చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా

కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

by చైతన్యరధం
May 1, 2024 at 6:34am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, పత్రికా ప్రకటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సంక్షేమ పథకాల విస్తరణ, లబ్ధిరాశి పెంపు
  • అభివృద్ధికి తగు ప్రాధాన్యత
  • సంక్షేమ పథకాల్లో బీసీలకు పెద్దపీట
  • దేశంలో మొదటిసారిగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా
  • మొదటిసారిగా రాష్ట్ర ప్రజల నైపుణ్యత స్థాయి అంచనాకు స్కిల్‌ సెన్సస్‌
  • నెలవారీ పింఛన్‌ రూ. 3 వేల నుండి రూ.4 వేలకు పెంపు
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛను
  • స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు
  • ప్రతి మహిళకు నెలకు రూ.1500
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ
  • మెగా డీఎస్సీ, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌
  • డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
  • సీపీఎస్‌ పై ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి
  • కాపు సంక్షేమానికి ఐదేళ్లలో రూ.15వేల కోట్లు
  • ‘జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌’ గా మారిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు
  • డ్రైవర్లకు, అసంఘటిత రంగ కార్మికులకు చేయూత
  • విద్యుత్‌, మద్యం రేట్ల నియంత్రణ
  • ఉచిత ఇసుక విధానం తిరిగి అమలు
  • దేవాలయాల ఆస్తుల రక్షణ, బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు
  • ముస్లిం మైనార్టీ, క్రిష్టియన్ల సంక్షేమానికి హామీలు
  • ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

రాష్ట్రంలో త్వరలో జరగనునున్న ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీ తరపున ఉమ్మడి మేనిఫెస్టో మూడు పార్టీల నేతల సమక్షంలో మంగళవారం సాయంత్రం విడుదలైంది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ అగ్ర నేత సిద్ధార్థనాథ్‌్‌ సింగ్‌ ల సమక్షంలో ఉమ్మడి మేనిఫెస్టోను వెల్లడిరచారు.
ఆరు పేజీల ఉమ్మడి మేనిఫెస్టోలో 28 వివిధ కులాలు, తరగతులకు చెందిన సంక్షేమంతోపాటు వివిధ రంగాలతో కూడిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి 180కి పైగా హామీలు, ప్రతిపాదనలను పొందుపరిచారు. ఇందులో 50కి పైగా ప్రతిపాదనలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినవి కావటం విశేషం.

మేనిఫెస్టోకు బీజేపీ పూర్తి మద్దతు
తెదేపా, జనసేన నాయకులు పెద్ద ఎత్తున కసరత్తు చేసి కూటమి తరపున రూపొందించిన మేనిఫెస్టోకు భారతీయ జనతాపార్టీ తమ పూర్తి మద్దతు తెలిపింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన ఆ పార్టీ సీనియర్‌ నేత సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ ఉమ్మడి మేనిఫెస్టోపై తమ పార్టీ వైఖరిని వివరించారు. దేశవ్యాప్త లోక్‌సభ ఎన్నికలకు భాజపా జాతీయ స్థాయిలో వివరణాత్మకమైన మేనిఫెస్టోను విడుదల చేసిందని.. రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోల రూపకల్పనలో తాము పాలుపంచుకోమని, ఇది తమ పార్టీ సంప్రదాయమని ఆయన వివరించారు.అయితే.. తెదేపా జనసేనలు కలిసి రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు తమకు తెలుసునని, ఈ మేనిఫెస్టోను బీజేపీ పూర్తిగా సమర్థిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి మేనిఫెస్టో విడుల కార్యక్రమంలో తాను పాల్గొనటమే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఉందన్న అంశానికి ప్రతక్ష్య నిదర్శనమని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటానికి పూర్తిగా సహకరిస్తుందని..అదే రీతిలో దేశ ప్రగతికి దోహదపడుతుందని బీజేపీ ప్రగాఢంగా విశ్వసిస్తోందని సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని.. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్‌ లో కలిసి పోటీ చేస్తున్న కూటమి భారీ స్థాయిలో దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమది జాతీయ పార్టీ అని, రాష్ట్ర స్థాయిలో తెదేపా, జనసేనలు కలిసి రూపొందించిన మేనిఫెస్టోకు బీజేపీ పూర్తి మద్దతు ఉందని సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

No Content Available

పాత, కొత్త హామీల కలయిక
గతంలో తెదేపా ప్రకటించిన సూపర్‌-6, బీసీ డిక్లరేషన్‌ లోని వివిధ హామీలకు పలు కొత్తవాటిని జోడిరచి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించారు. జనసేన ప్రతిపాదించిన మరో ఆరు విషయాలతో ‘షణ్ముఖ వ్యూహం’ను జోడిరచారు. ఈ విషయంపై తెదేపా, జనసేనలు పలు రోజులపాటు తీవ్ర కసరత్తు చేశాయి.

విస్తృత సంక్షేమం
సంక్షేమం విషయంలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో అధికార వైసీపీ మేనిఫెస్టో కంటే పూర్తి భిన్న వైఖరిని వెల్లడిరచింది. గత ఐదేళ్లు అదికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఈనెల 27న తమ మేనిఫెస్టో విడుదల చేస్తూ అదనపు సంక్షేమ పథకాల విషయంలో పూర్తి అసహాయతను వ్యక్తం చేసి పరిశీలకులను, తమ పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకపక్క తమ పాలనలో రాష్ట్రం భారీగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటూ.. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో గత ఐదేళ్ల్లుగా అమలైన సంక్షేమ పథకాలే కొనసాగిస్తానని చెప్పి.. అదనంగా సంక్షేమ బాధ్యతను మోయలేనని ప్రకటించుకున్నారు. ప్రధానంగా అవ్వా తాతలు ప్రస్తుతం పొందుతున్న రూ. 3 వేల నెలవారీ పింఛన్‌ లో రూ.250 పెంపుకు మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాలని ప్రకటించి జగన్‌ రెడ్డి తన వైఫల్యాన్ని తానే వెల్లడిరచుకున్నారు.
జగన్‌ రెడ్డి వైఖరికి భిన్నంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో పలు కొత్త సంక్షేమ హామీలను ప్రకటించింది. నెలకు రూ. 4 వేల పింఛను, అదికూడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అందజేయటం, జగన్‌ రెడ్డి రద్దు చేసిన పలు బడుగు, బలహీన, మైనార్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ, రూ.5వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ, పండుగ, పెళ్లి కానుకల పునరుద్ధరణ, బీసీ వర్గాల సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో రూ. 1.50 లక్షల కోట్ల వ్యయం వంటి పలు నూతన హామీలతో కూటమి సంక్షేమ పథకాల పరిధిని బాగా విస్తృతం చేసి కష్టాల్లో ఉన్న ఆపన్నులకు దండిగా సహాయాన్ని ప్రకటించింది.

అభివృద్ధిలోను కూటమిదే పైచేయి
పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచటానికి, వారి రేపటి ఆశల సాకారానికి, యువతలో నూతన ఉత్సాహాన్ని నింపటానికి కీలకమైన అభివృద్ధి విషయంలో కూడా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో స్పష్టమైన, భిన్నమైన వైఖరిని అవలంబించింది. సంక్షేమ పథకాల విస్తృత అమలుకు శీఘ్రతర అభివృద్ది, తద్వారా సంపద సృష్టిల అవసరాన్ని తెలియజేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కూటమి మేనిఫెస్టో స్పష్టమైన విధానాలను ప్రకటించింది. ‘ఉజ్వల భవిష్యత్తు పట్ల ఆశావహులు, ముఖ్యంగా పేదల ఆశలు నెరవేరటానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర సమగ్ర ఆర్థిక అభివృద్ధికి పటిష్టమైన విధానాలను అమలు చేస్తాం. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పథకాల విస్తృత అమలును పటిష్టం చేస్తాం’ అని పేర్కొంటూ మౌలిక వసతుల కల్పన, అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పారిశ్రామికీకరణ మరియు పెట్టుబడులకు ప్రోత్సాహం, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి మార్గాలు, సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికి ఈ

మేనిఫెస్టో పెద్దపీట వేసింది.
రాష్ట్రలో అభివృద్ధి పట్ల ఏనాడు శ్రద్ధ చూపని ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల విడుదల చేసిన తమ మేనిఫెస్టోలో అభివృద్ధి గురించి క్లుప్తంగా, మొక్కుబడిగా ప్రస్తావించి నిర్దిష్ట విధానాలను వెల్లడిరచని వైఖరికి కూటమి మేనిఫెస్టో పూర్తి భిన్నంగా ఉందని పరిశీలకుల అభిప్రాయం.

సంక్షేమంలో బీసీలకు పెద్దపీట :
25 హామీలతో బీసీల (వెనుకబడిన వర్గాలు) సంక్షేమానికి కూటమి పెద్దపీట వేసింది. బీసీలకు 50 ఏళ్ల వయసున్నవారికి రూ.4వేలు నెలవారీ పెన్షన్‌, బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా రానున్న ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్ల వ్యయం, రాజకీయ అధికారంలో భాగస్వామ్యంతోపాటు యాదవ/కురబ, చేనేత, నాయీ బ్రాహ్మణులు, గీత కార్మికులు, వడ్డెరలు, రజకులు, మత్స్యకారులు, స్వర్ణకారుల సాధికారతకు మేనిఫెస్టోలో వివిధ హామీలను ప్రకటించారు.

ఉద్యోగస్థులు, పెన్షనర్స్‌
గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పాలనలో తీవ్ర కష్ట నష్టాలు, అవమానాలకు గురైన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల కూటమి మేనిఫోస్టో దృష్టి సారించింది. వారి గౌరవాన్ని పున:ప్రతిష్టింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. సీపీఎస్‌ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి స్పష్టం చేసింది. ఉద్యోగులు, పెన్షనర్స్‌ కు ప్రతి నెల ఒకటవ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని, వారికి చెందాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేసి, పెన్షనర్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు చర్యలు చేపడతామని కూటమి తెలిపింది.
బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ల వయసుకే నెలకు రూ. 4వేల పింఛను, ఈ వర్గాల ప్రత్యేక ప్రయోజనాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ, పేదలందరికి పట్టణాలు, గ్రామాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు చేసి పక్కా ఇళ్ల నిర్మాణానికి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.

ఇతర ప్రధాన హామీలు
1. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంపు
2. వైకల్యం తీవ్రతను బట్టి దివ్యాంగుల పింఛన్లను రూ. 6 వేలు, రూ. 15 వేలకు పెంపు
3. ముస్లిం మైనార్టీలు, క్రిష్టియన్ల సంక్షేమానికి పలు హామీలు
4. ఎయిడెడ్‌ కాలేజీలు, ప్రైవేటు పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పునరుద్ధరణ
5. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, బ్రాహ్మణుల సంక్షేమానికి పలు చర్యలు
6. చంద్రన్న బీమా పథకం పునరుద్ధరణ
7. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
8. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా

Tags: ఉద్యోగస్థులుకూటమి ఉమ్మడి మేనిఫెస్టోపెన్షనర్స్‌విస్తృత సంక్షేమంషణ్ముఖ వ్యూహం’
Previous Post

వైసీపీ తొత్తులుగా మారిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

Next Post

జగన్‌ రిమోట్‌ భారతి చేతుల్లో

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist