చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తాజా సంఘటనలు

కళంకిత పోలీసులతో జగన్‌రెడ్డి అరాచకం ! : చంద్రబాబునాయుడు

ప్రతిపక్షనేతల కస్టోడియల్‌ టార్చర్‌-మర్డర్లకు ప్లాన్‌

by చైతన్యరధం
Jul 2, 2022 at 11:41am
in తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కళంకిత పోలీసులతో జగన్‌రెడ్డి అరాచకం ! : చంద్రబాబునాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పరాకాష్టకు చేరిన సిఐడి వికృత చేష్టలు
మిస్టర్‌ డీజీపీ… ఏం సమాధానం చెబుతావ్‌?
ఎంతమందిపై తప్పుడు కేసులుపెడతారో చూస్తా
అవసరమైతే న్యాయం కోసం నేనే రోడ్డెక్కుతా
మహిళలను వేధించిన వాడిని మాపై ప్రయోగిస్తారా?
ఆ సిఐ గోడలు దూకడంలో సిద్ధహస్తుడు
తప్పుడు పోలీసులను చట్టం ముందు నిలబెడతాం
సిఐడి తీరుపై విరుచుకుపడిన చంద్రబాబునాయుడు
నారాసుర రక్తచరిత్ర అని రాసిన సాక్షిపై కేసుపెడతారా?
       

అమరావతి: పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కస్టోడియల్‌ టార్చర్‌, కస్టోడియల్‌ మర్డర్లకు ప్లాన్‌ చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి సోషల్‌ మీడియా కార్యకర్తలు సాంబశివరావు, వెంకటేష్‌ విషయంలో సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. సంఘ వ్యతిరేక శక్తులమాదిరి అర్థరాత్రి ఇళ్లపైకి వెళ్లడం ఏమిటని ఆయన నిలదీశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో … రాష్ట్రంలో సిబిసిఐడి అధికారులు రౌడీలు, అసాంఘిక శక్తులకంటే దారుణంగా వ్యవహస్తున్నారు. ఎంపి రఘురామ విషయంలో ఇష్టానుసారం ప్రవర్తించారు. ఎంపీని రాత్రంతా కొట్టి భయపెట్టడమేగాక వైద్య పరీక్షలకు కూడా సరైన పద్దతిలో పంపలేదు. ప్రభుత్వానికి సిగ్గు, శరం ఉంటే ఆ రోజే రాజీనామా చేసేవారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు ఎక్కడికక్కడ స్పందించి రాష్ట్రపతి నుంచి గవర్నర్‌ వరకు అందరి తలుపులు తట్టాకగానీ ఎంపి బయటపడలేకపోయారు. రఘురామ కృష్ణంరాజును పోలీసు సైకాలజీని క్రూరంగా ఉపయోగించి రాత్రంతా కొట్టి… బయటకు చెబితే చంపుతామన్నారు. చివరకు ఆయనను వైద్యం కోసం ఆర్మీ హాస్పటల్‌ కు పంపాల్సి వచ్చింది. బాబాయ్‌ ని హత్యచేసి నారాసుర రక్తచరిత్ర అని నాపై తప్పుడు రాతలు రాశారు. సోషల్‌ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకే మా సోషల్‌ మీడియా కార్యకర్తలను అడ్డగోలుగా అరెస్ట్‌ చేస్తున్నారు. నాపై తప్పుడు రాతలు రాసిన సాక్షి యాజమాని భారతీరెడ్డిని అరెస్ట్‌ చేయరా?
600 మంది టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు
వైసిపి అధికారంలోకి వచ్చాక 600మంది టిడిపి సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు…120మందిని జైల్లో పెట్టారు. 41ఎ నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా వ్యవహరించారు. పట్టాభి వంటి కేసులో మెజిస్ట్రేట్‌ పై ఎంక్వయిరీ చేయమన్నారు. నిన్న జరిగిన సంఘటనలు పరాకాష్ట. కళంకిత అధికారులు ఎవరైతే ఉన్నారో… ఎవరిపై ఆరోపణలు ఉన్నాయో, ఎవరు సైకో ప్రవర్తన కలిగి ఉన్నారో అటువంటి పోలీసు అధికారులను ఆయుధంగా చేసుకొని వారితో తప్పుడు కేసులు పెట్టి ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఇష్టప్రకారం చేయాలనుకుంటే ఆటలు సాగనివ్వం. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. ఎన్ని వేలమందిని కొడతారు? ఎన్ని లక్షలు, కోట్లమందిని అరెస్ట్‌ చేస్తారో చూస్తాం. ఎన్నిసార్లు కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తారో చూద్దాం.

సంబంధితవార్తలు

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

పోలీసుల వైఫల్యమే!

పిన్నెల్లి నుంచి ప్రాణహాని

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి నిలదీస్తా… న్యాయం కోసం రోడ్డెక్కుతా!
నిబంధనలను ఉళ్లంఘించి మా వారిని హింసించే అధికారం ఎవడిచ్చాడో మీ స్టేషన్‌ కు నేనే స్వయంగా వచ్చి నిలదీస్తా… అవసరమైతే రోడ్డెక్కుతా…సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టేది లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను…మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను…22 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ మాది. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే…ఈ విషయాన్ని పోలీసులంతా గుర్తు పెట్టకోవాలి. సిన్సియర్‌ గా పనిచేసేవారిని అభినందిస్తాం. మా పోరాటం మీతో కాదు… రాజకీయ ప్రత్యర్థులతో మాత్రమే. తప్పుడు కేసులుపెట్టే వారిపై రాజీలేని పోరాటం చేస్తాం. కావాలని తప్పుడు కేసులు పెట్టి టార్చర్‌ చేస్తే ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే నేనే పోలీసు స్టేషన్‌ కు వస్తా… మీ సంగతి చూస్తాం. రాబోయే మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం. 27 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా…ఎప్పుడు ఇంతటి నీచపరిపాలన చూడలేదు. వారు చెప్పినపుడల్లా తలాడిరచి మీరు బలిపశువులు కావద్దు.

డీజీపీ, సిఐడి చీఫ్‌ సమాధానం చెప్పండి!
మా ఫ్రీలాన్సర్‌ సాంబశివరావు భార్య బాలింత. తన బిడ్డకు పాలు ఇస్తుంటే పోలీసు ఆ గదిలోకి ఎలా వెళతారా..అసలు మీకు మానవత్వం ఉందా? దీనికి డీజీపీ, సీబీసీఐడీ చీఫ్‌ సమాధానం చెప్పాలి. సాంబశివరావు కులంతో మీకేం పని? కాపు కులంలో ఎలా పుట్టావురా అని ఎందుకు అడిగారు? మీరు ఏమైనా డిక్టేటర్లా? పిచ్చి పట్టిందా? సైకో పాలనలో మీరు కూడా సైకోల్లా మారిపోయారు. ఇంటి తలుపులుగడ్డ పలుగులతో పగులకొట్టడం, వీడియోలు తీస్తున్నారని లైట్లు పగులకొట్టడం ఏంటి? మొత్తం ఫోన్లు అన్నీ లాగేసుకున్నారు. వెంకటేష్‌ ను లాక్కెళుతుంటే అడ్డుపడిన తన సోదరిని బలవంతంగా నెట్టేసి ఇంటి గదిలో పెట్టి తలుపు మూసేశారు. ఇది అరాచకం కాదా? అర్థరాత్రి అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లడం ఏంటి?

టిడిపి నేతలపై ఎంతకాలం వేధింపులు?
అమ్మఒడిపై ప్రశ్నించిన గౌతు శిరీషపై తప్పుడు కేసు పెట్టి వేధించారు. కదిరి ఎమ్మెల్యే ఓబుల రెడ్డి పనితీరును ప్రశ్నించిన వ్యక్తి ఉగాండాలో ఉంటే…70సంవత్సరాల తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అరాచకాలు, దందాలను సోషల్‌ మీడియాలో బయటపెట్టినందుకు నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఉండవల్లి అనూషను సీఐడీ కేసులతో ఇబ్బందులకు గురిచేశారు. 70సంవత్సరాల వయస్సు ఉన్న ఎన్జీఓ రంగనాయకమ్మపై సీఐడీ కేసులు పెట్టి వేధించారు. నలంద కిషోర్‌ ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి కరోనా అంటించి పంపి చంపేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు అవినీతిపై నిలదీసిన అక్కోజి వినోద్‌ ను కొట్టి, తప్పుడు కేసులు పెట్టారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య అక్రమాలను ఎత్తిచూపిన మణిరత్నంను అరెస్టు చేసి బెదిరింపులకు గురిచేశారు. రాజమండ్రిలో వై సురేష్‌ ను ఇబ్బంది పెట్టారు. పోలీసులు చట్టప్రకారం పనిచేయడం నేర్చుకోండి…పోలీసు కస్టడీలో టార్చర్‌ మానండి. ప్రైవేటు కేసులు వేస్తాం, చట్టం ముందు నిలబెడతాం. కళంకిత ఆఫీసర్లను అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తే..మేమూ అదేవిధంగా ప్రవర్తిస్తాం. మీరు చట్టప్రకారం వ్యవహరించకపోతే మేమెందుకు చట్టాలను గౌరవించాలి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోం.

