చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇసుకలో దోచుకున్నదంతా కక్కిస్తాం: ఆనందబాబు

గత క్యాబినెట్‌ నిర్ణయాలను తప్పుబట్టే అధికారం వెంకటరామిరెడ్డికి ఎక్కడిది?

by చైతన్యరధం
Nov 14, 2023 at 10:04am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇసుకలో దోచుకున్నదంతా కక్కిస్తాం: ఆనందబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇసుకలో రూ. 50 వేల రూపాయల కుంభకోణం
  • ఈ దోపిడీలో గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరామిరెడ్డి వాటా ఎంత?
  • దోపిడీని బయటపెడితే చంద్రబాబుపై ఎదురు కేసులా?
  • గత క్యాబినెట్‌ నిర్ణయాలను తప్పుబట్టే అధికారం వెంకటరామిరెడ్డికి ఎక్కడిది?
  • ప్రస్తుతం రహస్యంగా నడిపిన టెండర్లు మరో భారీ స్కామ్‌

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక కుంభకోణంలో ఏపీ సీఎం జగన్‌ వాటా రూ.50వేల కోట్లయితే.. గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరామిరెడ్డి వాటా ఎంత అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనంద్‌ బాబు ప్రశ్నించారు. ఇసుకలో దోచుకున్నదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు. ఇసుక దొంగ వే బిల్లులతో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారంటూ ఆధారాలు బయటపెట్టారు. కలకత్తా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. మద్యం, ఇసుక ను దోపిడీకి కీలక వనరులుగా జగన్మోహన్‌ రెడ్డి భావిస్తున్నాడు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో అక్షరాలా 50 వేల రూపాయల కుంభకోణం జరిగింది. జగన్‌ పాలన నాలుగున్నర సంవత్సరాల్లో ఒక సంవత్సరంపాటు రాష్ట్రంలో ఇసుక పాలసీ అనేదే లేకుండా నడిపారు. ఆ సంవత్సరంపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు అడ్డగొలుగా దోచుకున్నారు. భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు. దాదాపు 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. భవన నిర్మాణ కార్మికులను ఆకలితో అలమంటించేలా చేశారు. సంవత్సరం తరువాత ఇసుక పాలసీ తెచ్చి జేపీ వెంచర్స్‌ అనే ఒక బినామీ కంపెనీని తెరపైకి తెచ్చారు. ఆ సంస్థను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారు. జేపీ వెంచర్స్‌ మధ్యలో టర్న్‌ కీ అనే ఒక సబ్‌ కాంట్రాక్టు సంస్థను తీసుకొచ్చారు. ఆ సంస్థ కూడా కొంతకాలం సబ్‌ కాంట్రాక్టు నిర్వహించి పక్కకు తప్పుకుంది. ప్రభుత్వ పెద్దలు, మైనింగ్‌ డైరెక్టర్‌ గా ఉన్న వెంకట్‌ రెడ్డి, జగన్‌ ప్యాలెస్‌ సిబ్బంది.. ఏజెంట్లను పెట్టుకుని అడ్డగోలు ఇసుక దోపిడీకి తెరతీశారు. చంద్రబాబు హయాంలో 12 వందలకు వచ్చిన ట్రాక్టర్‌ ఇసుక ప్రస్తుతం రూ. 6 వేలు పెట్టి కొనాల్సివస్తోంది. ఇసుక కుంభకోణం డబ్బుతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ చూస్తున్నాడని ఆనందబాబు విమర్శించారు.

ఎన్‌జీటీ ఆదేశాలకూ వక్రభాష్యం
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలన్నీ నిలిపివేయాలని మార్చి నెలలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాలు ఇచ్చింది. ఇసుక అనుమతుల్ని రద్దు చేసింది. స్టేట్‌ లెవల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్టు అసెస్మెంట్‌ అథారిటీ వాళ్లు కూడా అనుమతులన్నీ రద్దు చేశామని చెప్పారు. అన్ని ఆదేశాలనూ జగన్‌రెడ్డి తుంగలో తొక్కారు. సుప్రీం కోర్టు ఇచ్చిన, ఎన్‌జీటీ ఆదేశాలు చిత్తూరుకు మాత్రమే అంటూ మైనింగ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ రెడ్డి వక్రభాష్యం పలికారు. జేపీ వెంచర్స్‌ కు ఇచ్చిన కాంట్రాక్టు మే నెల 12వ తేదీతో ముగిసింది. ఒప్పందం ముగిసి ఆరు నెలలౌతోంది. అయినా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. ఇసుకలో రూ. 40 వేల కోట్లు దోచిన వైనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోనే ఎండగడుతూ రాష్ట్ర ప్రజలకు ఇసుక దోపిడీ గురించి విడమరచి చెప్పారు. ఇసుకలో అడ్డగోలుగా దోచుకున్న కుంభకోణాన్ని మేము బయట పెడితే దానికి సమాధానం చెప్పలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకు 9 సంవత్సరాల క్రితం అమలు చేసిన ఇసుక పాలసీపై అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై కేసులు పెట్టారు. డిప్యుటేషన్‌ మీద రాష్ట్రానికి వచ్చిన వెంకటరామిరెడ్డి, తెలుగుదేశం ఇచ్చిన ఉచిత ఇసుక విధానంలో అవినీతి అని ఫిర్యాదు చేశాడన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ నిర్ణయాలు తప్పని చెప్పే అధికారం ఆయనకు ఎక్కడిది. ఇసుక అక్రమాల్లో తనకు భవిష్యత్తులో శిక్ష తప్పదనే ముందుగా ఓ ఫిర్యాదు పడేశాడు. గుండె ఆపరేషన్‌ వంకతో ఇంటినే కార్యాలయంలా మార్చుకున్న వెంకటరామిరెడ్డి రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. ఇసుక అక్రమాలు, బిల్లుల చెల్లింపులపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక వెంకట్‌ రెడ్డి ఎక్కడున్నా బయటికి లాగుతాం. జెపీ వెంచర్స్‌ లేదు, టర్న్‌ కీ లేదు, అందరూ పారిపోయారు. జగన్మోహన్‌ రెడ్డి అండ్‌ కంపెనీ ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. మైనింగ్‌ డైరెక్టర్‌ గా ఉన్న వెంకట్‌ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఏ విధానం ప్రకారం ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారో ప్రజలకు వివరించాలి. వెంకటరామిరెడ్డే ఇసుక అక్రమ తవ్వకాల్లో కీలక వాటాదారు అని నక్కా ఆనంద్‌ బాబు ఆరోపించారు.

సంబంధితవార్తలు

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

గెలుపు.. ప్రచండ తుపానే!!

ఓటుతో అరాచక శక్తులపై వేటు

వెంకట్‌ రెడ్డి సమాధానం చెప్పాలి
జిల్లా కలెక్టర్లు కూడా ఆలోచించాలి. ఇసుక పై వే బిల్లు కలెక్టర్‌ ఆఫీసు నుంచి. ఇందులో కలెక్టర్ల భాగస్వామ్యం కూడా ఇందని అనుమానించాల్సి వస్తోంది. ఆన్‌ లైన్‌ లో కాకుండా ఆఫ్‌ లైన్‌ లో వే బిల్లులు జారీ చేస్తున్నారు. హైవేల పక్కనే డంప్‌ లు పెట్టి దోచుకుంటున్నారు. అనుయాయులు, కజిన్‌ బ్రదర్‌ అనిల్‌ రెడ్డికి ఇసుకను జగన్‌ దోచిపెడుతున్నాడు. పారదర్శకత లేకుండా టెండర్‌ లు పిలవడం అన్యాయం. ఎంఎస్‌టిసి బ్రాంచ్‌ ఆఫీస్‌ విశాఖపట్నంలో ఉండగా.. కలకత్తా నుంచి ఇసుక టెండర్లు పిలవడంలోనే పెద్ద కుంభకోణం ఉంది. వీటన్నింటికి వెంకట్‌ రెడ్డి సమాధానం చెప్పాలని ఆనందబాబు డిమాండ్‌ చేశారు.
చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుపై సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ సుధాకర్‌ రెడ్డి హైదరాబాద్‌, విజయవాడ, ఢిల్లీ లలో ప్రెస్‌ మీట్‌ లు పెట్టి అభాసుపాలయ్యారు. చంద్రబాబుపై మద్యం కేసులు పెట్టటంపై బ్యావరేజెప్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి సమాధానం చెప్పాలి. అసలు నిందితులను వదిలేసి.. ప్రతి దానికి చంద్రబాబుపై కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పీతల సుజాతపై కూడా కేసు పెట్టారు. ప్రజలెవరూ జగన్‌ ను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి సిద్ధంగా లేరు. తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.

Tags: ఇసుకఏఏజీ సుధాకర్‌ రెడ్డికుంభకోణంక్యాబినెట్‌ నిర్ణయాలుగనులశాఖ డైరెక్టర్‌చంద్రబాబుజేపీ వెంచర్స్‌టెండర్లు మరో భారీ స్కామ్‌దోపిడీనక్క ఆనందబాబుబినామీ కంపెనీనిభవన నిర్మాణ కార్మికులువాటావెంకటరామిరెడ్డిసీఎం జగన్‌సీఐడీ చీఫ్‌ సంజయ్‌
Previous Post

టిడిపి – జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు.

Next Post

వైకాపా సైకోలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే: లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist