Tuesday, 28 April 2015 20:44

గత ఏడాది నవ్యాంధ్ర తొలి మేడే ఉత్సవాలను రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రప్రభుత్వం... ఈ ఏడాది విజయవాడలోని ఎ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్మిక దినోత్సవం అయిన మేడేను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం ఈ నెల 29, 30 తేదీలలో రాష్ట్ర స్థాయి కార్మిక క్రీడా, సాంస్కృక పోటీలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో (ఐజిఎంసిఎస్‌)లో నిర్వహించారు. రాష్ట్రంలోని నాలుగు జోన్లలో నిర్వహించిన పోటీల విజేతలు విజయవాడలో జరిగే ఈ తుది పోటీలకు హాజరయ్యారు. ఈ ఏడాది వాలీబాల్‌, కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, అథ్లెటిక్స్‌, నాటికలు, పాటల పోటీలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు.
గత ఏడాది మేడే నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రవాణా వాహన డ్రైవర్ల సామాజిక భద్రతా పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం రవాణా వాహన డ్రైవర్లకు రూ. 5 లక్షల వరకు ప్రమాదబీమా వర్తిస్తుంది. డ్రైవరు ప్రమాదంలో మరణిస్తే, ఆ వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యానికి రూ.75,000లు, పాక్షిక వైకల్యానికి రూ.37,500లు, సహజ మరణం అయితే రూ.30,000లు పరిహారం అందచేస్తారు. 9, 10వ తరగతి, ఇంటర్ లేదా ఐటిఐ చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1,200ల చొప్పున ఉపకారవేతనం ఇస్తారు. అలాగే గత ఏడాది ఇదే రోజున ఎపి ఉద్యోగులకు పిఆర్ సి పై 43 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేశారు చంద్రబాబు.
కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తోంది తెలుగుదేశం.