|
మరో `భూ'చక్రం? అసైన మిగులు, ప్రభుత్వ భూముల పాత రిజిసేషన్లు రద్దు... ఆ తర్వాతే యజమానులకు సమాచారం 1-4-99 నుంచి 20-6-07 మధ్య జరిగినవి మాత్రమే సబ్ రిజిషార్లేక అధికారం చట్టానికి సవరణ; మార్గదర్శకాలు జారీ పొంచి ఉన్న అనిశ్చితి ప్రమాదం!(Source: EENADU)
ఎక్కువగా భూముల చుటూ్టనే తిరుగుతున్న రాష్ట్ర వ్యవహారాల్లో మరో అనిశ్చితికి తెరలేవబోతోంది. రిజిసేషన్లు కూడా పూర్తయి... ఇప్ఫటిదకా పలువురి చేతుల్లో ఉన్న వందల కోట్ల రూపాయల భూముల్ని సర్కారు వెనక్కి తీసుకోబోతోంది. వాటి రిజిసేషన్లను రద్దు చేయడానికి `భూ' చక్రాన్ని సంధించింది. బోగస పట్టాదరు పాస పుస్తకాలు, రికార్డులతో అసైన్డు, ప్రభుత్వ, మిగులు, దేవాదయ, వక్‌ఫ భూములకు చేయించుకున్న రిజిసేషన్లన్నిటినీ రద్దు చేయాలని సంకల్ఫించింది. 1999 ఏప్రిల్ 1 నుంచి... ఈ ఏడాది జూన 20వ తేదీ వరకు... అంటే ఎనిమిదేళ్ళ వ్యవధిలో జరిగిన ఇలాంటి రిజిసేషన్లన్నీ ఇక రద్దవుతాయి. బోగస పత్రాల సాయంతో చేయించుకున్న ఇలాంటి రిజిసేషన్ల రద్దు మంచిదే కావచ్చు. కానీ ప్రభుత్వ, మిగులు, అసైన దేవాదయ, వక్‌ఫ భూముల్ని గుర్తించడానికి సర్కారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం అనిశ్చితికి తెరతీయబోతోంది. ఇప్ఫటిదకా భూములపై సమగ్ర సర్వేయే లేని నేపథ్యంలో ఎలాంటి రిజిసేషన్లు రద్దవుతాయన్నది అనుమానమే. పైపెచ్చు ఎనిమిదేళ్ళ వ్యవధిలో జరిగిన రిజిసేషన్లను రద్దు చేస్తారు కనక... బోగస పత్రాలతో రిజిసేషన చేయించుకున్న వారి దగ్గర అమాయకంగా ఆ భూముల్ని కొన్నవారు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశముంది. అలాంటి వారు నిండా మునిేగ ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్ - న్యూస రాష్ట్రంలో ఆది నుంచీ రెవెన్యూ రికార్డులు సమగ్రంగా లేవు. దీంతో ప్రభుత్వ భూములు, పేదలకిచ్చిన అసైన్డు భూములు, దేవాదయ, వక్‌ఫ భూములు భారీగా అన్యాక్రాంతమవుతున్నాయి. వీటిని రిజిస్టరు చేయకుండా... రిజిసేషన చట్టంలోని 22ఎ సెక్షను నిషేధిస్తోంది. కానీ బోగస పత్రాలు, రికార్డుల సాయంతో వీటికీ రిజిసేషన్లు కానిచ్చేస్తున్నారు. ఇవన్నీ చూసిన ప్రభుత్వం... ఇలాంటి రిజిసేషన్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చట్టాన్ని సవరించింది. రిజిసేషన్ల (సవరణ) చట్టం-2007గా పేర్కొనే దీన్ని... ఈ ఏడాది జూన 20 నుంచి అమల్లోకి తెస్తున్నటు్ల నోటిఫై చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఈ నెల 14న అన్ని రిజిషారు కార్యాలయాలకూ పంపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం... 1999 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జూన 20వ తేదీ వరకు చేసిన ఇలాంటి రిజిసేషన్లన్నింటినీ ఇక సబ్ రిజిషార్లు తమంత తాముగానే రద్దు చేస్తారు. తమ దగ్గరుండే రిజిస్టర్లలో రద్దు విషయాన్ని రాసి... ఆ వివరాన్ని రిజిసేషన చేయించుకున్న వ్యక్తులకు తెలియేస్తారు. రద్దుచేయడానికి దరితీసిన కారణలనూ వివరిస్తారు. అంతేకాక ఈ ఎనిమిదేళ్ళలో అనుమానంతో రిజిసేషన చేయకుండా పెండింగులో పెట్టిన పత్రాలన్నిటినీ ఇపుడు తిరస్కరిస్తారు. ఇలా రద్దు చేయడానికి, తిరస్కరించడానికి ఆధారంగా... తమకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పంపిన తాజా భూముల జాబితాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇటీవల అసైన భూముల సర్వే జరిపి... ఏవి అసైన్డు భూములు... ఏవి ప్రభుత్వ భూములు అనేది వివరిస్తూ ఎమ్మార్వోలు రిజిసేషన కార్యాలయాలకు జాబితాలు పంపారు. సబ్ రిజిసార్లు వాటిని సర్వే నెంబర్ల వారీ కంప్యూటరీకరించారు. ఇపుడు తాము చేసిన రిజిసేషన్లను సరిపోలు్చకొని వాటిలో చట్టవిరుద్ధంగా ఉన్నవాటిని రద్దుచేస్తారు.
ఇప్ఫుడే ఎందుకిదంతా? ఇటీవలిదకా ఏది ఏ రకం భూమో అనే చ్చితమైన వివరాలు సబ్ రిజిసార్లకు తెలిసేవి కాదు. కొందరికి తెలిసినా సరైన రికార్డులు లేవంటూ రిజిసేషన్లు చేసేసేవారు. మరి కొన్ని చోట్లయితే ప్రైవేటు భూమిని కూడా అసైన్డు, ప్రభుత్వ భూమిగా చెబుతూ రిజిస్టేషన్లు నిరాకరించారు. దీంతో కొంతమంది హైకోర్టును ఆశ్రయించి అధికారులు అభ్యంతరపెట్టిన భూమి ప్రైవేటుదేనంటూ సా్యధారాలతో నిరూపించగలిగారు. దీంతో ఈ సెక్షనే చెల్లదని హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. నాటి నుంచి ఈ సెక్షన అమల్లో లేకుండా పోయింది. ఫలితంగా ఎలాంటి రిజిసేషన్లనూ సబ్ రిజిషార్లు కాదనే అవకాశం పోయింది. దీంతో ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. ఇకపై పొరపాటు్ల జరగకుండా చూసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఫలితంగా నిర్దేశిత భూముల రిజిసేషన్లను నిరోధించే సెక్షన 22(ఎ) తిరిగి అధికారుల చేతికి వచ్చింది. ఈ అధికారంతో పాటే రికార్డులూ లభించాయి. అయితే సవరిత సెక్షన సుప్రీంకోర్టు కొట్టివేసినప్ఫటి నుంచీ కాకుండా ఎనిమిదేళ్ల వ్యవధిలో అమలు చేయాలని ఐజీ నిర్ణయించారు. తహసీల్దార్లిచ్చే జాబితాలిక చెల్లవు ఇప్ఫటిదకా ఏవి ఏ తరహా భూములనేది తహసీల్దార్లు వివరిస్తున్నారు. వీరిచ్చే జాబితాలు తప్ఫులు తడకలుగా ఉంటుండటంతో తాజా మార్గదర్శకాల్లో కొన్ని నిబంధనలను పొందుపరిచారు. ఏ భూముల వివరాల్ని ఎవరు నివేదించాలనేది స్ఫష్టంచేశారు. చి రాష్ట్ర, ేకంద్ర ప్రభుత్వాల స్థిరాస్తుల వివరాలను ఇకపై కలెక్టర్లే పంపాలి. ప్రత్యేకంగా తయారు చేసిన నమూనా పత్రం ద్వరా ఈ వివరాలను సంబంధిత రిజిసేషన ఆఫీసుకు, జిల్లా రిజిసార్‌కు, డీఐజీకి, ఐజీకి పంపాలి. జాబితాలపై అధీకృత అధికారి సంతకం ఉండాలి. జాబితాల్లో ఏవైనా మార్ఫులు, చేర్ఫులు అవసరమైతే ఆ విషయాన్ని ఇనస్ఫెక్టర్ జనరల్‌కు తెలియేయాలి. ఈ వివరాలను ఐజీ పరిశీలించి, సంబంధిత సబ్‌రిజిసార్ కార్యాలయానికి తనే పంపిస్తారు. చి జిల్లాలలో ఉండే నిషేధిత ఆస్తుల వివరాలనైతే కలెక్టరు, లేద జాయింట్ కలెక్టరు పంపాలి. చి మతపరమైన సంస్థల, దేవాదయ భూముల జాబితాలనైతే దేవాదయ శా కమిషనరు సంతకం చేసి పంపాలి. వక్‌ఫ ఆస్తులైతే వక్‌ఫ బోర్డు కార్యదర్శి సంతకం చేయాలి. ఇలాంటి భూములను ఇతరులకిచ్చినట్లయితే సంబంధిత అధీకృత అధికారి సంతకాలు, ప్రభుత్వమిచ్చిన నోటిఫిేకషన కాపీలు ఉండాలి. మార్ఫులు, చేర్ఫులను ఐజీద్వరా మాత్రమే చేపట్టాలి. చి భూ సంస్కరణల (వ్యవసాయ గరిష్ఠ పరిమితి) చట్టం, పట్టణ భూ గరిష్ఠ పరిమితి(ుుఎల్‌సి) చట్టం కింద మిగులుగా ప్రకటించిన భూముల విరాలను ఆర్డీఓ, ఆపై హోద గలవారు, ుూఎల్‌సీ ప్రత్యేక అధికారి పంపాలి. ఇలా వచ్చిన వివరాలన్నింటిని రిజిసేషన అధికారులు తమ వద్ద గల అస్తుల రిజిసేషన్ల నిషేధ పుస్తకాల్లో పొందుపర్చాలి. తరవాత 15 రోజుల్లోగా కంప్యూటర్లలోను, లిఖితపూర్వకంగాను జాగ్రత్త చేయాలి. చి రిజిసేషన అధికారులు తమకందిన వివరాలను పొందుపర్చటానికి `నిషేధ ఆస్తుల సమాచారం, నోటిఫిేకషన్ల' పేరుతో కొత్తగా ఫైళు్ళ తెరవాలి. ఇలాంటి వివరాలను ఎప్ఫటిప్ఫుడు వెబ్‌సైట్‌లోనూ అప చేయాలి. ఐజీ పంపే మార్ఫులు చేర్ఫులు కూడా పేర్కొనాలి. చి వివరాలను 3 నెలలకోసారి (జనవరి, మార్చి, జూన సెప్టెంబరులలో) డీఐజీ పరిశీలిస్తారు. తన నివేదికలను ఐజీకి పంపుతారు. నిర్ణీత రిజిస్టర్లు ఏ విధంగా ఉన్నదీ వారు ధ్రువీకరిస్తారు.
|