- 11నుంచి ఉత్తరాంధ్రలో యువనేత పర్యటన
- రోజుకు 3 నియోజకవర్గాల్లో కేడర్‌తో సమావేశాలు
- ఎన్నికలకు సమాయత్తమయ్యేలా దిశా నిర్దేశం
అమరావతి: కొంత విరామం అనంతరం టీడీపీ యువనేత నారా లోకేష్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి అరాచకపాలనపై ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువ గళం పాదయాత్ర స్పూర్తితో యువనేత లోకేష్ ఈనెల 11వ తేదీ నుంచి ‘‘శంఖారావం’’ పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్‌ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈ సారి యువనేత పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యాత్ర ప్రతిరోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగ నుంది. తొలి విడతలో 11 రోజులపాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈయాత్ర సాగనుంది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్య క్రమంలో రానున్న ఎన్నికలకు సంబంధించి వార్డు స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలకు లోకేష్ దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ విధానాలను ప్రజల్లో ఎండగట్టడం, అదే సమయంలో వివిధవర్గాలకు భరోసా కల్పిస్తూ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ కార్య క్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఏవిధంగా ఎదు ర్కోవాలనే అంశాలపై కార్యకర్తలకు లోకేష్ సమాయ త్తం చేస్తారు. నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం యువనేత లోకేష్ ఆయా నియోజక వర్గ కేంద్రాలకు వెళ్లి కేడర్‌తో సమా వేశమవుతారు. 58నెలలుగా ఉత్త రాంధ్రలో జగన్ అండ్ కో చేసిన విధ్వంసం, ఆయా నియో జకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కరానికి అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సినచర్యలపై సమావేశంలో చర్చిస్తారు.
శంఖారావం యాత్ర సందర్భంగా వైసీపీ పాలనలో తప్పుడు కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తలు, వివిధవర్గాల ప్రజలకు యువనేత లోకేష్ భరోసా కల్పి స్తారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలపై మారణ హోమం సృష్టించారు. వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 80 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వీరితో పాటు 188మంది దళితులు, 63మంది ఎస్టీలు, 40 మంది బీసీలు, 23మంది మైనారిటీలను జగన్ ప్రభు త్వం పొట్టనబెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కేడర్ పై 2 లక్షలు, బీసీలపై 26వేలు, ఎస్సీలపై 11వేల భౌతిక దాడులు జరిగాయి. జగన్ అరాచకపాలనలో రాష్ట్రంలో మహిళలపై 52,587నేరాలు జరిగాయి.అంటే రోజుకు సగటున 50, గంటకు రెండు నేరాలు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు చెబుతున్నాయి. మహిళ ఆత్మగౌరవానికి భంగం కలి గించే కేసుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా నిలిచింది. ఇక జగన్ అసమర్థ పాలన కారణంగా 4వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా సమయం లో వైద్యసదుపాయాలు అందుబాటులో లేని కారణంగా 50వేల మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశా యి. ధనదాహంతో జగన్ ప్రవేశపెట్టిన జేె-బ్రాండ్ల మద్యం తాగి 30వేల మంది మృత్యువాత పడ్డారు. ఇవ న్నీ జగన్మోహన్‌రెడ్డి అరాచక ప్రభుత్వ హత్యలే.
గత ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరద రాజస్వామి పాదాలచెంత యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా పల్లె లు, పట్టణాలను ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగి ల్చింది. అధికారపార్టీ పెద్దల అవినీతి, దౌర్జనాలను ఎం డగడుతూ 226రోజులపాటు 3132కి.మీ.లు కొనసా గిన యువగళం… అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగె త్తించింది. జగన్ పాలనలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ రాయల సీమ,కోస్తాంధ్రలో 97అసెంబ్లీనియోజకవర్గాల్లో 2197 గ్రామాల మీదుగా యువగళం పాదయాత్ర జైత్రయాత్ర లా సాగింది. ఈ యాత్ర ద్వారా సుమారు కోటిమంది ప్రజలను యువనేత లోకేష్ నేరుగా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలో కూడా యువ గళం పాదయాత్ర కొనసాగాల్సి ఉన్నప్పటికీ అధికార పార్టీ కుట్రలు,కుతంత్రాలతో చంద్రబాబు అరెస్టు నేప థ్యంలో 79రోజులపాటు యాత్రకు విరామం ప్రకటిం చాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం పరిధిలోని అగనంపూడి వద్ద డిసెంబర్ 18వ తేదీన యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర ను అనివార్యంగా ముగించారు.యువగళం ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవ శకం పేరుతో నిర్వహించిన బహిరంగసభ ఈదశాబ్దం లో అతిపెద్ద సభగా చరిత్ర సృష్టించింది. తొలుత నిర్ణ యించిన ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువగళం పాదయాత్ర కొనసాగకపోవడంతో… ఆ ప్రాంతప్రజలు, కార్యకర్తలకు భరోసాకల్పించేందుకు శంఖారావం పేరు తో నియోజకవర్గాలవారీగాపర్యటనలు చేపడుతున్నారు.
శంఖారావం మొదటి మూడు రోజుల షెడ్యూల్: 11-2-24న ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి 12న నర సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, 13న పాత పట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో శంఖా రావం కార్యక్రమం జరగనుంది.