హతుడి భార్యను బెదిరిస్తారా… మీరు పోలీసులేనా?
మీడియా ప్రశ్నలకు చంద్రబాబు స్పందిస్తూ….ఉదయగిరిలో దళితుడైన నారాయణ చనిపోతే అతని భార్యను పోలీసులు బెదిరించారు. అతని భౌతికకాయాన్ని పూడ్చిపెడితే రీ పోస్టు మార్టం చేసే అవకాశం ఉందని బయటకు తీసి తగులబెట్టారు. అక్కడ ఐపీఎస్‌ అధికారి ఉన్నారా? గుర్తు పెట్టుకోండి. ఏదీ మరిచిపోం…తప్పు తప్పే…మేం అధికారంలోకి వచ్చాక దేన్నీ విడిచేది లేదు. నారాయణ మా పార్టీ కాకపోయినా ఆ కుటుంబానికి మేం అండగా నిలబడ్డాం. సమాజాన్ని రక్షించుకోవాల్సిన బాద్యత రాజకీయ పార్టీగా మాకు బాధ్యత ఉంది. ఎంత మందిని ఈ పోలీసులు చంపుతారో నేను రేపట్నుంచి చూస్తాను. నాలో మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దు. మీరు మాకు సహకరించాలి, రౌడీలకు కాదు. వెంకటేష్‌ ను హింసించిన సిఐడి సిఐ జగదీష్‌ తప్పించుకోలేరు. అన్యాయంగా ప్రవర్తించిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం.

ఎంపిని రాష్ట్రానికి రానీయ్యరా?
రాష్ట్రానికి వస్తే అక్రమంగా కేసులు పెడతారని భయపడి ఎంపీ రఘురామకృష్ణరాజు ముందుగానే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం, మంత్రులకు సిగ్గు అనిపించడం లేదా? ఎమ్మెల్యేలకు బాధ అనిపించలేదా? రానున్న కాలంలో మీరు రాష్ట్రంలో ఉండరా? వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలకు రానున్న కాలంలో ముకుతాడు వేస్తాం. అధికారంలో ఉన్నవారు అన్యాయంగా వ్యవహరిస్తే… అడ్డగోలు పరిపాలన చేస్తుంటే ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం. అది తమ బాధ్యత అని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Tags: అమ్మఒడిఅరాచకాలుఅరెస్ట్‌అసాంఘిక శక్తులుఉండవల్లి అనూషఎన్జీఓ రంగనాయకమ్మఎంపి రఘురామ రాజుఎమ్మెల్యే కిలారు రోశయ్యఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికదిరి ఎమ్మెల్యే ఓబుల రెడ్డికస్టోడియల్‌ టార్చర్‌కాపు కులంఖబడ్దార్గవర్నర్‌గౌతు శిరీషజగన్ రెడ్డిజాగ్రత్తడిక్టేటర్లతప్పుడు కేసులునందం సుబ్బయ్యనలంద కిషోర్‌నారాసుర రక్తచరిత్రపరాకాష్ట. కళంకితపోలీసులుఫ్రీలాన్సర్‌బాబాయ్బాలింతమర్డర్రాష్ట్రపతిరౌడీలుసిఐడి పోలీసులుసిగ్గుసీఐడీ కేసులుసైకో పాలనసోషల్‌ మీడియాహత్య
Previous Post

ఆటోపై తెగిపడ్డ హైటెన్షన్‌ వైర్లు

Next Post

సిఐ లక్ష్మణ్‌ బూటుకాలితో గుండెలపై తన్నారు!

మరిన్ని వార్తలు

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్
ఆంధ్రప్రదేశ్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ June 18, 2026
డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా?

చైతన్యరధం
@ June 18, 2026
టీడీపీలోకి నూతక్కి వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి నూతక్కి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ June 18, 2026
ఇంటింటికీ యోగా థీమ్‌తో యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ యోగా థీమ్‌తో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 18, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist