చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కుట్ర!!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫైర్‌

చైతన్యరధం by చైతన్యరధం
April 30, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కుట్ర!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సరిపడా సిబ్బందివున్నా ఇంటివద్దే ఎందుకివ్వరు?
  • ఎన్నికల కమిషన్‌ ఆదేశాలపై అంత నిర్లక్ష్యమా?
  • లబ్దిదారులను ఎండల్లో తిప్పి ప్రాణం తీస్తారా?
  • పేదల ప్రాణాలతో రాజకీయం సిగ్గుచేటు
  • జగన్‌ కుట్రలో కళంకిత అధికార్లూ భాగమే
  • 33మంది వృద్ధుల మరణాలకు జగన్‌దే బాధ్యత
  • పేదల ఉసురు తగలకపోదు..
  • టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫైర్‌

గూడూరు/ కోడుమూరు (చైతన్యరథం): ఇంటివద్దే పెన్షన్‌ పంపిణీకి సరిపడా సిబ్బందివున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.26 లక్షల సచివాలయ సిబ్బంది, 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేలమంది వెలుగు సిబ్బంది, 5 వేలమంది వ్యవసాయ సిబ్బంది, 3 వేలమంది హార్టికల్చర్‌ సిబ్బంది గ్రామస్థాయిలో ఉన్నారని… వీళ్లందరితో పంపిణీ చేయిస్తే ఒక్కొక్కరు 45మంది చొప్పున ఒక్కరోజులో పింఛనులు పంపిణీ చేయొచ్చన్నారు. కర్నూలు జిల్లా గూడూరులో సోమవారం క్యాంప్‌సైట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ‘సీఎంగా జగన్మోహన్‌రెడ్డి తన బాధ్యతలు విస్మరించారు. జవాబుదారీతనంతో ఉండాల్సిన సీఎం శవరాజకీయాలు చేస్తున్నాడు. ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయాల్సివున్నా, స్వార్థ ప్రయోజనాలతో ఇవ్వడం కుదరదని చెప్తున్నాడు. వాలంటీర్లతో పెన్షన్‌ పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పడంతో, జగన్‌ సర్కారు వితండవాదంతో పెన్షన్ల పంపిణీని రాజకీయం చేస్తోంది’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏప్రిల్‌ 1 పింఛన్ల పంపిణీనీ రాద్దాంతం చేసి వృద్ధులను పదేపదే సచివాలయాల చుట్టూ ఎండల్లో తిప్పించి 33మందిని బలితీసుకున్నారు. అవన్నీ ప్రభుత్వ హత్యలే. వారి ఉసురు ఊరికే పోదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్దే పెన్షన్‌ అందించాలని సీఎస్‌ను కోరితే పట్టించుకోకపోవడం.. వృద్ధులపట్ల జగన్‌ సర్కారు కనికరాన్ని తేటతెల్లం చేస్తోందని వ్యాఖ్యానించారు.

జగన్‌ కుట్రలో అధికారులూ భాగమే..
జగన్‌ కుట్రలు, కుతంత్రాలను ఆయన మోచేతి నీళ్లు తాగే అధికారులూ అమలు చేస్తున్నారు. 33మంది మరణాల్లో అధికారులూ భాగమయ్యారంటూనే, అదే కుట్రను మరోసారి ప్రయోగిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ వచ్చాక ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్‌ కింద పని చేయాలని గుర్తు చేశారు. పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎస్‌, గవర్నర్‌, ఎన్నికల కమిషన్‌ను కలిసి విజ్ఞప్తి చేశాం. గత ఘటనలు పునరావృతం కాకుండా పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్‌ కూడా ఆదేశించింది. సచివాలయాల్లో ఇవ్వకుండా నేరుగా ఇంటి వద్దే ఇవ్వొచ్చు. ఇంటి వద్ద పెన్షన్‌ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ చెప్పినా వినకుండా, ఇవ్వడం కుదరదు, ఇళ్లు తెలీవని మొండికేస్తున్నారు. మొన్నటి దాకా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతా వివరాలు లేవు అని, ఇప్పుడు బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తామని చెప్పడంలోనే ఎలాంటి నీచానికి ఒడిగడుతున్నారో అర్థమవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిజానికి అప్పుడు లేని అకౌంట్లు ఇప్పుడెలా వచ్చాయి? ఆధార్‌ లింక్‌ ఉన్న లబ్ధిదారులకు అకౌంట్లో వేసి, మిగతావారికి ఇంటివద్ద ఇస్తామన్నారు. 65,49,000 వేలమంది లబ్ధిదారుల్లో 45.92 లక్షలమంది అకౌంట్లు దొరికాయన్నారు. మిగిలిన వారికి ఇంటికి వెళ్లి ఇస్తామన్నారు. మరి వీళ్ల ఇంటి సమాచారం ఎలా దొరికింది? రాత్రికిరాత్రి కనుక్కొన్నారా? 25 లక్షలమంది అనారోగ్యంతో ఉన్నారు. బ్యాంకుల వద్దకు రాలేరు. అందుకే నేరుగా ఇస్తామని చెప్తున్నారు. అంతమంది అనారోగ్యంతో ఉన్నారని మీకెలా తెలిసింది. ఎప్పుడు తెలుసుకున్నారు? 25 శాతంమందికి అకౌంట్లు లేవు అన్నారు. వీరికి అకౌంట్లు లేవన్న సంగతి మీకెలా తెలుసు? అని నిలదీశారు. అధికారులు బోగస్‌ రిపోర్టులతో కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పని చేయాలని చంద్రబాబు సూచించారు.

