చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

గత ప్రభుత్వ అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపం

గత ప్రభుత్వ అప్పులు, విధ్వంసంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ వివరణ

by చైతన్యరధం
Nov 16, 2024 at 7:15am
in ముఖ్య వార్తలు
గత ప్రభుత్వ అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అడ్డగోలు దోపిడీ కోసం వ్యవస్థల విధ్వంసం
  • స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు
  • ఇప్పటికి తేలింది రూ.9,74,556 కోట్ల అప్పులు, తవ్వితే ఇంకెంత ఉంటాయో?
  • అసమర్థ పాలనలో తగ్గిన తలసరి ఆదాయం, పెరిగిన తలసరి ఖర్చు
  • సమస్యలు అధిగమించి ఒక్కో ఇటుకా పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం
  • రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని చెప్పడం లేదు
  • వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకారంతో ఊపిరిపోశాం
  • సూపర్‌-6 హామీలతో పాటు అదనంగా మరిన్ని పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తాం
  • పేదలకు గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటిస్థలం
  • కన్నతల్లిపై అసభ్యకర పోస్టింగులు పెట్టించే వాళ్లు మనుషులా, పశువులా?
  • సోషల్‌ మీడియా సైకోల కట్టడికి ప్రత్యేక చట్టం
  • గత ప్రభుత్వ అప్పులు, విధ్వంసంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ వివరణ

అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాదుడు, స్కాముల కోసమే స్కీములు పెట్టి చరిత్రలో లేని విధంగా రాష్ట్రాన్ని దోచేశారన్నారు. ప్రజల ఆశలు నెరవేర్చాలంటే మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదు. ఒక్కో ఇటుకా పేర్చుతూ ముందుకెళ్తున్నాం. వెంటిలేటర్‌ పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహకారంతో ఊపిరి పోస్తున్నామన్నారు. బడ్జెట్‌పై శాసనసభలో శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అప్పులు, గత ప్రభుత్వ తప్పులు, నేరాలు, విధ్వంసంపై సుదీర్ఘంగా వివరించారు.

ప్రజల నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెడదాం
ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. వారి కోసం పని చేయాల్సిన బాధ్యత పాలకులుగా మాపై ఉంది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు పెను విప్లవంలా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. ప్రజలు గెలిస్తే రాష్ట్రం నిలదొక్కుకుంటుంది…ప్రజలు గెలవాలంటే ఎన్డీయేను గెలిపించాలని ఎన్నికల ముందు ప్రజల్ని కోరాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పిలుపునిస్తే జనం ముందుకొచ్చి ఓట్లేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ముందు నుంచీ చెపుతూనే ఉన్నారు. బీజేపీ కూడా వచ్చి కలవడంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల 93 శాతం స్ట్రైక్‌ రేట్‌ తో సీట్లు సాధించాం. ఇది ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి తార్కాణం. నూటికి నూరు శాతం ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం. 1995లో సీఎం అవ్వకముందు ఏడాది పాటు ఆర్థిక శాఖ మంత్రిగా చేశాను. ఆనాడు కూడా ఇప్పుడున్నటు వంటి దారుణ పరిస్థితులు లేవు. నాడు కూడా ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. సవాల్‌గా తీసుకుని పాలన కొత్తపుంతలు తొక్కించాం.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-12-2025

కూటమి ప్రభుత్వంలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

చైతన్యరధం ఈ పేపర్ 16-12-2025

1995 నాటి పాలన ఒక మోడల్‌. కష్టాల నుండి బయటకు తీసుకురావడమే కాకుండా రాష్ట్రానికి గట్టి పునాది వేసి ముందుకెళ్లాం. 2014లో విభజన జరిగిన తీరు మనమంతా చూశాం. రాష్ట్రానికి ఆదాయం లేదు, కనీసం పెన్షన్లు…జీతాలు వస్తాయా అని భయపడిన రోజులు ఉన్నాయి. 2014లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ప్రజల సహకారంతో, అనుభవంతో సమర్థవంతంగా పని చేశాం. 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉంటే అధిగమించి మిగులు విద్యుత్‌ సాధించాం. ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు. రాష్ట్ర విభజనతో రాజధాని లేని పరిస్థితి ఏర్పడిరది. 33 వేల ఎకరాలను 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. 72 శాతం మేర పోలవరాన్ని పూర్తి చేశాం…టీడీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేది. 13.5 శాతం గ్రోత్‌ రేట్‌ సాధించాం.

పెట్టుబడులు, పథకాలు, పాలసీలతో దేశ దృష్టిని ఆకర్షించాం. కానీ 2019లో ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు విధ్వంసం సృష్టించారు. ఆ విధ్వంస పరిస్థితులు అర్థం చేసుకోవడానికే నాలుగైదు నెలల సమయం పట్టింది. కనీసం ఒక్క శాఖపైనా శ్వేతపత్రాలు విడుదల చేయకపోవడమే కాకుండా కాగ్‌కు కూడా లెక్కలు ఇవ్వలేదు. ఆడిటింగ్‌ చేయించకుండా ఇష్టానుసారంగా చేశారు. రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత ఐదేళ్లలోనే ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచకాలు, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కివెళ్లేలా చేశారు. రాష్ట్ర బ్రాండ్‌ను కూడా దెబ్బతీశారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల కోసం పని చేసి ప్రజల పక్షాన నిలబడ్డామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

దొరికిన కాడికి దోచేశారు
గత ప్రభుత్వం వ్యవస్థలను విధ్వంసం చేస్తూనే వినూత్న విధానాల్లో దోపిడీ చేసింది. రాజకీయ నాయకుడు ఇలా కూడా దోపిడీ చేసి తప్పించుకుంటారని కలలో కూడా అనుకోలేదు. దొరికినకాడికి దోచేశారు. తప్పుడు పనులకు వ్యవస్థలను వాడుకుని నాశనం చేశారు. ప్రజాధనాన్ని దుబారా చేశారు. రాజధాని నిర్మాణం ఆపేశారు. మేటి నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని అందరూ అనుకున్నారు. లక్ష కోట్లు ఖర్చు అవుతుందని గత పాలకులు తప్పుడు ప్రచారం చేశారు. ఇది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు….రైతులు ఇచ్చిన భూముల్లో 10 వేల ఎకరాలు మిగులుతుంది. దాన్ని విక్రయిస్తే రాజధాని నిర్మాణం జరిగిపోతుందని చెప్తే వినిపించుకోలేదు. రాష్ట్ర జీవనాడి పోలవరంను పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి కరవు రాదనే ఉద్దేశంతో 2014`19 మధ్య పని చేశాం. కానీ వైసీపీ పాలకులు డయాఫ్రం వాల్‌ను దెబ్బతీసి ప్రాజెక్ట్‌ను పడుకోబెట్టారు. నిర్మాణ ఏజెన్సీని, అధికారులను మార్చి ప్రాజెక్టును గాలికొదిలేశారు. రెండేళ్ల పాటు ప్రాజెక్టును అసలు పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు తప్పుబట్టారు.

విద్యుత్‌ రంగంలో రూ.1.29 లక్షల కోట్ల నష్టం
ప్రభుత్వ టెర్రరిజంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని పరిశ్రమలు తరలిపోయాయి. విద్యుత్‌ రంగంలో రూ.1.29 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. సోలార్‌, విండ్‌ పవర్‌ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం విద్యుత్‌ తీసుకోలేదు. కోర్టు తీర్పుతో రూ.9 వేల కోట్లు అప్పనంగా ఇవ్వాల్సి వచ్చింది. రూ.7.91 పైసలు పెట్టి బయట మార్కెట్‌లో విద్యుత్‌ కొన్నారు. తప్పుడు నిర్ణయాలతో విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేశారు. ఇసుకలో దోపిడీకి పాల్పడి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. ఇసుకలో రూ.30 వేల కోట్లు దోచుకున్నారు. ఇక మద్యం పాలసీ అయితే ఇప్పటికీ అర్థం కావడం లేదు. మద్యం తయారు చేసే కంపెనీలను బెదిరించి బలవంతంగా లాక్కుని సొంత బ్రాండ్లు తయారు చేశారు. వాళ్లే తయారు చేసి, షాపులకు పంపిణీ చేసి, అమ్మకం కూడా వాళ్లే చేశారు.

ఆన్‌ లైన్‌ నగదు విధానం లేకుండా చేశారు. కలెక్షన్‌ సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చేది. మొన్నటి వరకు రాష్ట్రంలో సైకో బ్రాండ్స్‌ దొరికేవి. కానీ ఇప్పుడు ప్రపంచంలోని అన్ని బ్రాండ్లు లభిస్తున్నాయి. సంపద పెంచడం చేతకాక విపరీతంగా పన్నులు పెంచేశారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీశారు. శాంతి, భద్రతలు కూడా దిగజార్చారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా పోలీస్‌ వ్యవస్థను ఉపయోగించారు. ఆస్తులను ధ్వంసం చేశారు. తోటలు నరికేశారు. భూములు కబ్జా చేశారు. భూములను 22ఏ జాబితాలో చేర్చి..అధికార పార్టీ నేతల పేర్ల మీద భూములను మార్చుకోగానే ఆ జాబితా నుండి తొలగించి దోపిడీకి పాల్పడ్డారు. కరోనా సమయంలో మాస్క్‌ అడిగిన పాపానికి డాక్టర్‌ సుధాకర్‌ను…వేధించి, పిచ్చివాణ్ణి చేసి నడిరోడ్డుపై పడేసి చనిపోయేలా చేశారు. ఆయనను కాపాడాలని ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో మూలధన వ్యయం సున్నా
ఐదేళ్లలో మూలధన వ్యయం తగ్గించారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడిపోయాయి. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా గుంతల పూడ్చివేతకు ఖర్చు చేయలేదు. వ్యక్తి ఐపీ పెడితే అప్పులోళ్లు వచ్చినట్లు ఏపీ పరిస్థితి తయారైంది. ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు. పొలానికి అడవి నుండి పందులు వస్తాయి…తిన్నంత తిని పోతూ పోతూ మిగిలిన పంటను నాశనం చేసి వెళ్తాయి. రాష్ట్ర పరిస్థితిని కూడా గత పాలకులు అదే విధంగా మార్చారు. అడవి పందులు విధ్వంసం చేస్తే మళ్లీ పంట వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ గత పాలకులు చేసిన విధ్వంసంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు దుర్మార్గంగా వ్యవహరించారు. ఆదాయం సృష్టించడానికి ఒక్క పని కూడా చేపట్టలేదు. పెట్టబడులు పెట్టేవారిని తరిమేశారు. రాష్ట్రంపై నమ్మకం కోల్పోయేలా చేశారు. ఎన్డీయే గెలవకపోతే ఉన్న రెండుమూడు ఎకరాల భూమి అమ్మకుని వెళ్లిపోయే పరిస్థితి ఉండేదని ప్రజలు భావించారు. అరాచక పాలన నుంచి విముక్తి కోసం ప్రపంచంలోని తెలుగువారంతా ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు వేశారని సీఎం చంద్రబాబు అన్నారు.

సొంత పత్రికకు ప్రజాధనం తగలేశారు
రూ.430 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. ఆ భవనాలు చూసి నాకే కళ్లు తిరిగాయి. ప్రభుత్వ ధనంతో ప్యాలెస్‌లు కడతారా? సిగ్గూఎగ్గూ లేకుండా కుటుంబ సభ్యులకు కూడా ప్యాలెస్‌లు కట్టుకున్నారు. రుషికొండపై 7 బ్లాకులు కట్టారు. పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులను మభ్యపెట్టారు. కోట్లు కుమ్మరించి ప్యాలెస్‌ కట్టుకున్నారు కానీ దానిలోకి వెళ్లలేకపోయారు. రూ.750 కోట్లతో సర్వేరాళ్లపై బొమ్మలు వేసుకున్నారు. వాటిని తొలగించడానికి రూ.30 కోట్ల దాకా ఖర్చు అయింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేశారు. కోర్టు ఆదేశాలతో వాటిని తొలగించడానికి వేల కోట్లు తగలేశారు. రూ.400 కోట్లు సొంత పత్రిక సాక్షికి ప్రకటనల రూపంలో ఇచ్చుకున్నారు. ప్రజాధనంతో వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చుకున్నారని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు.

