చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

టార్గెట్‌.. ఏపీ బ్రాండ్‌!

జిల్లా కలెక్టర్ల సదస్సుల్లో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Aug 6, 2024 at 6:57am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
టార్గెట్‌.. ఏపీ బ్రాండ్‌!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నేటి సదస్సు రాష్ట్రాభివృద్ధికి నాంది
  • త్వరలో ‘పేదల సేవలో‘ మమేకం..
  • అక్టోబర్‌ 2న విజన్‌ డ్యాక్యుమెంట్‌ విడుదల
  • జిల్లాస్థాయిలో ‘విజన్‌’ సిద్ధం చేయండి
  • క్షేత్రస్థాయికి వెళ్తేనే మార్పు సాధ్యం
  • మంత్రులు, ఎమ్మెల్యేల ఆలోచనల అమలు
  • 100 రోజుల్లో మార్పు చూపడమే లక్ష్యం
  • జిల్లా కలెక్టర్ల సదస్సుల్లో సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047నాటికి ప్రపంచంలోనే మనం నంబర్‌ వన్‌గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతోపాటు పనిచేసే అధికారులను పక్కనబెట్టారు.. బ్లాక్‌ మెయిల్‌ చేశారు. బ్రాండ్‌ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే ఢల్లీిలో గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రతి నెలా ఒకటో తేదీన ‘పేదల సేవలో’..
పేదరిక నిర్మూలనకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజలతో మమేం కావాలని దిశానిర్దేశం చేశారు. పేదరిక నిర్మూలనకు వినూత్న ఆలోచనలతో కలెక్టర్లు ముందుకు రావాలన్నారు. పార్టీ ఆఫీస్‌కి వెళ్లేటపుడు పెద్దఎత్తున ప్రజలనుంచి ఫిర్యాదులు అందుతున్నాయని.. 5వేల ఫిర్యాదుల్లో సగం భూసమస్యలే ఉన్నాయన్నారు. జగన్‌ పాలనలో పెద్దఎత్తున భూకబ్జాలు, అవకతవకలు జరిగాయన్నారు. సర్వే రాళ్లు, పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో వేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన గతంలో చూశామని వివరించారు. వ్యవస్థలో ఏదైనా చిన్న తప్పు జరిగితే సరిచేయవచ్చు. మొత్తంగా విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే భారీ కసరత్తు తప్పదు, అహర్నిశలు కష్టపడాలన్నారు. మనం తీసుకునే నిర్ణయాలు భావితరాలకు ఉపయోగపడాలని అంటూ.. 2047కి ప్రపంచంలో భారత నెంబర్‌ 1 ఎకానమీగా ఉంటుందని, 2029లో 3వ లార్జెస్ట్‌ ఎకానమీకి రాష్ట్రం చేరుకోవాలన్నారు. రాష్ట్రానికి హిస్టారికల్‌ అడ్వాంటేజెస్‌ ఉన్నాయని వివరిస్తూ.. గతంలో తొమ్మిదేళ్లలో బెస్ట్‌ ఎకో సిస్టం తెచ్చామన్నారు. అనంతరం వచ్చిన పాలకులు దాన్ని విధ్వంసం చేయలేదు కాబట్టే అభివృద్ధి కొనసాగింది. కానీ ఏపీలో అలా చేయకపోవడం వల్ల రాష్ట్రం వెనక్కి పోయిందన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026

జవాబుదారీగా పనిచేయాలి..
ప్రజలకిచ్చిన మాటమేరకు రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే ఆర్థిక ఇబ్బందులున్నాయి. కాని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ దిశానిర్దేశం చేసేది కాబోతోంది. గత పాలకులు ఐదేళ్లలో ఒక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ పెట్టలేదంటే పరిపాలన తీరును అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ పెట్టుకుందామని సీఎం చంద్రబాబు వివరించారు. అధికారులు జవాబువాదారీతనంతో పనిచేయాలని, కొన్ని కీలక శాఖలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. అభివృద్ధితోనే ఆదాయం, ఆదాయం వస్తేనే ప్రజలకు ఖర్చు చేయగలుగుతాం. అభివృద్ధితోనే ప్రజలకు సంతృప్తి ఉంటుంది. మెరుగైన పాలన అందించడం మా బాధ్యత.. దానికి మేం కట్టుబడి ఉంటామని అన్నారు.

పనిచేస్తే ప్రోత్సహిస్తాం
కలెక్టర్‌గా పనిచేయడం పెద్ద డ్రీమ్‌ అంటూనే.. పనిచేస్తే అధికారులను ప్రోత్సహిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారులు మానవతాదృక్పథంతో పనిచేయాలన్నారు. మంచి పరిపాలనతో ప్రజలకు మెరుగైన పాలన, జీవన ప్రమాణాలు అందించాలన్నారు. గతంలో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌ (పీ3)తో భిన్నంగా ముందుకువెళ్లామని, ఇప్పుడు పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీ4) మోడల్‌తో మరింత వినూత్నంగా ముందుకెళ్దామన్నారు. జీరో పావర్టీ అనేది ప్రభుత్వ లక్ష్యంగా వివరిస్తూ.. ఈజ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ రావాలని సూచించారు. ప్రజల జీవనప్రమాణాలు మెరుగయ్యేలా పని చేయాలని కలెక్టర్లకు సూచిస్తూనే.. మానవతా ధృక్ఫథంతో ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అలాంటి ఆలోచనకు అధికారులు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రభుత్వంలో ఎవరూ పెత్తందారి వ్యవస్థలా ప్రవర్తించకూడదని, అసహ్యంగా మాట్లాడటం, అనవసరంగా దూషించడంలాటి విధానాలు వద్దని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు వాస్తవాన్ని మీ దృష్టికి తెచ్చినపుడు సంబంధిత సమస్యలు పరిష్కరించాలన్నారు. సింపుల్‌ గవర్నెన్స్‌, ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో గవర్నమెంట్‌కు ఒక యాప్‌ తెస్తామని, అప్పుడే రియల్‌ టైమ్‌లో గవర్నెన్స్‌ ఇచ్చే అవకాశం వస్తుందన్నారు. ఇన్ఫర్మేషన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ సిద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.

వికసిత ఆంధ్ర మన లక్ష్యం
వికసిత ఆంధ్రప్రదేశ్‌ మన లక్ష్యం కావాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. అక్టోబర్‌ 2న విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేస్తామన్నారు. కలెక్టర్లు డిస్ట్రిక్‌ విజన్‌ డాక్యుమెంట్‌ తయారుచేయాలని, సెప్టెంబర్‌ 20కి 100 రోజులు అవుతుందన్నారు. విజన్‌ 2020ని అప్పట్లో ఎగతాళి చేసినా, చేసి చూపించామన్నారు. అలాగే కొత్త విజన్‌ను ఆలోచించాలని కలెక్టర్లకు సూచించారు. సూపర్‌ సిక్స్‌ హామీలకు కట్టుబడి ఉన్నామని, ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు పెట్టబోతున్నామని అంటూ.. నాన్‌ ఫైనాన్షియల్‌ ఇష్యూస్‌ను ముందుగా పరిష్కరించాలన్నారు.

1995నాటి చంద్రబాబును చూస్తారు
త్వరలోనే మళ్లీ 1995నాటి చంద్రబాబును చూస్తారని సీఎం హృద్యంగా ప్రకటించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, తద్వారానే మంచి మార్పు సాధ్యమన్నారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీ ద్వారా పనులు చేయించాలి. అంగన్‌ వాడీకి వెళ్తా, డ్రైయిన్‌కు వెళ్తా.. అధికారులు ప్రజల కనీస అవసరాలను గుర్తించాలి. గ్యాస్‌, స్ట్రీట్‌ లైట్లు, రోడ్లు, సిమెంట్‌ రోడ్లు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర సమస్యలు గుర్తించి పరిష్కరించాలని సూచించారు. టూరిజానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూనే.. ఎంత పెట్టుబడులు పెట్టారన్నది కాదు, ఎంతమందికి ఉపాధి కల్పించామన్నది ముఖ్యమన్నారు. మంచిగా ఆలోచిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, రాష్ట్రంలో నదుల అనుసంధానం జరిగి ప్రతి ఎకరాకూ నీళ్లు అందించాలన్నారు. తద్వారా ఆర్థిక పరిపుష్టి జరుగుతుందని వివరించారు. ఇన్నోవేటివ్‌గా పనిచేయగలగాలి. ‘వర్క్‌ హార్డ్‌, వర్క్‌ స్మార్ట్‌, థింక్‌ గ్లోబల్లీ’ ఇది మన నినాదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.

Previous Post

యస్‌.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌!

Next Post

వాలంటీర్లూ.. అపోహలొద్దు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026

కార్యకర్త
@ March 27, 2026
ఏలూరు జిల్లా పురోగతిపై
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026

కార్యకర్త
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్

శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ March 26, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏలూరు జిల్లా పురోగతిపై

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ March 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist