- కలిసికట్టుగా అందరం ముందుకు సాగుదాం
- ఎమ్మెల్యేలూ పాఠశాలలను విజిట్ చేయాలి
- గత పాలనలో 117 జీవో తెచ్చి
- ప్రభుత్వ విద్యావ్యవస్థను కుప్పకూల్చారు
- 10 లక్షల మంది బడికి దూరమయ్యారు
- యూనివర్సిటీలను బంధుగణంతో నింపేశారు
- టీం 11 ఉండి ఉంటే సూటిగా ప్రశ్నించేవాడిని
- బాధ్యతగా తీసుకుని సంస్కరణలు తెస్తున్నాం
- స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్లలో రూ.1,000 కోట్లు ఆదా
- 90 రోజుల్లో చిక్కులు తొలగించి అధ్యాపక పోస్టుల భర్తీ
- శాసనసభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
- స్కూల్, ఉన్నత విద్య, స్కిల్ బడ్జెట్‌కు ప్రతిపాదనలు
అమరావతి(చైతన్యరథం): విద్యారంగంలో తాము చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తా మన్న నమ్మకం ఉంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో విద్యాశాఖ రిపోర్టు కార్డును సభ ముందుంచుతాం. ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులందరం కలిసికట్టుగా పనిచేసి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చాటుదాం, పిల్లల భవిష్యత్తును అత్యుత్తమంగా తీర్చిదిద్దుదామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. శాసనసభలో మంత్రి లోకేష్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.32,308.31 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 2,566.80 కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖకు రూ.1231.91 కోట్లు, ఐటీ/ఎలక్ట్రానిక్స్‌కు రూ.536.28 కోట్ల బడ్జెట్ డిమాండ్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు మనల్ని చూసి నేర్చు కునేలా ఆంధ్ర మోడల్ కోసం పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతిని ధులంతా కృషిచేద్దాం. ఇప్పటికే కొన్నిరాష్ట్రాలు ఏపీకి వచ్చి అధ్యయనం చేస్తున్నాయి. ఏపీ విద్యావ్యవస్థలో సంస్కరణలు, వన్ క్లాన్ వన్ టీచర్ విధానాలను అధ్యయనం చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర రాష్ట్రాలకు చెబుతున్నారు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందం రాష్ట్రంలో విజిట్ చేశారు, మరికొందరు రాబోతున్నారు. ఇతర రాష్ట్రాలే కాదు, ఇతర దేశాలు కూడా ఏపీ విధానాలు చూసి అమలుచేసేలా తీర్చిదిద్దుతాం. విద్యా శాఖను ఒక బాధ్యతగా నేను నిర్వహిస్తున్నా. ఏ సమస్య తలెత్తినా వాట్సాప్ మెసేజ్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నాం. కలిసిక ట్టుగా పనిచేసి బెస్ట్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం. విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు కోసం కమిట్‌మెంట్, పట్టుదలతో మనమంతా పనిచేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి సొంతబిడ్డలా భావించి, అక్కడి సమస్యలపై స్పందిం చాలి. ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, గ్రంధాలయాల బలోపేతానికి పార్టీలకు అతీతంగా శాసనసభ్యులందరం పని చేయాల్సి ఉంది. నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. తాము తీసుకునే నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రజల నుంచి కూడా ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను స్వీకరిస్తున్నాం.
ప్రతివారం ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి
ప్రతి శాసనసభ్యుడు మండలానికి రెండు పాఠశాలలను దత్తత తీసుకొని అక్కడ ఎన్‌రోల్‌మెంట్ రెట్టింపు చేయండి. ప్రతి నియో జకవర్గంలో ఒక్క పాఠశాలనైనా వెయ్యి మంది విద్యార్థులుండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉంది. అందరం కలిసిక ట్టుగా విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఇది కేవలం ఒక్క మంత్రి వల్లనో, సెక్రటరీ వల్లనో సాధ్యం కాదు. అందరూ భాగస్వా ములు కావాలి. ప్రతివారం ఒక ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేసి ఇన్ ఫ్రా, అటెండెన్స్, ఇతర అంశాలపై మాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. దీనిని ఫాం రూపంలో మాకు అందజేస్తే ఆయా పాఠశాలల్లో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజా ప్రభుత్వంలో నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి ఈ శాఖ నీకు అవసరమా.. ఇండస్ట్రీస్, పవర్ లేదా ఎనర్జీ శాఖలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. అనేక సంఘాలు, మధ్యాహ్న భోజనం, ఫీజు రీయింబ ర్స్‌మెంట్ వంటి ఎన్నో సమస్యలు ఉంటాయని చెప్పారు. అందుకే ఈ శాఖను కోరి తీసుకుంటున్నానని చెప్పా. విద్యాశాఖలో సమస్య లు పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. పిల్లల భవిష్యత్తు విద్యాశాఖతో ముడిపడి ఉంది. ఇప్పుడు మనం తెచ్చే సంస్కరణలు రాబోయే దశాబ్దాలకు పనికొస్తాయనే లక్ష్యంతో నేను విద్యాశాఖను తీసుకున్నా.
డ్రాప్ బాక్సును దుర్వినియోగం చేశారు
యువగళం పాదయాత్ర నాలో ఎంతో మార్పు తెచ్చింది. ప్రజ లకు దగ్గర చేసింది, ప్రజల సమస్యలు అర్థం చేసుకునే అవకాశం కల్పించింది. 2019-24 నడుమ అన్నిరంగాల్లో మాదిరి విద్యా శాఖలో కూడా విధ్వంసం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లల ట్రాన్సిట్ పిరి యడ్‌ను తెలుసుకునేందుకు ఉద్దేశించిన డ్రాప్‌బాక్స్‌ను దుర్వినియో గం చేశారు. సుమారు 3 లక్షల మంది పిల్లలను డ్రాప్ బాక్స్‌లో పెట్టారు. మధ్యాహ్న భోజనం, స్టూడెంట్ కిట్స్‌కు సంబంధించి వారికి కావాల్సిన అన్ని ఎన్ టైటిల్‌మెంట్స్ డ్రా చేశారు. నెంబర్లు మేనేజ్ చేయడానికి గత పాలకులు ఎలా వ్యవహరించారో దీనిని బట్టి స్పష్టమవుతోంది. సంస్కరణలు తీసుకువచ్చినపుడు ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు స్టేక్ హోల్డర్లందరితో మాట్లాడా ల్సి ఉంది. ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా జీవో 117 తీసుకు వచ్చారు. ఆనాడు ఉపాధ్యాయులు నన్ను కలిసి దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు తీవ్రంగా నష్టపోతాయి, వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంఘాలంద రితో చర్చించి జీవో 117 రద్దుచేస్తానని ఇచ్చిన హామీ మేరకు జీవో 117 రద్దుచేసి ప్రత్యామ్నాయం తేవడం జరిగింది. జీవో 117 ద్వారా సింగిల్ టీచర్ పాఠశాలలు 12,512కు పెరిగా యి. దీనివల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు (లెర్నింగ్ అవుట్ కమ్స్) దారుణంగా దెబ్బతిన్నాయి. 5వ తరగతి పిల్లలు గ్రేడ్ -2 తెలుగును 2018లో 57 శాతం అర్థం చేసుకోగలిగితే, గత ప్రభుత్వంలో 37 శాతానికి పడిపోయింది. 8వ తరగతి పిల్లలు సెకండ్ గ్రేడ్ తెలుగును చదవగలుగుతున్నారా అని పరిశీలించి నప్పుడు 2018లో 78 శాతం ఉంటే, గత ప్రభుత్వంలో 53 శాతానికి పడిపోయింది. నేషనల్ ఎచీవ్‌మెంట్ సర్వేలో 3వ తరగతి లాంగ్వేజ్‌లో ఫస్ట్ ర్యాంకు నుంచి 27వ ర్యాంకుకు పడిపోయాం. 5వ తరగతి మ్యాథ్స్‌లో 5వ ర్యాంకు నుంచి 21వ ర్యాంకుకు పడిపోయాం. క్లాస్-7 సైన్స్‌లో 8వ ర్యాంకు నుంచి 32వ ర్యాంకుకు పడిపోయాం.
అనాలోచిత చర్యలతో అధఃపాతాళానికి..