కన్నతల్లిపై అసభ్యకర పోస్టింగులు పెట్టించే వాళ్లు మనుషులా…పశువులా..?
ఇక సోషల్‌ మీడియా సైకోలను తయారు చేశారు. కన్నతల్లిపైనా అసభ్యకర పోస్టింగులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి.? కన్నతల్లి శీలాన్ని శంకించే పరిస్థితి ఉందంటే వాళ్లు మనుషులా…పశువులా? తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్కా? ఎన్డీయే కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరు…ఒకవేళ పెడితే కఠినంగా శిక్షిస్తాం. ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తాం. రాబోయే రోజల్లో ఏ ఆడబిడ్డా అవమాన పడటానికి వీల్ల్లేదు. చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. వ్యవస్థీకృత నేరాలు చేశారు. రాజకీయంలో అవినీతి చూసి ఉంటాం…కానీ అవినీతి, అక్రమాల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూస్తున్నాం. టీడీపీ స్థాపించి 45 ఏళ్లు అయింది…ఇప్పటికీ మాకు టీవీ, పేపరు లేవు. కానీ వాళ్లు అధికారంతో అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. రైతు బజార్లు, తహసీల్దార్‌ కార్యాలయాలు తాకట్టు పెట్టారు.

మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి తరువాత మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. కేంద్ర నిధులు దారి మళ్లించారు. పేదల పథకాలకు గండికొట్టారు. 2019కి ముందు లోకేష్‌ 24 వేల కి.మీ సిమెంట్లు రోడ్లు వేయించారు…కానీ గత ఐదేళ్లు ఏం చేశారో తెలీదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టారు. జల్‌ జీవన్‌ మిషన్‌ గొప్ప కార్యక్రమం. ప్రతి ఇంటికి నీరివ్వడం ఈ పథకం లక్ష్యం. 45 శాతం మేర కేంద్రం నిధులు ఇస్తుంది. దాన్ని కూడా అస్తవ్యస్థం చేశారు. ప్రయోగాలతో విద్యా వ్యవస్థను నాశనం చేశారు. స్కూళ్లు విలీనం చేయడం వల్ల డ్రాప్‌ అవుట్‌ రేట్‌ పెరిగింది. ఇంగ్లీష్‌ మీడియం వాళ్లే ప్రవేశపెట్టినట్లు…అంతకు ముందు లేనట్లు ప్రవర్తించారు. ఎవరైనా మాట్లాడితే పేదల వ్యతిరేకులుగా చిత్రీకరించారు. వైద్య, వ్యవసాయ, అన్ని రంగాలను చిన్నచూపు చూసి నాశనం చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