వృద్ధుల ప్రాణాలతో రాజకీయాలా?
వృద్ధులకు అకౌంట్లో వేస్తే డబ్బులు పడ్డాయని వారికెలా తెలుస్తుంది? ఎవరు చెప్తారని చంద్రబాబు ప్రశ్నించారు. వృద్ధుల వద్ద సెల్‌ఫోన్లు ఉంటాయా? అని ప్రశ్నిస్తూ.. మొన్న సచివాలయాల చుట్టూ తిప్పారు. ఇప్పుడు అకౌంట్లో వేసి బ్యాంకుల చుట్టూ తిప్పుతారా? బ్యాంకుకు వెళ్లాలంటే కనీసం 5 కి.మీ వెళ్లి తెచ్చుకోవాలి. బ్యాంకు సిబ్బంది లేకుంటే పడిగాపులుకాయాలి. 46 డిగ్రీల ఎండలు కాస్తున్నాయి. మంచినీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో పండుటాకులను మండుటెండల్లో బ్యాంకుల చుట్టు తిప్పడం సమంజసమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. స్లిప్పులు ఇచ్చేందుకు 41,230 మంది బీఎల్వోలుగా పని చేస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడానికి బీఎల్వోలను వినియోగించుకుంటే, ఎన్నికల నాటికి స్లిప్పులు ఇవ్వడం కూడా సులభతరమవుతుందని సూచించారు. 13 జరిగే ఎన్నికలకు 1 నుంచే స్లిప్పులిస్తారా? జీతాల రూపంలో ప్రజల డబ్బులు తినే అధికారులు ఒక వ్యక్తి, పార్టీ ప్రయోజనం కోసం పనిచేయడం కూడదు. టెయింటెడ్‌ అధికారులు ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంత అసమర్థతతో ఉన్న మీరు ప్రశాంతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు.? ఓటర్లకు ఏం రక్షణ కల్పిస్తారు? పెన్షన్ల విషయంలో ఎవ్వరికి ఏది జరిగినా, చనిపోయినా ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుంది. పెన్షన్లు ఇంటింటికీ పంపిణీ చేయడం చేతకాకపోతే విధుల నుంచి తప్పుకుంటే చేతనైన వాళ్లు పంపిణీ చేస్తారు. సీఎస్‌ కార్యాలయం ముందు ప్రతిపక్షాలు ఎప్పుడైనా ధర్నాలు చేసిన పరిస్థితి ఉందా? ఎన్నిసార్లు డిమాండ్‌ చేయించుకుంటారు? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వృద్ధుల మరణాలకు జగన్‌దే బాధ్యత
పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జవహర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, శశిభూషణ్‌ బాధ్యత వహించాలి. కోడ్‌ వచ్చిన తరువాత అధికార యంత్రాంగం సీఎం కింద పని చేయడానికి వీల్లేదు. మొన్న జగన్‌ మేనిఫెస్టో విడుదల చేసిన రోజు కూడా ఓ అంశంలో ‘కరెక్టేనా ధనుంజయ్‌’ అని అడిగారు. ధనుంజయ్‌ రెడ్డికి పార్టీ కార్యక్రమాలో ్లఏంపని.? ఒకసారి ఎలక్షన్‌ కోడ్‌ వచ్చాక సీఎస్‌, కలెక్టర్‌ సీఎం ఆదేశాలను పరిగణలోకి తీసుకోకూడదు. అలా చేస్తే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లే. గత నెల ఎంతమందికి పెన్షన్‌ ఇచ్చారో చెప్పకుండా, ఎంతమంది చనిపోయారో క్లారీటీగా చెప్పారు. ఇంటింటికి పెన్షన్‌ ఇవ్వండని మేము అడిగాం. ఎన్నికల కమిషన్‌ అదే చెప్పింది. కుదరదని సీఎస్‌ ఎలా చెప్తాడు? క్షేత్రస్థాయిలో ఊర్లో ఉండే వ్యక్తే ఊర్లో వారికి పెన్షన్‌ ఇవ్వొచ్చు. తెల్లవారుజామునే పోటీ పడి పెన్షన్‌ ఇచ్చామని చెప్పిన మీరు ఇప్పుడెందుకు ఇవ్వరు? అని నిలదీశారు. పెన్షన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరిగి చనిపోయిన వారికి పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వ హత్యల కిందే కేసు నమోదు చేయాలి. ఈ హత్యలకు సీఎస్‌ జవహర్‌రెడ్డి, సీఎం జగన్మోహన్‌రెడ్డి బాధ్యత వహించాలి. డబ్బులు విడుదల చేయకుండా పెన్షన్‌ కోసం సచివాలయాల చుట్టూ తిప్పించడం వల్లే చనిపోయారు. చంపడానికి సచివాలయాల వద్దకు వాళ్లు తీసుకొస్తే, కాపాడటానికి మేము నీళ్లు, భోజనం, మజ్జిగ అందించాం. వికలాంగులకు రూ.6 వేల పెన్షన్‌ అందిస్తాం. కానీ జగన్‌ మాత్రం పెంచిన రూ.500 కూడా 2028కి రూ.250, 2029కి రూ.250 పెంచుతానని చెప్పాడు. 2029 ఏప్రిల్‌లో పెంచితే కేవలం 3 నెలలు మాత్రమే పెంచిన పెన్షన్‌ అమలు చేస్తామని జగన్‌ చెప్పాడు. పెన్షన్‌ డబ్బును బ్యాంక్‌ అకౌంట్లో వేస్తే, బకాయివుంటే అవి కోత పడే అవకాశం ఉంది’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: కోడుమూరుగూడూరుటీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపింఛన్ల పంపిణీప్రభుత్వం కుట్ర
Previous Post

వైసీపీకి మూడిoది!

Next Post

నందికొట్కూరు దెబ్బకు వైసీపీ గుండె పగలాలి!

Next Post
వైసీపీకి మూడిoది!

నందికొట్కూరు దెబ్బకు వైసీపీ గుండె పగలాలి!

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.