చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం

రాజకీయాలను జగన్‌ అపవిత్రం చేశాడు: చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
January 4, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ రాజధాని మార్చలేడు.. విశాఖ పోలేడని వ్యాఖ్య
  • టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్‌ నేతలు సీ రామచంద్రయ్య, ద్వారకానాథ్‌రెడ్డి, దాడి వీరభద్రరావు

అమరావతి: రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టమని, వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకు న్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజ మెత్తారు. జగన్‌ రాజకీయాల్లో లేకుండా ఉంటే రాష్ట్రం లో ఇంతటి విధ్వంసం జరిగేది కాదన్నారు. పోలవరం ప్రాజెక్టును, రాజధాని అమరావతిని నాశనం చేశాడని దయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అన్నమాటే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను జగన్‌ అపవిత్రం చేశాడన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం 5ఏళ్లు కష్టపడతారు..కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సొంతప్రయోజనాలు చూసు కుని, రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య,రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు దాడి వీరభద్రరావు, ఆయన తనయులు దాడి రత్నాకర్‌, దాడి జైవీర్‌, బాపట్ల జిల్లా, కర్లపాలెం జడ్పీటీసీ పిట్ల వేణు గోపాల్‌రెడ్డి, అనంతపురంనకు చెందిన డాక్టర్‌ కే రాజీ వ్‌రెడ్డితో పాటు పలువురు ముస్లిం నేతలు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చంద్ర బాబునాయుడు మాట్లాడుతూ… మరో వంద రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు అయిపోతాయి.. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా.. 1978లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యాను. ఎంతోమంది సీఎంలను చూశానుగానీ జగన్‌ లాంటి దారుణమైన ముఖ్యమంత్రి ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా దందాలు, దోపిడీలే
జగన్‌ సీఎం అయ్యాక రూ.12లక్షల కోట్లు అప్పులు చేశారు.. 75ఏళ్లుగా అభివృద్ధి చేసిన వ్యవస్థలను జగన్‌ విధ్వంసం చేశాడు.రాష్ట్రంలో రోడ్లు,వ్యవసాయం,విద్య, వైద్యం అన్నీ దెబ్బతిన్నాయి. వైసీపీ నేతల అవినీతి, అక్ర మాలపై ఎవరు మాట్లాడినా దాడులుచేసి కేసులు పెట్టా రు. ఎక్కడ చూసినా దందాలు, దోపిడీలే. ప్రజలు అస హ్యించుకుంటుంటే జగన్‌ కొత్తగా ఆలోచించి ఎమ్మెల్యే లను మార్చుతున్నాడు. ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేసి,ప్రజల మద్ధతుకోల్పోతే నీ ఇంటెలిజెన్స్‌ ఏమి చేసిం ది? తప్పు చేసిన ఎమ్మెల్యేలను ఎప్పుడైనా పిలిచి మాట్లా డారా? ఇది తప్పు అని చెప్పారా? వాళ్లకు దొరికింది వాళ్లు దోచుకున్నారు. నువ్వుచేసిన సర్వేలో నువ్వేవద్దు.. లాభం లేదని ప్రజలు అనుకుంటున్నారు జగన్‌. పరిశ్ర మలు తరిమేశారు. రోడ్లన్నీ పాడైపోయాయి. ఏ ప్రాజె క్టూ పూర్తి చేయలేదు.. విపరీతంగా అప్పులు చేశాడు. ఇష్టారీతిన అవినీతి చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. జగన్‌ రాజకీయాలను అపవిత్రం చేశాడు. మంచి, చెడుకు తేడా తెలియని వ్యక్తి జగన్‌. రాష్ట్రాన్ని జగన్‌ గందరగోళంలోకి నెట్టారు.వ్యవస్థలు సక్రమంగా ఉండి.. నడిపించే వ్యక్తులు సమర్థులుగా ఉంటే దాని ఫలితాలు సామాన్యులకు దక్కుతాయని చంద్రబాబు అన్నారు.

టీడీపీ ప్రవేశపెట్టిన వంద సంక్షేమ పథకాలు రద్దు
స్కూలు బిల్డింగులకు రంగులు వేయడం అభివృద్ధి కాదు… చదువుకున్న విద్యార్థి మేథావి అయి, మంచి ఉద్యోగం సాధిస్తే అది నిజమైన అభివృద్ది. పైపైన రం గులు రుద్ది అదే అభివృద్ధి అని చెప్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ కూడా ఇచ్చింది.. మేం ప్రవేశ పెట్టిన 100 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్కాలర్‌ షిప్‌లు టీడీపీ హయాంలో 16 లక్షల మందికి ఇస్తే.. దానికి విద్యాదీవెన అని పేరు పెట్టి 10 లక్షలకు కుదించి బటన్‌ నొక్కుతూ సొంత పత్రికకు జగన్‌ ప్రకటనలిచ్చుకుంటున్నాడు. చదువు కోవాలను కునే ప్రతి విద్యార్థికీ విదేశాల్లోనూ చదువుకునే అవకా శం కల్పిస్తేనే నిజమైన విద్యాభి వృద్ధి.. అదే టీడీపీ చేసి చూపింది. విదేశీ విద్య కింద ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షలు ఆర్థిక సాయం అందించాం. ఓటమి భయంతో జగన్‌ తనపార్టీ ఎమ్మెల్యేలను భయంకరంగా మార్చుతు న్నారు. నా జీవితంలో ఇంతలా మార్పులు వినలేదు.. చూడలేదు. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి.. జవాబు దారీతనం తీసు కు రావడానికి.ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజల్ని లీడ్‌ చేయాలి. పుచ్చలపల్లి సుందరయ్యను ప్రజలు ఇప్పుడూ గుర్తంచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

రాజకీయాలకు నూతన నిర్వచనం నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్‌
తెలుగుజాతి బతికున్నంతకాలం గుర్తుండే వ్యక్తి ఎన్టీ ఆర్‌. 60 ఏళ్ల వయసు తర్వాత ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన జీవితం ఒక ఆదర్శం. పదవి, డబ్బు లు కోసం ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదు. తనను ఆద రించిన ప్రజలకు సేవ చేయాలని, నీతివంతమైన రాజ కీయం చేయాలని వచ్చి రాజకీయాలకే నూతన నిర్వచ నం నేర్పించారు ఎన్టీఆర్‌. అభివృద్ధి-సంక్షేమాన్ని పద్ధతి ప్రకారం నడిపించారు. ఇప్పుడు జగన్‌ తానే సీఎంగా శాశ్వతంగా ఉంటాడనుకున్నాడు. రిషికొండ లాంటి చారిత్రక కొండను తవ్వేసి,ప్యాలెస్‌ కట్టేశాడు. రూ.500 కోట్లు పెట్టి ప్యాలెస్‌ కట్టుకోవటాన్ని ఏ విధంగా సమ ర్థించుకుంటావు? మా ఇంటికి వంద గజాల చిన్న రోడ్డు వేస్తే ప్రతి రోజూ విమర్శించిన వ్యక్తి…తన ఇంటి కి 4 లైన్ల రోడ్డు వేసుకున్నాడు. రాజధాని విశాఖ తీసు కెళ్తానంటే కోర్టులు కూడా ముట్టికాయలు వేశాయి. అమరావతి అంశాన్ని ఏప్రిల్‌లో వింటామని సుప్రీం కోర్టు చెప్పింది.. అప్పటికి జగన్‌ ఉండరు.. మళ్లీ టీడీపీ నే వస్తుంది. నువ్వు రాజధాని మార్చలేవు.. విశాఖ పోలేవు. కానీ రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేశావు. సాధ్యం కాదని తెలిసి కూడా వందల కోట్లు లాయర్లకు విచ్చిలవిడిగా డబ్బులిచ్చి దుర్వినియోగం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు.

నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ… వారినే మార్చేస్తున్నాడు
ఎమ్మెల్లేల్లో మొన్న 11 మందిని, నిన్న 27 మందిని మార్చాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు..కానీ వారినే మార్చాడు. నేను పుల్లను నిలబెట్టినా గెలుస్తారు అన్నావ్‌ కదా…మరి ఇప్పుడున్నవాళ్లను పెట్టి ఎందుకు గెలిపించలేవు? సీఎం పదవి కోసం నేను ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ-జనసేన అధికారం కోసం ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి ఎవరన్నా రావాలన్నా భయపడిపోతున్నారు. ఆస్తులను రాసిస్తావా లేదా అని మెడపై కత్తిపెట్టి రాయించుకుంటున్నారు. విశాఖలో యువతిపై 11మంది గ్యాంగ్‌ రేప్‌నకు పాల్ప డ్డారు.. అసలురాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా.? శాంతి భద్రతల గురించి సీఎం పట్టించుకుంటున్నా డా.? నేను సీఎంగా ఉన్నప్పుడు పిడుగురాళ్లలో అత్యా చారం జరిగితే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేసి నిందితుడు భూమ్మీద ఎక్కడున్నా పట్టుకురమ్మంటే.. విషయం తెలు సుకున్న నిందితుడు ఉరేసుకుని చనిపోయాడు. పాల కులు సమర్థులుగా ఉంటే మిగిలిన వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తారు. డ్రగ్స్‌ గురించి మాట్లాడితే విమర్శలు చేస్తారా అని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని చంద్రబాబు విమర్శించారు.

చూస్తూ కూర్చుంటే రాష్ట్రంలో ఏమీ మిగలదు
రాష్ట్రంలో పండిన గంజాయి పక్క రాష్ట్రాలకు వెళ్ల డంతో వాళ్లూ ఏపీని తిడుతున్నారు. బాధ్యత కలిగిన నాయకులందరూ ఆలోచించాలి. మనం చూస్తూ కూ ర్చుంటే రాష్ట్రంలో ఏమీ మిగలదు. రాష్ట్రాన్ని కాపాడు కోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ నెల 5వ తేదీ నుండి రా.. కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రజలకు ఏమి చేస్తానో చెప్పేందుకు 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తా.రాష్ట్రా న్ని అతలాకుతలం చేసిన వ్యక్తి పట్లజాగ్రత్తగా ఉండాలి. అంగన్వాడీ, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు, గురు కులాల సిబ్బంది రోడ్లపైకి వస్తే వాళ్లని బెదిరిస్తున్నారు. న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేస్తే సమ ర్థిస్తాం.. వాటిని పరిష్కరించేందుకు ముందు కొస్తాం అని చంద్రబాబు నాయుడు అన్నారు. అంతకముందు చీరాలకు చెందిన మాజీ క్రీడా అధికారి నక్కల అర్జున రావు, హైకోర్టు న్యాయవాది సింగయ్య గౌడ్‌, పార్వతీ పురం నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లతో మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందిరినీ చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌,ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే లు, పీలా గోవింద్‌, ప్రభాకర్‌చౌదరి, లింగారెడ్డి, యర పతినేని శ్రీనివాస్‌, కాల్వ శ్రీనివాసులు, పుట్టా సుధాకర్‌ యాదవ్‌, చీరాల ఇంఛార్జ్‌ మాలకొండయ్య యాదవ్‌, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, శ్రీరామ్‌ చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags: ఎస్టీలుఎస్సీజగన్‌ రాజధానిదందాలుదాడి వీరభద్రరావుదోపిడీలుద్వారకానాథ్‌రెడ్డివిశాఖసంక్షేమ పథకాలు రద్దుసీ రామచంద్రయ్య
Previous Post

పంచాయతీల సర్వహక్కులు పునరుద్ధరిస్తాం

Next Post

బాధిత కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

Next Post
బాధిత కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

బాధిత కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.