తేలింది రూ.9,74,556 కోట్ల అప్పులు…తవ్వితే ఇంకెంత ఉంటాయో అప్పులు ఎక్కడున్నాయని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అప్పులు రూ.4.35 లక్షల కోట్లు ఉన్నాయి. పబ్లిక్‌ అకౌంట్స్‌ లయబిలిటీస్‌ రూ.80,914 కోట్లు, కార్పొరేషన్‌ అప్పులు రూ.2,48,670 కోట్లు, సివిల్‌ సప్లయిస్‌ శాఖలో రూ.36 వేల కోట్లు, విద్యుత్‌ రంగంలో రూ.34,267 కోట్లు, చెల్లించాల్సిన బకాయిలు రూ.1,13,244 కోట్లు, ఉద్యోగులకు రూ.21,980 కోట్లు, నాన్‌ కాంట్రిబ్యూషన్‌ సింకింగ్‌ ఫండ్‌ కింద రూ.1,191కోట్లు…ఇవన్నీ కలుపుకుంటే రూ.9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయి. ఇది అబద్ధం అని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజీళ్లు తీయిస్తా. జీవోలు ఆన్‌ లైన్‌ లో లేకుండా చేస్తే తిరిగి ఆన్‌ లైన్‌ విధానం ప్రవేశపెట్టాం. గడిచిన ప్రభుత్వం దాచి పెట్టిన చీకటి జోవోలను కూడా ఆన్‌ లైనోలో పెట్టాం. 2014-19 మధ్య 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేశాం…ఆ డబ్బులు కూడా బోర్డుకే వెళ్లేవి. కానీ గత ప్రభుత్వం రూపాయికి పెంచి ప్రభుత్వమే తీసుకుంది. వాటర్‌ టారిఫ్‌ కిలో లీటర్‌ కు రూ.40ల నుండి రూ.120కి పెంచారు.

ఇసుక మేము ఉచితంగా ఇస్తే టన్ను రూ.470లకు అమ్ముకున్నారు. ఆర్థిక లోటు రూ.35,440 కోట్ల నుండి రూ.59,995 కోట్లకు పెంచారు. తలసరి ఖర్చు 2019కి ముందు రూ.74,790 ఉంటే 2023-24 నాటికి రూ.1,44,336కు పెరిగింది. అప్పులు, ఖర్చులు పెరిగి ప్రజల ఆదాయం తగ్గింది. తలసరి ఆదాయం గ్రోత్‌ రేట్‌ 13.2 శాతం నుండి 9.5 శాతానికి తగ్గింది. ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ గ్రోత్‌ రేట్‌ 15.3 శాతం నుండి 6.8 శాతానికి తగ్గింది. దేశంలోనే ఎక్కువగా వ్యవసాయంలో 16.6 శాతం గ్రోత్‌ రేట్‌ ను మేము సాధిస్తే వారొచ్చాక 10.5 శాతానికి తగ్గిపోయింది. మొత్తంగా 13.5 గ్రోత్‌ రేట్‌ ఉంటే దాన్ని 10.6 శాతానికి దిగజార్చారు. 3 శాతం గ్రోత్‌ రేట్‌ తగ్గితే రూ.6.94 లక్షల కోట్ల కోట్ల ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పటికీ 13.5 శాతం గ్రోత్‌ రేట్‌ ఉంటే రూ.76,195 కోట్ల అదనపు ఆదాయం వచ్చేది. రూ.76 వేల కోట్లతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. 2018-19 నాటికి తెలంగాణ కంటే మన రాష్ట్ర జీఎస్డీపీ రూ.17 వేల కోట్లు ఎక్కువ సాధించాం. 2023-24 నాటికి తెలంగాణ మన రాష్ట్రం కంటే రూ.62 వేల కోట్లు అధికంగా సాధించింది. అంటే ఏపీ ఆదాయం కంటే తెలంగాణ ఎక్కువ సాధించింది. ఇది గత పాలకుల అవినీతి, అసమర్థత కాక మరేమిటి? తలసరి ఆదాయంలో ఏపీ, తెలంగాణ మధ్య వ్యత్యాసం 2018-19 నాటికి రూ.55 వేలు ఉంటే 2023-24 నాటికి రూ.1.14 లక్షలకు చేరింది. తలసరి ఆదాయం పెరగలేదు, వృద్ధి రేటు లేదు. బటన్‌ నొక్కితే ప్రజలకు ఏమైనా వచ్చిందా…అప్పులు మాత్రం పెరిగాయని సీఎం చంద్రబాబు వివరించారు.

ఆస్తుల సృష్టి జరగలేదు…బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు
అమరావతి, పోలవరం, విద్యుత్‌ రంగాలను విధ్వంసం చేశారు. ఐదేళ్లుగా పెట్టుబడి దారుల్లో నమ్మకం పోయింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏమీ కల్పించలేదు. ఐదేళ్ల పాటు రాష్ట్రం విష వలయంలో చిక్కింది. ఆస్తుల సృష్టి లేదు…ఆదాయం పెరగలేదు. ఆదాయం తగ్గింపుతో పాటు పన్నులు పెంచారు. బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు…ఆస్తులు తాకట్టు పెట్టారు. మేము అధికారంలోకి రాగానే 7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. స్వర్ణాంధ్ర విజన్‌ 2047 రూపకల్పన చేశాం. ప్రజలు 21 మంది ఎంపీలను గెలిపించడంతో ఢిల్లీలో పలుకుబడి పెరిగింది. కేంద్ర సహకారం లేకుంటే రాష్ట్రం ఏమయ్యేదో తెలిసేది కాదు. రాష్ట్రాన్ని వెంటిలేటర్‌ నుండి ఇప్పుడే బయటకు తీశాం. 150 రోజుల్లో ఎన్నో పథకాలు, నిర్ణయాలు, పాలసీలు తెచ్చాం. సంపద సృష్టించి, ఉపాధి మార్గాలు పెంచేందుకు ముందుకెళ్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 పాలసీలు తెచ్చాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంతో ముందుకెళ్తున్నాం. సీఎంగా బాధ్యతలు చేప్టటిన వెంటనే 5 హామీల అమలుపై సంతకం చేశాం. 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. రూ.4 వేలు సామాజిక పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ. ధనిక రాష్ట్రాలు కూడా ఇవ్వడం లేదు. గత పాలకులు అన్న క్యాంటీన్లను కూడా నాశనం చేశారు. పేద వాడికి అన్నం పెట్టడాన్ని కూడా ఓర్చుకోలేకపోయారు. నూతన మద్యం పాలసీ, ఇసుక పాలసీ తెచ్చాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పాలసీలను సమర్థవంతంగా అమలయ్యేలా బాధ్యత తీసుకోవాలి. అందరం ప్రజల మనోభావాల ప్రకారం పని చేయాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు.

నేరస్తుల రాజకీయ ముసుగు తొలగిస్తాం
నేరాల విషయంలో జీరో టాలరెన్స్‌ విదానంతో వెళ్తాం. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకునే వారి ముసుగు తొలగిస్తాం. సభకు వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవచ్చు…కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. త్వరలో టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. అమరావతి, పోలవరాన్ని పట్టాలెక్కించాం. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు. సూపర్‌-6 లో ఇచ్చిన దీపం-2 పథకం అమలు చేశాం. 48 గంటల్లోనే సిలిండర్‌ కు డబ్బులు అందిస్తున్నాం. లబ్ధిదారులకు నేరుగా అందించే విధానాన్ని త్వరలో తీసుకొస్తాం. 150 రోజుల్లో లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టాం. రూ.860 కోట్లతో రోడ్లపై గుంతలు పూడ్చుతున్నాం. గౌడ కులస్థులకు 10 శాతం మద్య షాపులు కేటాయించాం. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచాం. వేద విద్య అభ్యసించిన వారికి రూ.3 వేలు భృతి అందిస్తున్నాం. గత పాలకులు రైతులకు పెట్టిన రూ.1670 కోట్ల బకాయిలు చెల్లించాం. పాడి రైతులకు 90 శాతం రాయితీతో షెడ్లు నిర్మిస్తున్నాం. కొప్పర్తి, ఓర్వకల్లు, నక్కపల్లి, కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఓర్వకల్లులో 300 ఎకరాలు డ్రోన్‌ హబ్‌కు కేటాయించాం. విశాఖలో రైల్వే జోన్‌కు భూమి కేటాయించాం..త్వరలో ప్రధాని మోదీ భూమి పూజ చేస్తారు. డిసెంబరులో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు నిర్వహిస్తాం. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి జాగా ఇస్తాం. సంసద సృష్టించి ఆదాయం పెంచి, మళ్లీ పేదల సాధికారతకు ఖర్చు చేస్తాం. సూపర్‌ 6 హామీలను పూర్తిగా నెరవేర్చడమే కాదు..అదనంగా మరిన్ని పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Previous Post

ప్రైవేటు సంస్థలకు దీటుగా ఇంటర్‌ విద్యలో సంస్కరణలు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2024

మరిన్ని వార్తలు

విద్య ఎంత ముఖ్యమో..విలువలు కూడా అంతే ముఖ్యం
ఆంధ్రప్రదేశ్

విద్య ఎంత ముఖ్యమో..విలువలు కూడా అంతే ముఖ్యం

చైతన్యరధం
@ December 14, 2025
కాగ్నిజెంట్‌ రాక.. చారిత్రక మైలురాయి
ఆంధ్రప్రదేశ్

కాగ్నిజెంట్‌ రాక.. చారిత్రక మైలురాయి

చైతన్యరధం
@ December 13, 2025
ఐటీ డెస్టినేషన్‌ కేంద్రంగా విశాఖ
ఆంధ్రప్రదేశ్

ఐటీ డెస్టినేషన్‌ కేంద్రంగా విశాఖ

చైతన్యరధం
@ December 13, 2025
ఏఐ విప్లవంలో అగ్రపథాన ఏపీ
ఆంధ్రప్రదేశ్

ఏఐ విప్లవంలో అగ్రపథాన ఏపీ

చైతన్యరధం
@ December 11, 2025
వ్యవసాయ యాంత్రీకరణకు అగ్రికల్చర్‌ ఎక్విప్మెంట్‌ బ్యాంక్‌
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ యాంత్రీకరణకు అగ్రికల్చర్‌ ఎక్విప్మెంట్‌ బ్యాంక్‌

చైతన్యరధం
@ December 11, 2025
అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం
ఆంధ్రప్రదేశ్

అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం

చైతన్యరధం
@ December 11, 2025
బీ పాజిటివ్‌!
ఆంధ్రప్రదేశ్

అవసరమైతే ప్రజలు మెచ్చే పాలనివ్వాలి బిజినెస్‌ రూల్స్‌ మార్చుకుందాం

చైతన్యరధం
@ December 11, 2025
బీ పాజిటివ్‌!
ఆంధ్రప్రదేశ్

బీ పాజిటివ్‌!

చైతన్యరధం
@ December 11, 2025
Load More

ముఖ్య వార్తలు

విద్య ఎంత ముఖ్యమో..విలువలు కూడా అంతే ముఖ్యం

విద్య ఎంత ముఖ్యమో..విలువలు కూడా అంతే ముఖ్యం

చైతన్యరధం
@ December 14, 2025
కాగ్నిజెంట్‌ రాక.. చారిత్రక మైలురాయి

కాగ్నిజెంట్‌ రాక.. చారిత్రక మైలురాయి

చైతన్యరధం
@ December 13, 2025
ఐటీ డెస్టినేషన్‌ కేంద్రంగా విశాఖ

ఐటీ డెస్టినేషన్‌ కేంద్రంగా విశాఖ

చైతన్యరధం
@ December 13, 2025
ఏఐ విప్లవంలో అగ్రపథాన ఏపీ

ఏఐ విప్లవంలో అగ్రపథాన ఏపీ

చైతన్యరధం
@ December 11, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కూటమి ప్రభుత్వంలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

కూటమి ప్రభుత్వంలో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

చైతన్యరధం
@ December 16, 2025
స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌గా..అమరావతిలో అమరజీవి స్మృతివనం

స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌గా..అమరావతిలో అమరజీవి స్మృతివనం

చైతన్యరధం
@ December 16, 2025
ఆధ్యాత్మికత ద్వారా విశ్వ చైతన్యం

ఆధ్యాత్మికత ద్వారా విశ్వ చైతన్యం

చైతన్యరధం
@ December 16, 2025
విద్యా ప్రమాణాల పెంపునకు ఏపీకి మద్దతుగా నిలవాలి

విద్యా ప్రమాణాల పెంపునకు ఏపీకి మద్దతుగా నిలవాలి

చైతన్యరధం
@ December 16, 2025
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist