చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

వంద రోజుల్లో స్నేహపూర్వక పారిశ్రామిక విధానం

రాష్ట్ర పారిశ్రామిక మంత్రి టీజీ భరత్‌ వెల్లడి

చైతన్యరధం by చైతన్యరధం
August 1, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.75 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రానికి బీపీసీఎల్‌ రిఫైనరీ
  • కృష్ణపట్నంలో విన్‌ఫాస్ట్‌ సంస్థ బ్యాటరీల పరిశ్రమ
  • కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లస్టర్లు
  • ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహకాలు చెల్లిస్తాం

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రానున్న వంద రోజుల్లో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాన్ని రూపొందించనున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్‌ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్‌ పబ్లిసిటీ సెల్‌లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమల శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించి రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకురావాల్సిన పాలసీలపై పలు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారన్నారు.

వచ్చే 100 రోజుల్లో దేశంలోనే ఉత్తమమైన నూతన ఇండస్ట్రియల్‌ పాలసీ, ఎంఎస్‌ఎంఇ పాలసీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ, ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ పాలసీలను తీసుకురావాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వీటికి సంబంధించి డ్రాప్టు పాలసీలను రానున్న 15 రోజుల్లో రూపొందించి, వాటిపై స్టేక్‌ హోల్డర్లు అందరితో పూర్తి స్థాయిలో చర్చించి దేశంలోనే ఉత్తమమైన పాలసీలను రూపొందిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటికి తోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్‌ అని, ఆయన మీద ఉన్న విశ్వాసంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తాయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సింగిల్‌ విండోలో అన్ని అనుమతులు మంజూరు చేసే విధానాన్ని కూడా అమల్లోకి తెస్తామన్నారు.

రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గర్లో ఉన్న కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో తమ ప్రభుత్వ హయాంలో ఎకరం రూ.8 నుండి 16 లక్షల వరకూ ఉంటే, గత ప్రభుత్వం ఆ ధరను రూ.85 నుండి 90 లక్షల వరకూ పెంచిందన్నారు. ఈ పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి, పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని ముఖ్యమంత్రి అదేశించారని, అందుకు తగ్గట్టుగా కూడా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరో నాలుగు పారిశ్రామిక క్లస్టర్లు అదే విధంగా ఇప్పటికే రాష్ట్రంలో ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్‌డ్రగ్‌ పార్క్‌, కొప్పర్తి క్లస్టర్లు ఉన్నాయని, వాటికి అదనంగా నూతనంగా మరో నాలుగు పారిశ్రామిక క్లస్టర్లను కుప్పం, సత్యసాయి జిల్లా లేపాక్షి , శ్రీకాకుళం జిల్లా మూలపేట, ప్రకాశం జిల్లాలోని దొనకొండలలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, రానున్న రోజుల్లో వాటిని కూడా అభివృద్ధి పర్చనున్నట్లు తెలిపారు. రానున్న ఏడాదిలో రూ.1350 కోట్లతో చిత్తూరు నోడ్‌ను అభివృద్ధి పర్చనున్నట్లు తెలిపారు.

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పీపీపీ విధానాన్ని కూడా అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. రూ.75 వేల కోట్లు పెట్టుబడులతో బీపీసీఎల్‌ రిఫైనరీ రాష్ట్రానికి రాబోతున్నదని, అయితే దాన్ని ఎక్కడ పెట్టాలనే విషయాన్ని ముఖ్యమంత్రి 90 రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలిపారు. విన్‌ఫాస్ట్‌ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రికల్‌ కార్ల పరిశ్రమ పెట్టాలని ముందుకు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తమిళనాడు వెళ్లిపోయిందన్నారు. అయితే మా విజ్ఞప్తి మేరకు కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్‌ఫాస్ట్‌ ముందుకు వచ్చిందన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విషయంలో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ఫలితంగా పలు పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోయాయన్నారు. రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో దాదాపు రూ.11 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెడితే 2014-19 మధ్య కాలంలోనే రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్‌ అయ్యాయన్నారు. ఏపిఐఐసి భూముల కేటాయింపు విషయంలో 2014-19 మధ్య కాలంలో 14 వేల ఎకరాలు పరిశ్రమలకు కేటాయించగా, ఆ భూముల్లో పరిశ్రమలను కూడా స్థాపించారన్నారు. అయితే 2019-24 మధ్య కాలంలో 6,700 ఎకరాల భూములను కేటాయిస్తే వాటిలో ఎన్ని పరిశ్రమలు స్థాపించారు అనే విషయంలో ఏ మాత్రం స్పష్టత లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పాలసీలో స్పష్టత లేదని, సింగిల్‌ విండో విధానం కూడా సక్రమంగా అమలు కాలేదన్నారు.

గత పదేళ్ల కాలంలో ఎం.ఎస్‌.ఎం.ఇ.లకు ప్రోత్సాహకాలను అందజేసే విషయాన్ని పరిశీలిస్తే 2014-19 మధ్య కాలంలో 66 శాతం మేర ప్రోత్సాహకాలను విడుదల చేస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం 34 శాతం ప్రోత్సాహకాలనే విడుదల చేశారన్నారు. ఎంఎస్‌ఎంఇ, టెక్స్‌టైల్‌ రంగాలకు సంబంధించి దాదాపు రూ.5 వేల కోట్లు మేర ప్రోత్సాహకాలను చెల్లించాల్సి ఉందని, వచ్చే ఐదేళ్లకు మరో రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రోత్సాహకాలన్నింటినీ తప్పనిసరిగా చెల్లించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బరోసా ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌ యువరాజ్‌ కూడా పాల్గొన్నారు.

Tags: బీపీసీఎల్‌ రిఫైనరీవిన్‌ఫాస్ట్‌ సంస్థస్నేహపూర్వక పారిశ్రామిక విధానం
Previous Post

పోలీస్‌ వ్యవస్థలో భారీ ప్రక్షాళన

Next Post

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ఆర్డినెన్స్‌ జారీ

Next Post

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ఆర్డినెన్స్‌ జారీ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.