చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అన్నదాతల ఉసురుతీసిన జగన్ రెడ్డి

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజం

by చైతన్యరధం
Sep 10, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అన్నదాతల ఉసురుతీసిన జగన్ రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అన్ని విధాలా మోసగించిన వైసీపీ ప్రభుత్వం
  • … వారి పాలనలో యూరియా కోసం రైతు కన్నీళ్లు
  • పంటల బీమా పేరుతోనూ మోసం చేశారు
  • వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేశారు
  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజం

అనంతపురం (చైతన్యరథం): వైసీపీ పాలనలో -రైతులను నరకం అనుభవించేలా చేశారని, యూరియా కోసం రైతులు రాత్రిళ్లు క్యూలలో నిలబడ్డారని వ్యవ సాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభా ప్రాంగణం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ఉచిత పంటల బీమా పేరుతో రైతులను మోసం చేశాడని, ఉద్యాన పంటలకు మద్దతు ధరలు ప్రకటించి నా ఒక్క కిలో కూడా కొనలేని చేతకాని వాడు జగన్ అని మండిపడ్డారు. వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య రంగాలను సర్వనాశనం చేసి నేడు కూటమి ప్రభు త్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ క్షణక్షణం పని చేస్తోందని, రైతులు ఇబ్బందిపడకుండా ముందుగానే యూరియా, విత్తనాలు, బీమా, మద్దతు ధరలతో సహాయాన్ని అంది స్తోందని తెలిపారు. మోసం చేసిన వైసీపీ పాలనకు రైతులు గుణపాఠం చెప్పారని, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

సరళీకృతంగా యూరియా సరఫరా
వైసీపీ ప్రభుత్వ కాలంలో యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 81 వేల హెక్టార్లలో అధికంగా పంటలు వేయడం, వ్యవసాయంలో యూరి యా వాడకాన్ని తగ్గించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వల్ల రైతులు భయపడి, భవిష్యత్ అవసరాల కొరకు యూరియాని అధికంగా కొనుగోలు చేయటం వల్ల యూరియా డిమాండ్ అనూ హ్యంగా పెరిగిందన్నారు. మధ్యలో ఒక నెల డ్రై స్పెల్ వచ్చి తరు వాత ఒకేసారి వర్షాలు విస్తారంగా పడటం వల్ల ఎరువుల అవసరం పెరిగి యూరియా సరఫరాపై ఒత్తిడి పెరిగిందని, వాస్తవానికి ఖరీఫ్ సీజన్కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 6.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసామని తెలిపారు. నేటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఇంకా 78 వేల మెట్రిక్ టన్నుల యూరియా షాపుల్లోనూ మరియు ఆర్ఎస్కల ద్వారా అమ్మకానికి సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో కేంద్ర ప్రభుత్వం అదనంగా 49,367 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, దీంతో పూర్తిస్థాయిలో రైతులకు యూరియా అందుబాటులో ఉండి, యూరియా కొరత పూర్తిగా తీరిపోతుందన్నారు. రాబోయే రబీ కాలానికి అవసరమైన 9.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా ముందస్తుగానే కేంద్రం ఇప్పటికే కేటాయించిందని తెలిపారు. 50 శాతం ప్రయివేటు డీలర్లు, 50 శాతం ప్రభుత్వ సంస్థల ద్వారా యూరియా గతంలో అమ్మగా, ప్రభుత్వానికి రవాణా ఖర్చులు పెరిగినప్పటికీ, 70 శాతం ప్రభుత్వం ద్వారా మరియు 30 శాతం ప్రయివేటు డీలర్ల ద్వారా యూరియా అమ్మకాలు ప్రారంభించామని అన్నారు. ఆర్ఎస్కే సేవలు మరింత మెరుగుపరిచామని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరానికి సరాసరి ఆర్ఎస్కేల ద్వారా 255 కోట్ల విలువ చేసే యూరియా అమ్మకాలు జరగగా, కూటమి ప్రభుత్వ హయాంలో 2024-25 సంవత్సరంలో ఆర్ఎస్కేల ద్వారా 292 కోట్ల విలువ చేసే యూరియాను సరఫరా చేసామని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

వాత్సల్యమూర్తి భువనమ్మ

విత్తనాలు, బీమా అందచేస్తూ ప్రోత్సాహకాలు
వైసీపీ కాలంలో విత్తనాలు ఆలస్యంగా, తక్కువ నాణ్యతతో చేరాయని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మంది రైతులకు రాయితీతో 4.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందించామని తెలిపారు. కంటింజెంట్ విత్తనాలను 80 శాతం రాయితీతో ఇచ్చామని అన్నారు. పంటల బీమా విషయంలో వైసీపీ హయాంలో రైతులు మోసపోయారని, ఉచిత భీమా అంటూ మోసగించి, ప్రీమియం చెల్లింపులు చేయ కుండా వదిలేశారని మండిపడ్డారు. 2019 తరువాత పంటల బీమా పూర్తిగా విఫలం అయిందని, 2018-19 తరువాత ఏ రబీ సీజన్లో కూడా ఎలాంటి బీమా పరిహారం చెల్లించలేదని తెలిపారు. ఉచిత పంటల భీమా అని చెప్పి 2020-21లో ఖరీఫ్కు మాత్ర మే అమలు చేసి చేతులు దులుపుకున్నారు. తరువాత పీఎంఎఫ్ బీవైతో కలిసి ఉచిత పంటల భీమా అమలు చేస్తామని ప్రకటించి రైతుల వాటా, రాష్ట్రం వాటా రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చి మోసగించారు. 2022 ఖరీఫ్ తరువాత ప్రీమియం సబ్సిడీ చెల్లింపు చేయకుండా ఇచ్చిన హామీని గాలికి వదిలేసి రైతులను నట్టేట ముంచారు. దీని కారణంగా 2022-23 రబీ నుండి రైతులకు బీమా పరిహారం సరైన సమయానికి చెల్లించక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కూటమి కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలిచి, సమయానికి పరిహా రం అందేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు.

రైతులను ఆదుకున్న కూటమి ప్రభుత్వం
కోకో ధరలు పడిపోతే 3776 మంది రైతుల నుంచి కిలోకు రూ.50 అదనంగా ఇచ్చి కొనుగోలు చేశాం. ఇందుకు రూ. 11.8 కోట్లు చెల్లించాం. తోతాపురి మామిడి ధర పడిపోతే, 51 వేల మంది రైతుల నుంచి 4.3 లక్షల టన్నుల మామిడి కొను గోలు చేసి కిలోకు రూ.4 చొప్పున రూ.171 కోట్లు చెల్లిం చాం. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మిర్చీకి క్వింటాకి రూ.11,781 మార్కెట్ ధరను కల్పించాం. ప్రభుత్వం నుండి హామీ లభించటంతో మార్కెట్లో మిర్చి ధర స్థిరీకరించబడి రూ. 11,781 కంటే అధికంగా ట్రేడ్ అయింది. దీంతో ఎంఐఎస్ ఎథకం అమలు చేయాల్సిన అవసరం రాలేదు. 2017లో మిర్చీ ధరలు పడిపోతే ప్రభుత్వం 55 వేల మంది రైతులకు క్వింటాకి రూ.1500 చొప్పున రూ.130 కోట్లు చెల్లించాం. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2020లో మార్కె ట్ ధర 12 వేలు ఉంటే మద్దతు ధర రూ.7 వేలు ప్రకటించి కొనడానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ధరలు పడిపో యినప్పుడు రైతులను ఆదుకోవడానికి ధరలు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి 2025-26 బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయిం చాం. అదనంగా అవసరం అయితే పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం బడ్జెట్లో 6300 కోట్లు కేటాయించాం. ప్రతి రైతుకీ రూ.20 వేలు ప్రకటించడమే కాకుండా మొదటి విడతగా రూ.7 వేలు చొప్పున రూ.3,174 కోట్లు చెల్లించాం. (2,343 కోట్లు రాష్ట్ర వాటా, రూ.831 కోట్లు కేంద్రం వాటా). దీనివల్ల 46.86 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు.

ఉద్యానవన పంట హబ్ రాయలసీమ
రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన పంటల హబ్ మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పాన్ని గత ప్రభుత్వ పాలకులు సర్వనాశనం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని రాయలసీమలో ప్రతి ఎకరానికి 100 శాతం ఇవ్వా లనే సంకల్పంతో 2014-19లో ప్రణాళికాబద్దంగా పనిచేశాం. అందులో భాగంగా డ్రిప్ పరికరానికి మా ప్రభుత్వం 90 శాతం రాయితీని కల్పించగా, మీ ప్రభుత్వం దానిని 70 శాతానికి తగ్గించింది.ఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన 100 శాతం రాయితీని, 90శాతానికి తగ్గించింది. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు చెల్లించాల్సిన రూ.1166 కోట్ల బకాయి లు చెల్లించకపోవటంతో రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా సర్వనాశనం అయింది. దీంతో కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగించుకోవడానికి కూడా కంపెనీలు ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక, గత ప్రభుత్వం చెల్లించకుండా ఉంచేసిన బకాయిలను చెల్లించటంతో పాటు, రాయలసీమ జిల్లాకు రాయితీని 70 శాతం నుంచి 90 శాతానికి పెంచాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం నుంచి 100 శాతం రాయితీని పెంచాము. దీంతో మైక్రో ఇరిగేషన్ అమలు లో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానం పొందింది. అదేవిధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దూర దృష్టితో, ఆయిల్ పామ్ సాగులో కూడా మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం లో ఉండగా, గత ప్రభుత్వంలో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా వారు వినియోగించుకోలేదు. దీనివల్ల రైతులు రూ. 194 దీనివల్ల రైతులు మొక్కను బ్లాక్ మార్కెట్లో రూ.400 నుంచి రూ.500 వరకు కొనాల్సిన పరిస్థితి వచ్చించి. కానీ మా ప్రభుత్వం అదే ఆయిల్ పామ్ మొక్కని రాయితీపై ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టింది.

వైసీపీ పశు బీమా, ఆరోగ్య శిబిరాలు నిలిపివేసింది
పశు బీమా పథకాన్ని, పశు ఆరోగ్య శిబిరాలను గత ప్రభు త్వం పూర్తిగా నిర్వీర్యం చేసి మూగ జీవాల ఉసురు తీశారు. కూటమి ప్రభుత్వం 13957 పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిం చి సకాలంలో మూగ జీవాలకు ఉచిత వైద్యం, మందులు సరఫరా చేశాం. పశు భీమా ప్రీమియం గతంలో రైతు 50 శాతం చెల్లిస్తే, 50 శాతం ప్రభుత్వం భరించేది. కూటమి ప్రభు త్వం వచ్చాక, పశు రైతులను ఆదుకోవడానికి 85 శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. పశు బీమా పరిహారం రూ.37,500 నుంచి రూ.50 వేలకు పెంచాం. 100 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలను 50 శాతం సబ్సిడీతో పసుగ్రాసాన్ని అందిస్తున్నాం. 25,000 గోకులాలను నిర్మించాం. కృత్రిమ గర్భధారణ స్ట్రా ధరను రూ.500 నుంచి రూ.150కి తగ్గించాం.

మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను దెబ్బతీసింది. కూటమి ప్రభుత్వం సముద్ర వేట నిషేధ కాల భృతిని కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి అర్హులైన 1,21, 433 మంది మత్సకారులకు 242.8 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం బకాయి పడ్డ మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ రాయితీని తమ ప్రభుత్వం చెల్లించి ప్రస్తుత బడ్జెట్లో రూ.50 కోట్లు కేటా యించాం. మరణిం చిన 63 మంది మత్స్యకారులకు రూ.3.15 కోట్లు నష్ట పరిహారం చెల్లించాం. సముద్ర తీర మత్స్య కారులు దూర ప్రాంతానికి వేటకు వెళ్లకుండా తీరానికి దగ్గరలో చేపలు దొరికే విధంగా చేయ డానికి 770 లక్షలు పెట్టి 22 కృత్రిమ అవాసాలు ఏర్పాటు చేశాం. ఇంకో 175ఏర్పాటు చేస్తాం. మత్స్యకారుల ఆదాయం పెంచడానికి సముద్రపు నాచు పెంప కాన్ని రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తు న్నాం. ఇందుకు 1250 మత్స్యకార సంఘాలకు శిక్షణ ఇచ్చాం. మహిళా పీఎంఎంఎస్వై కింద 404 యూనిట్ల పడవలు, ఇంజన్లు సరఫరా చేశాం. రూ.30 కోట్లతో తీర ప్రాంత ఆవాసాల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నాం. మంచినీటి మత్స్యకారుల హక్కులు కాపాడటానికి జీవో 27 ద్వారా 217ను రద్దు చేశాం. ఆక్వా రైతులను ఆదుకోవడానికి యూనిట్కు రూ.1.50 సబ్సిడీతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇందుకు గత సంవత్సరం రూ.803 కోట్లు ఖర్చు చేశాం. రూ.88 కోట్లతో బాపట్లలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సరళతరం చేశామని తెలిపారు.

ఉద్యాన, వాణిజ్య పంటల అభివృద్దే లక్ష్యంగా అడుగులు

గత ప్రభుత్వం 9 ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిందని, ఏ ఒక్క పంటలో ఒక్క కిలో అయినా కొనుగోలు చేయలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం సాంప్రదాయ పంట లతో పాటుగా వాణిజ్య పంటల ధరలు కూడా పడిపోయినప్పుడు, రైతులకు అండదండగా నిలిచి వారిని ఆదుకుందని అన్నారు. హెచ్ఎ బర్లీ పొగాకు ధర పడిపోతే రూ.271 కోట్లు వెచ్చించి 20,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించి, ఇప్పటికే 16,000 మిలియన్ కిలోలు కొనుగోలు చేశామని తెలిపా రు. ఇంకా మిగిలిన 4000 మిలియన్ కిలోలను కూడా కొంటా మని, ఇంకో 60 వేల మిలియన్ కిలోలను ప్రైవేట్ వర్తకుల ద్వారా కొనుగోలు చేయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నప్పటి నుంచి మూడు సందర్భాలలో టమాటో ధర పడి పోతే, 4599 మెట్రిక్ టన్నుల పంటను కొనుగోలు చేసి 11.25 కోట్లు రైతులకు చెల్లించామని అన్నారు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7723 మంది రైతుల నుంచి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి రూ.7 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. 2018లో మరొకసారి 9740 మంది రైతుల నుంచి 3.48 లక్షల క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి 6.45 లక్షలు చెల్లించా మని, 2020లో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే నామ మాత్రంగా క్వింటాకు రూ.770 మద్దతు ధర ప్రకటించి ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం క్వింటాకు రూ.1200లు మద్దతు ధర ప్రకటించి ఇచ్చిన మాటకు కట్టుబడి అదే ధరకు ఉల్లి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

Previous Post

రైతు ద్రోహి జగన్ బాంధవుడు చంద్రన్న

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 10-09-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం
ఆంధ్రప్రదేశ్

సం’క్షేమమే ధ్యేయంగా.. కొత్త ఏడాదిలో తొలి రోజున సీఎం తొలి సంతకం

చైతన్యరధం
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist