చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకం, రాష్ట్రానికి అవసరం

యువగళం నవశకం సభలో నారా చంద్రబాబు నాయుడు

చైతన్యరధం by చైతన్యరధం
December 21, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకం, రాష్ట్రానికి అవసరం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ సినిమా అయిపోయింది  వైసిపి ఓటమి ఖాయం
  • వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపమే
  • రాజకీయాలకు పనికిరాని వ్యక్తి జగన్‌
  • యువగళం ప్రజా గర్జన అయ్యింది
  • యువగళం నవశకం సభలో నారా చంద్రబాబు నాయుడు

నెల్లిమర్ల, చైతన్యరథం: టీడీపీ`జనసేన పొత్తు చారిత్రాత్మకమని, ఇది రాష్ట్రానికి అవసరమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ`జనసేన పొత్తు సూపర్‌ హిట్‌ అని, జగన్‌ సినిమా అయిపోయిందని, వైసీపీ పడవ మునిగిపోవడం ఖామయని చెప్పారు. టీడీపీ, జనసేన అధిష్టానాలు ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు వాటిని పాటించాలని కోరారు. మరో వందరోజులు పార్టీ నేతలు, కార్యకర్తలంతా కష్టపడాలని, కష్టపడ్డ వారందరికీ గుర్తింపునిచ్చే బాధ్యత తమదేనని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నిర్వహించిన యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ యువగళం నవశకం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘టీడీపీ`జనసేన పొత్తు ప్రకటనతోనే వైసీపీ పని అయిపోయింది, వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు.

జగన్‌ పని అయిపోయింది, రేపు జరిగే కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ ఓటమి ఖాయం. ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ పర్‌ చేస్తున్నారు, ఇక్కడ అవినీతి చేశాడని మరో నియోజకవర్గానికి పంపిస్తారా? పనికిరానివాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు కాదు, రాజకీయాలకు పనికి రాని వ్యక్తి జగన్‌. జగన్‌ క్యారెక్టర్‌ ఇప్పటికీ అర్దం కావటం లేదు, ఎంతో మంది రాజకీయ నాయకులను చూశా, కానీ ఇంత విచిత్రమైన వ్యక్తిని చూడలేదు. మన ఆస్తులకు, ప్రాణాలకు, ఆడబిడ్డలకు రక్షణ కావాలంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కావాలి. ఒక్క ఓటు వైసీపీకి వేసినా రాష్ట్రానికి శాపంగా మారుతుంది, ఇప్పటికే 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు, టీడీపీ జనసేన ఓట్లు తొలగిస్తున్నారు, మన ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ప్రతి ఒక్కరూ మీ ఓట్‌ చెక్‌ చేసుకోండి, మీ ఓటు ద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడండి. ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా….మీరు ఒక అడుగేస్తే మేం వంద అడుగులు ముందుకేస్తాం. మీరు ముందుకు రాకుంటే భావితరాల భవిష్యత్‌ ప్రశ్నార్దకంగా మారుతుంది. కష్టపడి మీరు చదివించిన మీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా మీలాగే కూలీ పనులు చేయాలా? నిత్యసవర ధరలు పెరిగిపోయాయి,  5 ఏళ్లలో మీ జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగాయా? ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయో ఆలోచించండి. యువతకు బంగారు భవిష్యత్‌ కావాలంటే మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి. 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల తర్వాత మీ భవిష్యత్‌ ని ఉజ్వలంగా మార్చే భాద్యత టీడీపీ జనసేన తీసుకుంటుంది. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి, మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, వాళ్లు సరెండర్‌ అయ్యారు. అంగన్‌ వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవటం లేదు. ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇచ్చాం,  మళ్లీ ఉద్యోగస్తులకు న్యాయం చేస్తాం

త్వరలో ఉమ్మడి మ్యానిఫెస్టో

త్వరలో ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటిస్తాం, త్వరలో జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో రెండు మీటింగ్‌ లు నిర్వహిస్తాం.తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి విధ్యార్దికి ఏడాదికి  రూ. 15 వేలిస్తాం. దీపం పధకం కింద ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తాం. వైసీపీ పాలనలో రైతన్నలు చితికిపోయారు, రైతుల అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్రం నెం 1 స్ధానంలో ఉంది. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులను అన్ని విధాల ఆదుంకుంటాం. బీసీలకు రక్షణ చట్టం తెస్తాం,  బీసీలను అన్ని విధాల ఆదుకుంటాం, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందిస్తాం. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉండే పేదలను ఆర్దికంగా ఆదుకుంటాం.

యువగళం ప్రజాగర్జనగా మారింది

భారతదేశంలో పాదయాత్రలు కొత్త కాదు, నేను పాదయాత్ర చేశాను… ఎన్టీఆర్‌ చేశారు. ఎన్టీఆర్‌ చైతన్య యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు

జగన్‌ రెడ్డి  పోలీసులను అడ్డుపెట్టుకొని యువగళం ఆపటానికి ప్రయత్నం చేశాడు. యువగళం వాలంటీర్లపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపించారు. వీటన్నింటికీ వడ్డీతో సహా తిరిగిస్తాం. యువగళం జన గళంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది. రోజు రోజుకి ప్రజా ఉద్యమంగా ముందుకు వెళ్ళింది. దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలకు నా అభినందనలు. జగన్‌ రెడ్డి జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానని 5 సంవత్సరాలు గడిచినా ప్రకటించలేదు. బంగారు భవిష్యత్తు ఉండాల్సిన యువతకు ఉద్యోగాలు లేకుండా చేశాడు. వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలు పారిపోయాయి. అగ్రస్థానంలో ఉండాల్సిన  తెలుగు యువత ఆంధ్రప్రదేశ్‌ లో అధపాతాళంలో ఉంది. టీడీపీ-జనసేన కలిసి యువతకు ఉపాధి కల్పిస్తాము, మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము.

వైసీపీ కబ్జాలో ఉత్తరాంధ్ర

5 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర వైసీపీ కబ్జాలో మునిగిపోయింది. ఈసారి మాకోసం కాదు 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేయండి. మెట్రో పోయింది, వైజాగ్‌ లో వచ్చిన పరిశ్రమలు అన్నీ పోయాయి, హెచ్‌ఎస్‌బీసీ వంటి  ఐటీ కంపెనీలు మేం తీసుకువస్తే నేడు అవి కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. భోగాపురం విమానాశ్రయానికి నాంది పలికాను. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే 2020కే విమానాశ్రయం ప్రారంభమయ్యేది. కానీ ఇప్పటికీ దానిని పూర్తి చేయలేదు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయు, వైసీపీ పాలన వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆగిపోయింది. కబ్జాలు, సెటిల్మెంట్‌ లు పెరిగాయి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాయించుకుంటున్నారు. ఈ 5 ఏళ్లలో విశాఖపట్నంలో జరిగినన్ని అరాచకాలు నా జీవితంలో చూడలేదు. ఒకప్పుడు విశాఖ ఆర్థిక రాజధాని.. ఈ రోజు విశాఖ గంజాయి రాజధానిగా మారిపోయింది. విశాఖ అంటే నాకు ఎప్పుడూ అత్యంత ప్రీతి ప్రాంతం. హుద్‌ హుద్‌ వస్తే 10 రోజులు ఇక్కడే ఉండి విశాఖ ప్రజల సహకారంతో హుద్‌ హుద్‌ కు ముందు హుద్‌ హుద్‌ తర్వాత అన్నట్లు మార్చాము. జగన్‌ రెడ్డి రివర్స్‌ పాలన అన్నాడు కానీ విద్వంస పాలనకు నాంది పలికాడు. కక్ష సాధింపులు, విద్వంసాలు చేస్తే ఏం జరుగుతుందో  ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌.

ఒక్క ఛాన్స్‌ పాపానికి 30 ఏళ్లు వెనక్కి..!

