అమరావతి, చైతన్యరథం: మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ రానున్న తరుణంలో ఆయన్ను అక్రమ అరెస్ట్‌కు ప్రయత్నించడం జగన్ సైకోయిజానికి పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో
‘‘సంగం డెయిరీని కబ్జా చేయాలని చూశారు, సాధ్యం కాలేదు. సర్కారు కబ్జాలకు అడ్డుపడిన టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్రపై కక్ష కట్టాడు సైకో జగన్. తనపై తప్పుడు హత్యాయత్నం కేసు జగన్ నమోదు చేయించగా, హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నరేంద్ర. బెయిల్ వచ్చేలోపే అక్రమ అరెస్టుకి యత్నించడం జగన్ సైకోయిజానికి పరాకాష్ట. నరేంద్రపై వైసీపీ పెడుతున్న తప్పుడు కేసులు, నిర్బంధాలు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.