ ల్యాండ్ 1977ని సవరణకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రైతుల నిర్వహణ నీటిపారుదల వ్యవస్థ చట్టం, 1997లోని సెక్షన్ 14కి సవరణ చేయడానికి రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మేనేజింగ్ కమిటీ సభ్యునిగా (చైర్మన్ లేదా వైస్-చైర్మన్ లేదా ప్రెసిడెంట్ లేదా వైస్-ప్రెసిడెంట్) ఎంపికకు గతంలో ఇద్దరు పిల్లలు మించి ఉండరాదు అనే నిబంధన విధించారు. ఇప్పుడు దానిని తొలగించేందుకు మంత్రి మండలి అమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నపురం గ్రామంలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ స్థాపన కోసం గ్రీన్కో సంస్థకు కేటాయించిన 174,10 ఎకరాల ప్రభుత్వ భూమి రేటును ఎకరాకు . 5,00,000 2, 3 . 6.25 లక్షలుగా నిర్ణయిస్తూ రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వివరించారు.












