చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మహానటుడు

by చైతన్యరధం
Sep 29, 2022 at 12:18pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
మహానటుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బోటు షికారుకోసం చెరువును కబ్జా చేసిన ఘనుడు
  • 400మంది రైతుల నోట్లో మన్ను
  • తన సరదా కోసం 2వేల ఎకరాల ఆయకట్టును బీడుగా మార్చిన వైనం
  • మాట వినలేదని దళిత కలెక్టర్‌ గంధం చంద్రుడును పంపించిన కేతిరెడ్డి
  • గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం పేరుతో కమలాసన్‌ మించిన నటన

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అనంతపురం)
గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం అంటూ ఉదయాన్నే లేచి వీధుల్లో తిరుగుతూ అమ్మా, అక్కా, చెల్లీ అంటూ ఎనలేని ప్రేమ కురిపించేస్తూ అధికారులకు ఒకేఒక్క డు సినిమా హీరో స్టయిల్‌లో సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కరించేసినట్లుగా కనికట్టుచేస్తున్న మహానటుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈయన సోషల్‌ మీడియాలో చేసే హల్‌చల్‌ చూసి ముఖ్య మంత్రి జగన్‌ రెడ్డి సైతం ఫిదా అయిపోయి ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన ఒక సమావేశంలో మిగిలిన వారు ఈయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రినే బురిడీకొట్టించిన ఈయన చాకచక్యంచూసి అనంతపురం జిల్లాలోని సహచర వైసిపి ఎమ్మెల్యేలు ముక్కున వేలేసుకున్నారు. ఈయన చేసే హడావిడి అంతా ముందుగా నాటకానికి ముందు రిహార్సల్‌ చేసుకున్నట్లుగా పక్కా ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాగుతుంది. కమలాసన్‌ మించి కేతిరెడ్డి చేసే నటనను వాస్తవమని భ్రాంతికలిగించేలా సోషల్‌ మీడియాలో ప్రచారానికి ఈయన చేసే ఖర్చు అక్షరాలా నెలకు రూ.10లక్షల రూపాయలు. పొరుగున ఉన్న బెంగుళూరు నుంచి స్పెషల్‌ ఎఫెక్ట్‌ ల కోసం రప్పించిన నిపుణుల బృందం కోసం ఏకంగా ఒక గెస్ట్‌ హౌస్‌నే మెయింటెయిన్‌ చేస్తున్నారంటే ఈయన మ్యాజిక్‌ ఏ రేంజిలో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.

వేధింపులకు కేరాఫ్‌ వెంకట్రామిరెడ్డి
ఇక విషయానికొస్తే ఈయన గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం సందర్భంగా చేసే యాక్షన్‌, చెప్పేమాటలు వింటే నీతి, నిజాయితీ లకు నిలువుటద్దమేమోనని తెలియని వారు మోసపోతుంటారు. ఆయన రెండో ఓరూపం మాత్రం వేరుగా ఉంటుంది. ఇటీవల ఈయన తన పరంపరలో భాగంగా ‘‘వార్డుల్లో వాలంటీర్లు కరప్షన్‌ చేస్తున్నారు, మర్యాదగా వారు జనాల వద్దకు వెళ్లి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయండి, జనాల వద్ద డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే చెప్పుతో కొడతా’’ అంటూ ఓ వాయిస్‌ రికార్డును పంపారు. అంతకుముందు రోజు గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరంలో సరిగా పనిచేయని సచివాలయ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ హూంకరించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులందరి లూప్‌ హోల్స్‌ తెలుసుకొని వారిని బెదిరించి తమకు కావాల్సిన అడ్డమైన పనులు చేయించుకోవడం ఈయన రోజువారీ పర్యటనల వెనుక అసలు రహస్యం. మాటవినని అధికారులను బెదిరించడం, బదిలీల పేరుతో వేధించడం ఈయనకు వెన్నతోపెట్టిన విద్య. కొంతకాలం క్రితం ధర్మవరం నియోజకవర్గంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను తప్పించి తాము చెప్పినవారికి రిజిస్ట్రేషన్‌ చేసేలా వీలుకల్పిం చాలని మాజీ కలెక్టర్‌ గంధం చంద్రుడుపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వత్తిడితెచ్చారు. ప్రగతిశీల భావాలు కలిగిన దళిత కలెక్టర్‌ చంద్రుడు అందుకు ఒప్పుకోక పోవడంతో ఆయనను బదిలీచేయించే వరకు కేతిరెడ్డి నిద్రపోలేదు. కలెక్టర్‌ బదిలీ తర్వాత ధర్మవరం నియో జకవర్గంలో ప్రభుత్వాధికారులపై ఈయన వేధింపులు పతాకస్థాయికి చేరాయి. నేను చెప్పినపని చేస్తారా, లేదా, కలెక్టర్‌ నే పంపించాను, మీరెంత అంటూ అధికారులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ తమ దందాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

సంబంధితవార్తలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

రికార్డుస్థాయిలో పింఛన్ల పంపిణీ

వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సిందే

బోటింగ్‌ సరదా కోసం రైతుల జీవితాలతో చెలగాటం
ధర్మవరం శివార్లలో సుమారు 400మందికి పైగా రైతులు సాగుచేసుకునే 2వేల ఎకరాల భూమి సాగు నీటికి ధర్మవరం చెరువే ఆధారం. అయితే 2019 ఎన్నికల తర్వాత సెటిల్మెంట్లు, దందాలతో ఊహించని విధంగా వచ్చినపడిన వందలకోట్ల సంపదలో కొంత భాగాన్ని విలాసాల కోసం వెచ్చిస్తూ తన సరదాలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి చెరువుని ఆనుకొని సుమారు 100 ఎకరాల్లో ఒక విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌ ను నిర్మించుకున్నారు. ఇందులో చెరువులో అంతర్భాగ మైన 15ఎకరాలను పూడ్చి ఆక్రమించుకున్నారు. రెవిన్యూ అధికారులను లోబర్చుకొని సర్వేనంబర్‌ 902 నుంచి 908వరకు 20 కొత్త నంబర్లను సృష్టించి సుమారు 25ఎకరాల ఎసైన్డ్‌ భూమిని కేతిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. కేవలం తన బోటింగ్‌ సరదా కోసం 400మంది రైతుల నోట్లో మట్టిగొట్టి ధర్మవరం చెరువును చెరబట్టి 2వేల ఎకరాల సాగుభూమిని బీడుగా మార్చారు. చెరువును ఫామ్‌ హౌస్‌ లో అంతర్భాగం చేసుకొని విలాసాలకోసం ఉపయోగించుకున్న కేతిరెడ్డి వికృతరూపం తెలియనివారు ఈయన ప్రజాసేవలో తరిస్తున్న నేత అని భావిస్తూ తప్పులో కాలేస్తుంటారు. ఎర్రగుట్టమీద ఉన్న భూములను సైతం అధికారులను లోబర్చుకొని తమ సమీప బంధువుపేరుతో పిత్రార్జితంగా రికార్డులు తారుమారుచేసి వందలకోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు.

విలాసవంతమైన కార్లు, గుర్రాలతో హల్‌ చల్‌
మహానటుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌ లో ఈయన చూపిన ఆస్తులు కేవలం రూ.5కోట్ల రూపాయలు. ఈరోజు కేతిరెడ్డి ఆస్తులు రూ.500 కోట్ల పైమాటే. కేవలం 40నెలల్లో సమయంలో ఇంత భారీగా కూడబెట్టారంటే ఈయన సెటిల్మెంట్లు, దందాల రేంజి ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈయన వద్ద 10కోట్ల రూపాయల విలువచేసే విలాసవంతమైన కార్లు ఉన్నాయి. గుర్రపుస్వారీ సరదా కోసం ఒక్కొక్కటి 20లక్షల రూపాయల విలువచేసే 10 జాతిగుర్రాలను ఫాంహౌస్‌ లో పెంచుతున్నాడు. తాను ఆక్రమించిన చెరువు స్థలం పదెకరాల్లో విలాసవంతమైన భవంతి నిర్మించుకున్నాడు. రైతుల సాగునీటికోసం ఉపయోగించే చెరువు చానళ్లను బంద్‌ చేసి చెరువులో మినీబోట్లతో షికార్లు చేస్తున్నారు. ఫామ్‌ హౌస్‌ లో చేసే కార్యకలాపాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ధర్మవరం చెరువుచుట్టూ ఏకంగా ఒక ప్రైవేటు సైన్యాన్నే కేతిరెడ్డి పహారాగా పెట్టుకున్నారు. కేతిరెడ్డి అక్రమ దందాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు గవర్నర్‌ కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి నిజస్వరూపం తెలియని బయటప్రజలు నేటి రాజకీయాల్లో ఆయనో ఆదర్శవంతమైన నేత అని సిఎం జగన్‌ మాదిరిగా పొరబడుతుంటారు. అయితే నిజం నిప్పులాంటిది. నేడు కాకపోతే రేపు..రేపు కాకపోతే ఎల్లుండయినా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి అక్రమార్కుల పాపాలపుట్ట పగలడం ఖాయం. అప్పటివరకు ఈయన అసమాన నటనను ధర్మవరం ప్రజలు చూసి తీరాల్సిందే.

Tags: ఎసైన్డ్‌ భూమికమలాసన్‌కలెక్టర్‌ గంధం చంద్రుడుకేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిగుడ్‌ మార్నింగ్‌ ధర్మవరంగుర్రాలుచెప్పుతో కొడతాతాడేపల్లి ప్యాలెస్నిషేధిత జాబితాఫామ్‌ హౌస్‌బోటింగ్‌మహానటుడుయాక్షన్‌రైతులువాలంటీర్లువేధింపులుసచివాలయ ఉద్యోగులు
Previous Post

జగన్‌ రెడ్డి దంపతులు హిందూ మతవిశ్వాసాలను గౌరవించలేరా?

Next Post

రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించు తల్లీ

మరిన్ని వార్తలు

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం
ఆంధ్రప్రదేశ్

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!
ఆంధ్రప్రదేశ్

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం
ఆంధ్రప్రదేశ్

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

పార్టీ పదవుల్లో సామాజిక న్యాయం

చైతన్యరధం
@ April 16, 2026
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అదృష్టంగా భావిస్తున్నా
ఆంధ్రప్రదేశ్

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అదృష్టంగా భావిస్తున్నా

చైతన్యరధం
@ April 16, 2026
క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం
ఆంధ్రప్రదేశ్

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

నీటి భద్రతకు జలధార యాక్షన్ ప్లాన్

చైతన్యరధం
@ April 16, 2026
శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

శరవేగంగా అనుమతులు..సరళంగా నిబంధనలు!

చైతన్యరధం
@ April 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రం

చైతన్యరధం
@ April 16, 2026
టీమ్-2029 సిద్ధం!

టీమ్-2029 సిద్ధం!

చైతన్యరధం
@ April 16, 2026
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత

చైతన్యరధం
@ April 16, 2026
లోకేష్ కృషికి దక్కిన ఫలితం

లోకేష్ కృషికి దక్కిన ఫలితం

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist