తిరుపతి: పదేళ్ల తర్వాత జరుగుతున్న తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గం పరిధిలోని పానెల్ సభ్యులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులతో టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై సుగుణమ్మ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని… సజావుగా జరిగితే టీడీపీ గెలిచి తీరుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి టౌన్ బ్యాంక్ కమిటీ, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, రాష్ట్ర కమిటీ, తిరుపతి కార్పొరేటర్, తిరుపతి నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.