అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారు.. ఇటువంటి మహనీయుల చరిత్రను గుర్తు చేసుకోవడం గర్వకారణమని కొనియాడారు. ఆయన ఫోటోకు పూలదండ వేసి ఘనమైన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ బడేటి చంటి, పుంగనూరు నియోజకవర్గం ఇంచార్జ్ చల్లా బాబు, టీడీపీ కార్యదర్శులు, ఏ.వి. రమణ, బుచ్చి రాంప్రసాద్, తెనాలి మాజీ మున్సిపల్ ఛైర్మన్ పెండ్యాల వెంకట్రావ్, ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, ఆహ్వాన కమిటీ సభ్యులు హసన్ భాష, గుంటూరు కార్పొరేటర్ బాబు, గుంటూరు వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకట రత్నం, ఆర్యవైశ్య నాయకులు తుమ్మలపెంట శ్రీనివాస్, తలాను శేఖర్, నందిపాటి నరసింహారావు, సాయిరాం, మువ్వల శ్రీనివాస్, మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.