Tuesday, 28 April 2015 20:43

బ్రెజిల్ కు చెందిన ఉక్కు తయారీ సంస్థ గెర్డావు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత ఏడాది రూ. 500 కోట్ల పెట్టుబడితో, ఏడాదికి మూడు లక్షల టన్నుల కోక్ ను ఉత్పత్తి చేయగల భారీ కోక్ ఓవెన్ ప్లాంటును ప్రారంభించింది. నేల బొగ్గు నుంచి వాయువులను బయటకు తీసిన తర్వాత మిగిలే ఘన పదార్ధాన్ని కోక్ అంటారు. దీంతో నాణ్యమైన ఉక్కును తయారుచేయవచ్చు. ఇప్పుడా ప్లాంటును రూ.1000 కోట్లతో విస్తరింప చేయనుంది. దీనివల్ల ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం మరో రెండేళ్లలో అదనంగా రెండు లక్షల టన్నుల సామర్థ్యానికి పెరుగుతుంది. ఇంతవరకూ బ్రెజిల్ కు చెందిన ఏ సంస్థ కూడా ఇంత భారీ పెట్టుబడులను ఇండియాలో పెట్టలేదు. 
గెర్డావు స్టీల్ కు ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లో 60 ప్లాంట్ల వరకూ ఉన్నాయి. మొత్తంగా 200 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని గెర్డావూ సంస్థ కలిగివుంది.