చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

హత్యాయత్నం కాదు..జగన్నాటకమే

మా ప్రశ్నలకు బదులివ్వకుండా పోలీసులు పారిపోయారన్న వర్ల రామయ్య

by చైతన్యరధం
Apr 20, 2024 at 6:13am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
హత్యాయత్నం కాదు..జగన్నాటకమే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గులకరాయి డ్రామాలో పోలీసులు అభాసుపాలు
  • సాక్షి తప్పుడు కథనాలనే దర్యాప్తులో అనుసరిస్తున్న పోలీసులు
  • సంచలనాత్మక కేసుగా చిత్రీకరించేందుకు యత్నం
  • అమాయకులలైన వడ్డెర బిడ్డలను ఇరికించే కుట్ర

అమరావతి(చైతన్యరథం): గులకరాయి డ్రామా హత్యాయత్నం కాదని.. అంతా జగన్నాటకమే అని.. సాక్షి మీడియాలో వస్తున్న కల్పిత కథనాలనే పోలీసులు అనుసరిస్తూ, దీనిని సంచలనాత్మక కేసుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో టీడీపీ అడుగుతున్న ప్రశ్నలకు పోలీసులు సమాధానం ఇవ్వకుండా పారిపోయారన్నారు. సంచలనాత్మక కేసును ఛేదించామంటున్న విజయవాడ పోలీసు కమిషనర్‌.. ఈ అంశంపై మీడియా ముందుకు రాకుండా, ఒక ప్రకటన విడుదల చేయటంతోనే పోలీసుల దర్యాప్తులోని డొల్లతనం తెలిసిపోతోందని వర్ల ఎద్దేవా చేశారు. నాలుగు రోజుల్లో సంచలనాత్మక వార్తలు వింటారని.. ఎన్నికల ప్రక్రియలో పెనుమార్పులు ఉంటాయని పాత నేరస్థుడు అవుతు శ్రీధర్‌రెడ్డి చెప్పినట్లే ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం అని పోలీసులు చెబుతున్నట్లుగా.. ఎవరో దుండగులు రాయి విసిరితే.. ఎందుకు పోలీసులు శ్రీధర్‌ రెడ్డిని కస్టడీలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. శ్రీధర్‌ రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదో జవాబు చెప్పాలన్నారు.

అమాయకుడైన వడ్డెర బిడ్డకు రిమాండ్‌
న్యాయమూర్తి ఈ కేసులో అమాయకుడైన వడ్డెర బిడ్డకు రిమాండ్‌ ఇవ్వకుండా తిరస్కరిస్తే బాగుండేదన్నారు. వడ్డెర బిడ్డకు ఇచ్చిన రిమాండ్‌పై అప్పీలు చేయాల్సిందిగా అతని తల్లిండ్రులకు సూచించినట్లు వర్ల రామయ్య తెలిపారు. ఇది హత్యాయత్నం నేరం కాదని, ముఖ్యమంత్రిని చంపాలన్న ఉద్దేశం ఎవరికీ లేదన్నారు. వారం రోజులుగా ఆడుతున్న గులకరాయి డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారని వర్ల అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టలేదు
నేను అడిగిన ప్రశ్నలకు పోలీసులు ఎందుకు సమాధానం చెప్పటం లేదు? చిన్న, చిన్న కేసుల్లోనే ముద్దాయిలను ప్రెస్‌ ముందు ప్రవేశపెట్టే పోలీసులు ఇంతటి సంచలనాత్మక కేసును ఎందుకని ప్రెస్‌ ముందుకు తీసుకురాలేదు? చీకట్లో వచ్చిన రాయి ముఖ్యమంత్రికి తగిలి, పక్కన ఉన్న ఎమ్మెల్యేను గాయపరిచి ఎటో ఎగిరిపోయిందని చెప్పి అమాయకులను అరెస్ట్‌ చేసి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో సంచలనాత్మక కేసుగా చిత్రీకరించేదుకు కుట్ర చేస్తున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు.

భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ఒక రాయితో హత్య చేయడానికి ఒక ఆగంతకుడు ప్రయత్నిస్తే, అది నిజం అయితే, పెద్ద సంచలనాత్మక కేసు అవుతుంది. అటువంటి సంచలనాత్మకమైన కేసును యుక్తితో ఛేదించినప్పుడు పోలీస్‌ కమిషనర్‌ ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టలేదు.? ప్రెస్‌మీట్‌లో మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక దొంగచాటుగా ఒక ప్రకటన పంపించారా? ఆ ప్రకటన పంపడంలోనే పోలీసుల దర్యాప్తులోని డొల్లతనం బయటపడిరది. దర్యాప్తు తప్పులతడకగా ఉందని అర్థమయింది. సిమెంట్‌ రాయితో ముఖ్యమంత్రిపై దాడి చేశారని పోలీసులు చెబుతున్నదంతా కట్టుకథే అని స్పష్టం అవుతోందని వర్ల అన్నారు.

బొండా ఉమా బ్యాచ్‌ అంటూ కొత్త డ్రామాలు
ఏదో రకంగా ముఖ్యమంత్రిని సమాధానపరిచేందుకు పోలీసు అధికారులు ఒక అమాయకుడిని బలిచేశారు. దానికి రాజకీయ రంగు పులిమారు. టీడీపీ నాయకుడు బొండా ఉమా బ్యాచ్‌ స్కెచ్‌ అని పదే పదే సాక్షి మీడియాలో వస్తుంటే దానినే పోలీసులు అనుసరిస్తారా? బొండా ఉమా బ్యాచ్‌కు ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్‌ పోతుందని ఎలా తెలుస్తుంది. బొండా ఉమాను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇంకేదైనా తప్పుడు కేసు సృష్టించండి.. ఇలా బీసీ బిడ్డలను బలిచేయొద్దు. చీకట్లో ఎవరైనా రాయి తీసుకుని అంతదూరం నుండి కొట్టగలరా? ఆ విధంగా కొట్టాలంటే మరో ఏకలవ్యుడు అయ్యి ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని హత్య చేయాలనుకునేవాడికి రాయిని మించిన ఆయుధాలు దొరకవా? చిన్న గులకరాయితో ఒక ముఖ్యమంత్రిని చంపడానికి ఎవరౖైెనా ప్లాన్‌ చేస్తారా? అధికారం దాహం కోసం అమాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి బలిచేయడం కాకుంటే ఈ నాటకాలన్నీ ఏమిటని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసు వ్యవస్థ అభాసుపాలు
ఈ కేసులో దర్యాప్తు సాగుతున్న విధానం పోలీసు వ్యవస్థనే అభాసుపాలు చేస్తోంది. అయినా దర్యాప్తు పోలీసులు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. అంతా సాక్షి మీడియా వాళ్లే చెబుతున్నారు. వాళ్లే దర్యాప్తు చేస్తున్నట్లున్నారు. పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం అని సాక్షి చెబుతోంది. సీఎం మాత్రం ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో రాలేదు. మరోపక్క ఇది ముమ్మాటికీ హత్యాయత్నమేనని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు. అలా చెప్పటానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలేమిటి? పోలీస్‌ కమిషనర్‌ ఏమైనా సజ్జల చెవిలో చెప్పారా అని వర్ల ఎద్దేవా చేశారు.
చంపాలనే ఉద్దేశంతో సున్నితమైన ప్రదేశంలో రాయితో కొట్టాలనుకుంటే చిమ్మచీకట్లో ఎందుకు ప్రయత్నిస్తాడు. ముఖ్యమంత్రులను రాళ్లతో చంపిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పోలీసులు వ్యవస్థ గౌరవాన్ని దిగజార్చే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ కేసు నిలబడదని వారికి తెలియదా? జగన్‌ కోసం పనిచేస్తే పోలీసులు తరువాత ఇబ్బందులు పడతారు. ఒకప్పుడు భారతదేశంలోనే నెంబర్‌ 1 గా ఉన్న ఏపీ పోలీస్‌ వ్యవస్థను దిగజారుస్తున్నారని వర్ల ధ్వజమెత్తారు.

పక్కా డ్రామా అని తెలిసిపోయింది
ఇది జగన్‌ ఆడిన జగన్నాటకం, పక్కా డ్రామా అని రాష్ట్ర ప్రజలకు అర్థమయింది. ప్రజలు అంత అమాయకులు కాదు. నాడు కొడికత్తి, గొడ్డలి వేటు డ్రామాలతో అధికారం చేపట్టి, మళ్లీ మరోసారి జనాన్ని మోసం చేయాలని చూస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేదు. వచ్చే ఎన్నికల్లో డ్రామాల పార్టీకి బుద్ధి చెప్పి భూస్థాపితం చేయడం ఖాయమని వర్ల స్పష్టం చేశారు.

Previous Post

వడ్డెర బిడ్డలను బలిచేస్తారా

Next Post

రాక్షస పాలకులను గద్దె దించి..ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026

కార్యకర్త
@ March 25, 2026
దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

చైతన్యరధం
@ March 24, 2026
ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక
ఆంధ్రప్రదేశ్

ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

చైతన్యరధం
@ March 24, 2026
చంద్రబాబు అనే నేను చెబుతున్నా…
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చైతన్యరధం
@ March 24, 2026
ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్

ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ March 24, 2026
శెట్టిబలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి
ఆంధ్రప్రదేశ్

శెట్టిబలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి

చైతన్యరధం
@ March 24, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

దేశీయ ఉత్పాదనకు ఇది చోదకశక్తి

చైతన్యరధం
@ March 24, 2026
ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

ఏఎంఎనఎస్ స్టీల్ ప్లాంట్..ఏపీపై నమ్మకం, విశ్వాసానికి ప్రతీక

చైతన్యరధం
@ March 24, 2026
చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చంద్రబాబు అనే నేను చెబుతున్నా…

చైతన్యరధం
@ March 24, 2026
ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

ఎల్పీజీనుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ March 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist