RYTHUKOSAM RYTHUKOSAM RYTHUKOSAM
ప్రజలందరికీ నమస్కారం ! రాష్ట్రంలో వరుసగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. పంటలన్నీ నీటమునిగి కుళ్లిపోయాయి. శాసనసభలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రైతుల దీనస్థితిని వివరిస్తుంటే... కౌరవుల్లా కాంగ్రెస్ నేతలుహేళన చేశారు. పక్షవాతంతో మంచం పట్టినట్టు.. ప్రభుత్వం రైతులకు ఏసాయం అందించకుండా హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేచేసి, తూతూమంత్రంగా పర్యటించి, రైతులను మరింత క్షోభకు గురిచేసింది. అధికారంలో వున్నా లేకున్నా... నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం శ్రమించే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రైతన్నల కన్నీటి బాధలు వినేందుకు వరదపీడిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతన్నలకు బాసటగా వుంటానని హామీ ఇచ్చారు. మాటకు కట్టుబడ్డ చంద్రబాబు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. రైతన్నకు న్యాయం జరిగేవరకూ మెతుకు ముట్టేదిలేదంటూ నిరాహార దీక్షచేపట్టారు.దీంతో రైతుమేలు గురించి ఎలాంటి హామీ లేకుండా కుట్రపూరితంగా చంద్రబాబు దీక్షను భగ్నం చేయించిందీ ప్రభుత్వం. అయినా లెక్కచేయక ..లక్ష్యం కోసం ఆస్పత్రి లో కూడా నిరాహార దీక్షను 8రోజుల పాటు నిరవధికంగా కొనసాగించారు చంద్రబాబు.కరుడుగట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కనికరించవని, చంద్రబాబు ఉద్యమం కేవలం ఆంద్రరాష్ట్రానికే పరిమితం కాకూడదని.. ఆ ఉద్యమం జాతీయ స్థాయిలో జరగాలని.. అందుకోసం దీక్షవిరమించాలని.. తొమ్మిది పార్టీల జాతీయ నాయకుల సూచన మేరకు చంద్రబాబు దీక్షవిరమించారు.పట్టువదలని విక్రమార్కుడిలా కళ్లుమూసుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపి... జాతీయస్థాయి పోరాటానికి నాందిపలికేందుకు చంద్రబాబు నడుంబిగించారు. వరద ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన గుంటూరులో ని కాసుబ్రహ్మానందరెడ్డి స్టేడియంలో "రైతుకోసం" మహాసభను నిర్వహిస్తున్నారు. పల్లెనుచి ఢిల్లీ దాకా రైతుగళం వినిపిస్తున్న ఈ మహాసభ దృష్యాలను వెబ్ సైట్ ( rythukosam.telugudesam.org) ద్వారా మీకందిస్తున్నాం.
- తెలుగుదేశం పార్టీ


Photos
        Click here for More...
Videos
        Click here for More...
 
News