Telugudesam party on Facebook
Telugudesam party on Twitter
Telugudesam party Youtube Channel
Home :: President
Telugu Desam Party - TDP ( Online Membership Drive)
A Visionary Leader PDF Print E-mail

స్వర్ణాంధ్రసారధి

చంద్రగిరి ఆనాడు కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో నూతనంగా ఉదయించిన యువ నాయకుడు. దూర దృష్టితో కూడిన ఆలోచన, పరిసరాల పరిశీలన, పరిస్థుతుల అధ్యయనంలో అరితేరిన బుర్ర ఆయనది. చంద్రగిరి ప్రాంతంలో అప్పటికే యువనాయకులలో ఒకరిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. అందువల్ల ఈ లక్షణాలు చంద్రగిరి ప్రాంతంలో అప్పటికే యువనాయకులలో ఒకరిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టారు. అందువల్ల చంద్రబాబు పేరు సహజంగానే ఇందిరా కాంగ్రెసు కాబోయే అభ్యర్థుల జాబితాలో ప్రముఖంగా నిలిచింది. ఎగువ సభ ఎన్నికల బరి నుండి విరమించుకున్న మంచితనం, చురుకుదనం ఆయనకు బాగా ఉపకరించాయి. అన్నింటికి మించి పి.రాజ గొపాల నాయుడు, జయచంద్ర నాయుడు వంటి సీనియర్ నాయకుల అండదండలు పుష్కలంగా లభించాయి. పార్లమెంట్ ఎన్నికలలో చేసిన సహాయానికి గుర్తింపుగా కానివ్వండి, చురుకైన యువనేతగా పొందిన మన్ననలు కానివ్వండి పైగా ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేయించడంలో కీలక పాత్రవహించారు. పైగా ఇందిరా కాంగ్రెసుకు ఆనాటికి చంద్రగిరికి చంద్రబాబుని మించిన నాయకుడు లేరు. అప్పటికి మంది, మార్బలం, ధనబలం పుష్కలంగా కలిగిన పట్టాభిరామ చౌదరి జనతా అభ్యర్థిగా, సుబ్రహ్మణ్య చౌదరి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరితో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు పోటి విధ్యార్థులు, యువకులు ఆయనకు అండ ధనబలంతో పోటి అయినా వెనకడలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుకి తండ్రి నుండి పూర్తి అండదండలు, తల్లినుంచి పూర్తి ఆశీస్సులు లభించాయి. రెడ్డి కాంగ్రెస్ కానీ జనతా పార్టీ కానీ మోతుబరి పార్టీల కింద లెక్క.. ఆనాటి ఎన్నికలలో అతితక్కువ ఖర్చు జరిగినది. ఇందిరా కాంగ్రెస్ తరపునే ఎన్నికల తొలి రోజులలో అందరూ అనుకున్నది పోటి ప్రదానంగా జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెసుల మధ్య వుండగలదని ఇందిరా కాంగ్రెస్ దరిదాపులలో కూడా ప్ర్తఖ్యాతలు లేవు. ధనబలం లేదు, కండబలం లేదు. ఎన్నికల ప్రచారర్బాటం అంతకంటే లేదు. పైగా జనతా ప్రభంజనం జోరుగా వీస్తున్న రోజులవి. కేంద్రంలో అధికారంలో వున్న జనతా ప్రభంజనాన్ని తట్టుకోవడానికి చాలా నియోజకవర్గాలలో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని విధాల సహకరించారు. అయినా ప్రచార్ అర్బాటంలో ఇందిరా కాంగ్రెసు అభ్య్థుతులు ప్రత్యర్థుల ధాటికి తట్టుకేలేకపోయారు. కానీ పోలింగ్ సమీపించే సరికి విచిత్రంగా, అనూహ్యంగా మారిపోయింది. పోటి ప్రధానంగా జనతా - ఇందిరా కాంగ్రెసుల మధ్య కేంద్రీకృతమైంది. ప్రధాన పల్లెలు కాంగ్రెసుకు బాసటగా నిలిచాయి. గ్రామాలు రెండు వర్గాలుగా నిట్టనిలువునా చీలిన అఫూర్వ సన్నివేశం అది. ఈ రెండింటి మధ్యలో రెడ్డి కాంగ్రెసు ఉక్కిరిబిక్కిరి. రాష్ట్ర్రమంతాటా జరిగిన ఈ ముక్కోణపు పోటిల సమరంలో ఇందిరా కాంగ్రెసుదే పైచేయి అయింది. బలహీనవర్గాల ప్రభంజనం ఇతర పత్యర్థులను తుడిచిపెట్టింది. జనతా పార్టీ అతి కష్టంమీద ద్వీతియ స్థానాన్ని దక్కించుకోగా,రెడ్డి కాంగ్రెస్ మూడవ స్థానం సంపాదించిపెట్టింది. జనతా మన కథనాయకుడు చంద్రబాబు కూడా ఈ ఎన్నికలలో విజయం సాధించారు. అదీ అధికార పక్షంలో అలా ఆయన రాష్ట్ర్రస్థాయి రాజకీయ జీవితానికి అంకురర్పాణ జరిగింది. 1978 ఆసెంబ్లీ ప్రవేశం పెద్ద ముందడుగు ఎందరో యువరాజకీయ నాయకులను ఆ ఎన్నికలు తెరపైకి తెచ్చాయి. అసెంబ్లీ స్వరూప స్వభావలే మారిపోయాయి. ఆనాటి ఎన్నికలలో అలా లభించిన తొలి అవకాశాన్ని అద్బుతంగా అనిసారసాధ్యంగా అందిపుచ్చుకోని, తన రాజకీయ జీవితాన్ని కొత్తమలుపు తప్పుకున్న కొద్ది మందిలో అగ్రగణ్యుడు చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు వ్యక్తిగా అంతర్ముఖుడు అంటే లోతు మనిషి.కాని వ్యవహారాల విషయంలో సంఘజీవి. ఎప్పూడూ పది మందిని పోగేసుకుని ఏదో ఒక బృహత్ప్ర్రయత్నం మొదలు పెట్టడం ఆయన వ్యాపకం. అల్లుకుపోవడం ఆయన స్వభావం. రాజ్యం వీరభోజ్యం కాబట్టి కొత్తగా వచ్చిన ఎం.ఎల్.ఎ,లు మంత్రి పదవుల కోసం బారులు తీరారు. చిత్తూరు జిల్లాలో అప్పటికి ముఖ్య కాంగ్రెసు నేత నల్లారి అమర్‌నాథరెడ్డి ఆయన పి.వి.నరసింహరావుకు అత్యంత ప్రీతి పాత్రుడు. ముఖ్యశిష్యుడు. రాష్ట్ర్ర మంత్రివర్గంలో ఆయన స్థానానికి డోకా లేకుండా వుండేది. అలాంటి నాయకుడు ప్రతినిత్యం వహిస్తున్న జిల్లా నుండి ఎన్నికై చంద్రబాబు నాయుడుకి మంత్రి పదవి ఎక్కడ అందుతుంది. అందులోనూ ఎం.ఎల్.ఎ గా ఎన్నికయిన తొలిఛాన్స్‌లోనే అయినా చాలా మంది ఎం.ఎల్.ఎ.లు, విద్యార్థి నాయకులు చెన్నరెడ్డి వద్దకు రాయబారాలు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు మంచివాడు, నమ్మకస్తుడు, తెలివైనవాడు, మెరికా లాంటి వాడని చెప్పారు. కాని చెన్నరెడ్డి మంత్రి వర్గంలో స్థానం కల్పించలేకపోయారు. చంద్రబాబు అప్పటికి ఇంకా అవివాహితుడు. అవివాహితులు పలువురు ఎం.ఎల్.ఎ. లుగా ఎన్నికై వచ్చిన సంధర్బం రాష్ట్ర్ర శాసనసభ చరిత్రలో బహుశ అదే ప్రథమమేమో . అలాంటి అదే సంధర్బం మళ్ళీ తెలుగుదేశం గెలిచినప్పుడే పునారవృత్తమైంది. చంద్రబాబు నాయుడిది చేతులు ముడుచుకోని కూర్చోనే తత్వం కాదు. కాబట్టి తెలికగానే రాష్ట్ర్ర రాజకీయ కీకారణ్యంలోకి చోరబడ గలిగారు. ఎంతో మంది ఎం.ఎల్.ఎ. లు ఇతరులు స్నేహితులయ్యారు. అతి చిన్న వయసులోనే ఎం.ఎల్.ఎ అయ్యే అవకాశాన్ని పొందిన చంద్రబాబు తన నియోజకవర్గ అభివృద్ది పైన దృష్టిని సారించారు. రోడ్లు గొట్టపు బావులు, మంచినీటి పథకాలు తదితర ప్రజహిత కార్యక్రమాలు పెద్దయెత్తున చేపట్టడానికి అధికారుల సహయ సహకారాలతో అహరహం శ్రమించారు. హైదరాబాదులో పెద్ద బలగమే ఎర్పడింది. పలువురు ఎం.ఎల్.ఎ.లు ఇతరులు కలిసి మెలిసి పని చేసేవారు. రెడ్డి కాంగ్రెస్ తరుపున ఎన్నికై ఆ తర్వాత ఇందిరా కాంగ్రెసులో చేరిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి వీరిలో ఒకరు. ఇది రాష్ట్ర్ర్రరాజధానిలో నిలదొక్కుకోగలగడానికి ఆయనకు బాగా ఉపకరించింది.
చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉజ్వల దశ 1980లో ఆరంభమైంది. అది అక్టోబర్ నెల. 16 మంది మంత్రుల తిరుగుబాటు ఫలితంగా చెన్నరెడ్డి ప్రభుత్వం పడిపొయింది. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అంజయ్య దృష్టి వేరు. నేఫథ్యం వేరు. కాంగ్రెసులో యువ నాయకత్వం బలం పుంజుకుందంటే ఆ పుణ్యం అంజయ్యదే. అతి సామాన్యుడుగా, అమాయకుడిగా కనిపించే అంజయ్య రాజకీయంగా నేర్పరి. జిల్లాలో అప్పటి వరకు సామంతులవలె చలమణీ అవుతున్న పాత కాపుల స్థానంలో కొత్త తరాన్ని ప్రవేశపెట్టారు. జిల్లా నాయకత్వాన్ని యువతరానికి అప్పగించారు. అలా అధికార సంక్రమణం జరిగిన క్రమంలోనే చంద్రబాబునాయుడు సినిమాటోగ్రఫి మంత్రిగా కావడం. అంజయ్య 63 మంది జంబొ జెట్ మంత్రివర్గం ఆనాడు ఒక జాతీయ వింత. అది అధిష్టానవర్గం జోక్యంతో 45 కి తగ్గిన అందులో సయితం చంద్రబాబు నాయుడి స్థానం చేక్కుచెదరకుండా వుండిపొయింది. మంత్రి కావడంతో చంద్రబాబు నాయుడి పరిధి రాష్ట్ర్ర స్థాయికి పెరిగింది. పరిచయాలు పెరిగాయి. చంద్రబాబు నాయుడిది అల్లుకుపోయే తత్వం. ఆకళింపు చేసుకునే స్వభావం కాదు. తన శాఖను దానిలోని లోతుపాతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, పనితీరును మెరుగుపరచడం, అధికారులతో పని చేయించుకోవడం , కోత్త కార్యక్రమాల కోసం నిరంతరం అన్వేషించడం ఆయనకు అలవాటు. మంత్రి పదవి రావడంతో ఆయన తన ఆలోచనా పరిధిని విస్తరించుకున్నారు. అవసరానికి అనుగుణంగా తాను ఎదిగారు. సమర్థుడిగా మన్ననలు పొందారు. సినిమాటోగ్రఫి శాఖకు మొదటిసారి బయటి జనంలో గుర్తింపు లభించడం బహుశ ఆయన హయాంలోనే నేమో!.