టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సత్యసాయి మంచినీటి పథకాన్ని దత్తత తీసుకొని మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ధర్మావరం నియోజకవర్గం నామాల క్రాస్ వద్ద శనివారం అనంతపురం జిల్లా సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ దీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి సేవలను వినియోగించుకుంటామన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాదిమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న సత్యసాయి మంచినీటి పధకానికి నిర్వహణ నిధులు సమకూర్చలేక పధకాన్ని పాడుబెట్టడం దారుణమని చెప్పారు. కరెంటు బిల్లు, కార్మికుల జీతాలు చెల్లించకపోవటం జగన్మోహనరెడ్డి ప్రభుత్వ దివాలాకోరుతనానికి అద్దం పడుతుందన్నారు.