ఒక్క ఛాన్స్‌ అన్నాడు… దాని పాపానికి 30 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే… వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని బేషరతుగా ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ని అభనందిస్తున్నాను. రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ అందరికీ ఉంది కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. హైదరాబాద్‌ ని నేను అభివృద్ధి చేశాను, నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు జగన్‌లా విధ్వంసం చేసి ఉంటే ఈ రోజు హైదరాబాద్‌లో అంత సంపద ఉండేది కాదు. అమరావతి రాజధానిగా ఉంటుంది విశాఖ ఆర్థిక రాజధాని, ఐటి హబ్‌గా ఉంటుందని నేను చెప్పాను. అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కల ఆటాడాడు. రుషికొండకు బోడు గుండు కొట్టి విలాసం కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టే హక్కు ఈ  ముఖ్యమంత్రికీ ఎవరిచ్చారు? ఇవన్నీ తలుచుకుంటుంటే ఆవేదనతో గుండెలు పిండేసినట్లుంటుంది. పోలవరం రాష్ట్రానికే వరం, తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2020కి పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఆంధ్రప్రదేశ్‌లో కరువనే మాట లేకుండా చేసేవాళ్ళం. విద్య, వైద్యం, రోడ్లు, వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించాడు. ఇసుక, లిక్కర్‌ స్కాంలు చేస్తూ స్వార్దం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.  అబద్దాల పునాదులుమీద వైసీపీ నిర్మితమైంది, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ తెస్తామన్నారు తెచ్చారా? మద్యపాన నిషేదం అన్నారు చేశారా? మద్య నిషేధం చేయకపోగా మద్యంపై వచ్చే  ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.  సీపీఎస్‌ రద్దు అన్నారు,  చేశారా? సొంత బాబాయిని చంపారు, నాడు సీబీఐ విచారణ కావాలన్నారు, అధికారంలోకి వచ్చాకా సీబీఐ విచారణ వద్దన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?

వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. గతంలో పవన్‌ కళ్యాణ్‌ పై కేసులు లేవు, నేడు ఆయనపై కూడా కేసులు పెట్టారు. నాపై తప్పుడు కేసులు పెట్టారు, అవి  కోర్టులో అంశం కాబట్టి మాట్లాడటం లేదు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజలెవరూ స్వేచ్చగా బ్రతికే పరిస్థితి లేదు.  ప్రజల గొంతు మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నా… రక్షించే నాధుడే లేడు. పోలీసులను  భయపెట్టి ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, కొంత మంది పోలీసులు మాత్రం అధికార పార్టీకి తొత్తులుగా మారారు. తప్పుడు పనులు చేసిన  అధికారులను చట్టపరంగా శిక్షించే వరకు వదలిపెట్టం. ముఖ్యమంత్రి  పదవి కావాలనో,  అధికారం కావాలనో మేం పోరాటం చేయటం లేదు, రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరాడుతున్నాం. ఈ సభకు కేంద్రం అద్దెకు రైళ్లు ఇచ్చింది గానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలేదు.ప్రవేట్‌ వాహనాలు ఇవ్వకుండా అడ్డుపడ్డారు,  ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా లక్షలాది మంది స్వచ్చందంగా  సభకు వచ్చి విజయవంతం చేశారు’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Tags: ఉమ్మడి మ్యానిఫెస్టోచారిత్రాత్మకంజగన్‌ సినిమా అయిపోయిందిజనసేనటీడీపీనవశకం సభనారా చంద్రబాబు నాయుడుపొత్తుయువగళం ప్రజా గర్జనవైసిపి ఓటమి ఖాయంవైసీపీ కబ్జా
Previous Post

యువగళం – నవశకం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు.

Next Post

ఇది నవశకం, యుద్ధానికి ఆరంభం

Next Post
ఇది నవశకం, యుద్ధానికి ఆరంభం

ఇది నవశకం, యుద్ధానికి ఆరంభం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.