Tuesday, 28 April 2015 20:41

శుక్రవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వ్యాయామ విద్యపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సమీక్షలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ఫిట్ నెస్ ట్రైనర్ దినాజ్ వెర్వెత్ వాలా, కెనడాకు చెందిన క్రీడ, మానసిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పాఠశాలలో వ్యాయమవిద్యను ప్రవేశపెట్టాలన్నారు.
వ్యాయామ విద్య (ఫిజికల్‌ లిటరసీ)ను ప్రజాఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. కార్యాచరణను తక్షణమే సిద్ధం చేయాలని క్రీడాశాఖను ఆదేశించారు. ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ దీనిపై చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. క్రీడ, విద్యాశాఖలు సమన్వయం చేసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచే వ్యాయామ విద్య కార్యక్రమాలను గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అమలు చేయాలని ఆదేశించారు. సంప్రదాయ గ్రామీణ క్రీడలైన ఖోఖో, కబడ్డీ, బిళ్లంగోడు తదితరాలకు ఆదరణ కల్పించాలని.. కూచిపూడి, యోగా, ధ్యానంలాంటి మానసిక ఉల్లాసం కల్పించే అంశాలనూ చేర్చాలని సూచించారు.