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసినప్పుడు భారతదేశం లోనే అతితక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రం ఆంధ్రపదేశ్ అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు అడల్ట్ లిటరసీపై న, డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి బీహార్ కన్నా తక్కువ లిటరసీకి పడిపోయాం. మూడేళ్లలో ఏపీని లిటరసీలో టాప్-5కి తీసుకు వచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చాను. మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సీబీఎసఈ, టోఫెల్, ఐబీ అంటా రు. ఉపాధ్యాయులకు స్కిల్ అప్‌గ్రేడేషన్, ట్రైనింగ్, కావాల్సిన ల్యాబ్స్ లేకుండా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను వారి హయాం లో సీబీఎసఈకి మార్చేశారు. విద్యార్థి జీవితంలో పదోతరగతి చాలా కీలకమైంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాక్ ఎగ్జామ్ పెడితే అత్యధిక విద్యార్థులు ఫెయిలయ్యారు. టోఫెల్‌పై రూ.58.84 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎగ్జామ్ కూడా నిర్వహించలేదు. ఐబీ పాఠశాలల రిపోర్టు కోసం రూ.5 కోట్లు ఖర్చుపెట్టారు. ఒక్క పాఠశాలను కూడా ఇందుకు సిద్ధం చేయ లేదు. కేవలం ప్రకటనలు చేసి తప్పించుకుని ఇప్పుడు ఆరోపణ లు చేస్తున్నారు. నిజంగా టీమ్ -11 ఈరోజు ఇక్కడ ఉంటే ఈ అంశాలపై వారిని సూటిగా ప్రశ్నించేవాడినని వ్యాఖ్యానించారు.
టీచర్లను మందుషాపుల వద్ద కాపలాపెట్టారు
గతంలో ఉపాధ్యాయులను వారు ఎలా అవమానించారో మనందరం చూశాం. టీచర్లను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు. గత ఐదేళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీచేయలేదు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మేం వచ్చాక ప్రభుత్వ స్కూళ్లకు స్టార్ రేటింగ్ తెచ్చాం. వన్ స్టార్‌లో 1725, 2 స్టార్‌లో 16,199 పాఠశాలలు ఉన్నాయి. వీటిని అప్‌గ్రేడ్ చేయడానికి సుమారు రూ.7,800 కోట్లు అవసరం. ఈ సంవత్సరంలో రూ.1,200 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింది. పిల్లలకు ఇచ్చే బెల్టు, బ్యాగుపై మాజీ ముఖ్యమంత్రి పేర్లు వేసుకున్నారు. టెక్స్ట్ బుక్‌లో ముఖ్యమంత్రి, మంత్రి, ఉన్నతాధికారుల మెసేజ్ లు ముద్రించారు. వాటి వల్లే సుమారు ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.10 కోట్ల నష్టం కలిగింది. వాటన్నింటినీ మేం వచ్చాక తొలగించడం జరిగింది. జీవో 117కి ప్రత్యామ్నాయం తీసుకొచ్చాం. గతంలో వన్ క్లాస్ వన్ టీచర్ పాఠశాలలు 3 శాతం ఉంటే, వాటిని ఇప్పుడు 33 శాతానికి తీసుకువచ్చాం. 9,600 ప్రాథమిక పాఠశాలలను వన్‌క్లాస్ వన్‌టీచర్ విధానం లోకి తెచ్చాం. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేయా లనే ఉద్దేశంతో టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తీసుకువచ్చాం. 200 కేసులు వేసినా మెగా డీఎస్సీని కేవలం 150 రోజుల్లో విజయ వంతంగా నిర్వహించి 16 వేల పోస్టులు భర్తీచేశాం. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. అందులో కూడా టీచర్ పోస్టు లు ఉంటాయి. గతంలో టీచర్లకు ప్రమోషన్ రావాలంటే ఇబ్బం ది ఉండేది. ఇప్పుడు సీనియారిటీ లిస్టు ఖరారు చేశాం. ఆటోమే టిక్‌గా టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం.
లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై ప్రత్యేక దృష్టి
అభ్యసన ఫలితాలపై (లెర్నింగ్ అవుట్ కమ్స్) ప్రధానంగా దృష్టిసారించాం. ఎఫఎలఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ)పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. నూరుశాతం అక్షరా స్యత సాధించేందుకు ఒక ప్రాజెక్టును తీసుకువచ్చాం. రాబోయే మూడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తాం. పాఠశాలల్లో పిల్లలంద రినీ ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్‌కు మార్చేందుకు క్లిక్కర్ టెక్నాలజీ తీసుకువస్తున్నాం. పాఠశాలల్లో ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన తర్వాత గేమిఫికేషన్ ద్వారా విద్యార్థుల నుంచి సమాధానం రాబట్టే టెక్నాలజీ ఇది. విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని, ప్రతిరోజూ సాయంత్రం వారి తల్లిదండ్రుల ఫోన్‌కి సమాచారం చేరవేస్తాం. రాష్ట్రంలోని 300 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించాం. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని 46 వేల పాఠశాలల్లో దీనిని అమలు చేస్తాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలను అనుసంధా నం చేస్తూ లీప్ యాప్ తీసుకువచ్చాం. పిల్లలు గైర్హాజరైతే గంట లో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లే విధంగా ఈ యాప్ తయారు చేశాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించాం. టాప్ పెర్ఫార్మెన్స్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జిల్లా యూనిట్ గా తీసుకొని షైనింగ్ స్టార్స్ పేరిట అవార్డులు ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ప్రోత్సహించడమే ఈ కార్యక్ర మం ముఖ్యోద్దేశం. ఆస్పైరింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతాం.
రూ.1,000 కోట్లు ఆదా చేస్తున్నాం
ఆటిజం పిల్లల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏపీకి కేంద్రం 125 భవిత సెంటర్లు కేటాయించింది. వీటి ఏర్పాటుపై ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నేతృత్వం లో ఒక కమిటీ వేశాం. వారే ఫీల్డ్‌కి వెళ్లి కంటెంట్ డిజైన్ చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం 5 ఏళ్లలో స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్ల సరఫరాలో సుమారు రూ.1,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా చేయబోతున్నాం. స్కూలు కిట్స్‌లో రూ.300 కోట్లు, చిక్కీలో రూ.240 కోట్లు, గుడ్ల సరఫరాలో రూ.144 కోట్లు ఆదా చేస్తు న్నాం. మధ్యాహ్న భోజనం, స్కూల్ కిట్లకు ఆదర్శనీయుల పేర్లు పెడుతున్నాం. స్కూలు కిట్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారితో పోరాడి స్టూడెంట్స్ మాక్ అసెం బ్లీ నిర్వహించడం జరిగింది. దీనిని ప్రతిసంవత్సరం నిర్వహించా లని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం హక్కులే కాదు, బాధ్యతలు కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో విద్యార్థులకు బాల భారత రాజ్యాంగం పుస్తకాలను అందించాం. రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువ ల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుని సభాముఖంగా అభినం దిస్తున్నాం. చాగంటి కనీసం ఫోన్ కూడా తీసుకోకుండా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడం బాధ్యతగా ఆ పదవిని స్వీకరిం చారు. ఆయన రూపొందించిన పుస్తకాలను ప్రింట్ చేసి పిల్లలకు అందించాం. తల్లికి చెప్పలేని ఏ నిర్ణయం తీసుకోకూడదని చాగం టి చెప్పిన మాట నా మనసును హత్తుకుంది.
సభ్యులందరిపైనా సమాజంలో మార్పు బాధ్యత
సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో, సెల్ఫ్ డిఫెన్స్, యోగా క్లాసులు, ఎక్స్ పోజర్ విజిట్స్, సైన్స్ ఫెయిర్‌లు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాం. మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్స్ నిర్వహించి తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం. ఉపాధ్యా యుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు వారానికోసారి ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం నిర్వహించేలా చర్యలు చేపట్టాం. బాగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఈ ఏప్రిల్ లో సింగపూర్, ఫిన్‌ల్యాండ్‌కు పంపిస్తున్నాం. అక్కడ ఉత్తమ విధా నాలను తెలుసుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఏప్రిల్ నుంచి వేగంగా పనులు నిర్వహిస్తాం. మంగళగిరి నియోజకవర్గం నిడ మర్రు జెడ్పీ హైస్కూలును ఇంటర్నేషనల్ స్కూలుగా తీర్చిదిద్దు తున్నాం. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి కరిక్యులమ్ కూడా మెరు గుపరుస్తున్నాం. గౌరవసభ్యులంతా ఆ స్కూలుని సందర్శించాలి. చినకాకానిలో తొలి ఆటిజం సెంటర్‌ను ప్రారంభించాం. మంగళగి రిలో లోకల్ ఫండ్ మొబిలైజేషన్ ద్వారా మోడల్ పబ్లిక్ లైబ్రరీగా తీర్చిదిద్దాం.
ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తెచ్చాం
రాష్ట్రంలో 2019-24 నడుమ ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో 9 శాతం విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కూడా సరిచేశాం. పాస్ పర్సంటేజి 2019లో 42 శాతం ఉండగా 30 శాతానికి పడిపోయింది. సెకండియర్ పాస్ పర్సంటేజి 58 నుంచి 39 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు గతంలో టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు. మధ్యాహ్నం భోజనం ఆపేశారు. స్కాలర్ షిప్ ప్రోగ్రామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఇచ్చే కార్యక్రమాలను రద్దుచేశారు. హైస్కూల్ ప్లస్ పేరుతో 504 స్కూళ్లు అప్ గ్రేడ్ చేశారు కానీ, అక్కడ అవసరమైన మెటీరియల్, ల్యాబ్స్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను నియమించలేదు. దీనివల్ల ఇంటర్మీడియట్‌లో ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజాప్రభుత్వం వచ్చాక మధ్యాహ్న భోజన పథకానికి రూ.115 కోట్లు, స్కూల్ కిట్స్‌కు రూ.32 కోట్లు కేటాయించాం.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల వర్కింగ్ అవర్స్ 9 నుంచి 5గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. అందరితో మాట్లాడి దశాబ్దం తర్వాత కరిక్యులమ్ కూడా రివైజ్ చేశాం. రెగ్యులర్‌గా ఇంటర్నల్ ఎగ్జామ్స్, మోడల్ క్వచ్చన్ పేపర్స్‌పై ప్రాక్టీస్ చేయిస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ స్టడీ మెటీరియల్ కూడా పిల్లలకు అందజేస్తున్నాం. దివ్యాంగ విద్యార్థులు 5 సబ్జెక్టుల పరీక్షలు రాస్తే, 6వ సబ్జెక్టుకు యావరేజి మార్కులు అందించేలా చర్యలు తీసుకున్నాం. గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడం వల్ల జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో పోటీపడే పరిస్థితి లేకపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6వ సబ్జెక్టుపై ప్రత్యేక జీవో తెచ్చి, చట్ట బద్ధత కల్పించాం. దీనివల్ల 91 మంది దివ్యాంగ పిల్లలు ఐఐటీ, ఎన్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు. ఈ విష యంలో ఒక్క ఫోన్ మెసేజ్‌తో స్పందించి జఠిల సమస్యకు పరి ష్కారం చూపడం మా చిత్తశుద్ధికి నిదర్శనం.
బంధుగణంతో వర్సిటీలను భ్రష్టుపట్టించారు
ఉన్నత విద్యకు వచ్చేసరికి గతంలో వైస్ ఛాన్సలర్లను రాజకీయ కోణంతో నియమించారు. ఏయూ వీసీగా నియమించిన ప్రసాదరె డ్డి మాజీ ముఖ్యమంత్రి విశాఖ వచ్చినపుడల్లా విద్యార్థులను రోడ్లపై నిలబెట్టి చప్పట్లు కొట్టించారు. యూనివర్సిటీలో ఏకంగా వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశారు. అధ్యాపక పోస్టుల భర్తీ, మౌలిక సదు పాయాలు, ల్యాబ్‌ల ఏర్పాటును గాలికొదిలేశారు. అస్మదీయులకు అక్రమంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఎలాంటి అర్హత లేకపోయినా గత సీఎం బంధువు సుందరవల్లిని ఎస్వీయూ రెక్టార్‌గా నియమిం చారు. ఆమెనే మళ్లీ విక్రమ సింహపురి యూనివర్సిటీకి వీసీగా నియమించారు. కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా ఉండాలన్న నిబంధ నను పట్టించుకోకుండా శ్రీకాంత్‌రెడ్డిని ఎస్వీయూ వీసీగా నియ మించారు. మరో బంధువు రామకృష్ణారెడ్డిని ఎస్‌కేడీ యూనివర్సిటీ వీసీగా నియమించారు. మాజీ ముఖ్యమంత్రి బామ్మర్ది సురేంద్రనా థ్‌రెడ్డిని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఏఎన్‌యూ వీసీ రాజశేఖర్ యూనివర్సిటీలో రాజశేఖర్‌రెడ్డి విగ్ర హం పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి పుట్టిన రోజుకు వర్సిటీలో ఫ్లెక్సీలు పెట్టారు. రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇవి వైస్ ఛాన్సలర్లు చేయాల్సిన పనులేనా? కుటుంబసభ్యులు, బంధు గణాన్ని వీసీలుగా నియమిస్తే ఫలితాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు.
రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయారు
గత ఐదేళ్లలో ఎక్కడా ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ జరగలేదు. రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం. 90 రోజుల్లో న్యాయపరమైన చిక్కులు తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిభ ఆధారంగా వైస్ ఛాన్సలర్లను నియమించాం. హయ్యర్ ఎడ్యుకేష న్, స్కిల్ డెవలప్‌మెంట్ కమిషనరేట్లను రీ స్ట్రక్చర్ చేసి బాధ్యతలు అప్పగించాం. ఐఎస్‌బీ, న్యాయవిద్య వంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకువచ్చేందుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల యాక్ట్‌లో సవరణలు తెచ్చాం. గవర్నర్ నేతృత్వంలో వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వ హించి ప్రతి యూనివర్సిటీకి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇచ్చాం. వారికి ఇచ్చిన లక్ష్యాలను అధిగమించేలా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పాలిటెక్నిక్‌లను బలోపేతం చేస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీలను జోడించి కొత్త కరిక్యులమ్ రూపొందించాం.
స్కిల్ సిబ్బందితో సొంత పనులు చేయించుకున్నారు
స్కిల్ డెవలప్‌మెంట్ ఉద్యోగులను పార్టీ సోషల్ మీడియా కోసం, గత ప్రభుత్వ పెద్దల ఇళ్లలో పనిచేసేందుకు వాడుకున్నారని మా వద్ద సమాచారం ఉంది. ఇందుకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజాప్రభుత్వం వచ్చాక స్కిల్ డెవలప్‌మెంట్ విభాగాన్ని ప్రక్షాళన చేశాం. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపున ప్రైవేటు పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. ఈ నెలాఖరుకు నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నాం. ఇందులో ఏఐ టూల్ ద్వారా యువత స్కిల్ ఎసెస్ మెంట్ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో మూడునెలలకోసారి జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 1,587 జాబ్ మేళాలను నిర్వహించి లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించాం. జాబ్‌మేళాలను మరింత బలోపేతం చేస్తాం. మరోవైపు ఫారిన్ ప్లేస్‌మెంట్స్‌పై దృష్టిసారించాం. హెల్త్ కేర్ వర్కర్స్, టీచర్లకు విదేశాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓంక్యాప్ ద్వారా జర్మనీ, జపనీస్ లాంగ్వేజ్‌లో శిక్షణ ఇస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో 50 వేల మంది విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. విద్యారంగంలో గతంలో జరిగిన విధ్వంసం – ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 20 నెలల్లో చేపట్టిన సంస్కరణలు- భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించి శాసనసభ్యులదరికీ అందిస్తున్నాం. ఇందులో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, ఐటీఐ, పాలిటెక్నిక్, పబ్లిక్ లైబ్రరీస్, స్కిల్ డెవలప్‌మెంట్, తెలుగు అకాడమీలలో ఏం చేయబోతున్నామో స్పష్టంగా పొందుపర్చాం.
లైబ్రరీల బలోపేతానికి ప్రత్యేక చర్యలు
పుస్తక పఠనం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రభుత్వ లైబ్రరీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. మంగళ గిరిలో మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గం, మండల స్థాయిలో లైబ్రరీలను అభివృద్ధి చేద్దాం. లైబ్రరీల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు అవసరమైన పుస్తకాలను ప్రభుత్వమే సమకూరుస్తుంది. అమరావతిలో ప్రపంచస్థాయి సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఒక కాంపిటిషన్ నిర్వహించి డిజైన్ ఫైనలైజ్ చేశాం. ఇందుకోసం శోభా రియాలిటీ అనే సంస్థ రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించారు. వారికి ఏపీలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. కేవలం ముఖ్యమంత్రిపై ఉన్న గౌరవంతో వారు ఇందుకోసం ముందుకొచ్చారు. సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. పరిశ్రమల మంత్రి భరత్ ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధచూపారు. లైబ్రరీలకు గతంలో మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టి బలోపేతానికి చర్యలు చేపడుతున్నాం. లైబ్రరీ సెస్సును గ్రంథాలయాల అభివృద్ధికే ఖర్చుచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఏ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే విధానం తెస్తామని చెప్పారు.















