- ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..రైతులకు పరామర్శ
- కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఏరియల్ సర్వే
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అర్నబ్ తుఫాన్ ప్రభా విత ప్రాంతాల్లో పర్యటించారు. మొదట ఏరియల్ వ్యూ ద్వారా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను పరిశీలిం చారు. ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావాన్ని చూశారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలు, కూలిన కొబ్బరి చెట్లను పరి శీలించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందనే అం శాలను సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న వివరించారు. ఏరియల్ వ్యూ తరువాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు, వేట్లపాలెం, గచ్చకాయల పొర గ్రామాల ను సీఎం సందర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతన్నలకు ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితుల వద్దకు వెళ్లి భరోసా ఇచ్చారు. అంతకుముందు కాట్రేనికోన మండలంలో అర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సీఎం పరిశీలించారు. చెయ్యేరు వద్ద కాన్వాయ్ దిగి విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించా రు. ఈ సందర్భంగా కార్మికులు, విద్యుత్ శాఖ సిబ్బందిని సీఎం అభినందించారు.


